వర్మ వంగవీటి రివ్యూ | Vangaveeti movie review.

Teluguwishesh వంగవీటి వంగవీటి RGV Vangaveeti Telugu Movie Review. Product #: 79852 2.5 stars, based on 1 reviews
 • చిత్రం  :

  వంగవీటి

 • బ్యానర్  :

  రామదూత క్రియేషన్స్

 • దర్శకుడు  :

  రాంగోపాల్ వర్మ

 • నిర్మాత  :

  దాసరి కిరణ్ కుమార్

 • సంగీతం  :

  రవిశంకర్

 • సినిమా రేటింగ్  :

  2.52.5  2.5

 • ఛాయాగ్రహణం  :

  రాహుల్ శ్రీవాత్సవ్ - దిలీప్ వర్మ - సూర్య చౌదరి

 • ఎడిటర్  :

  సిద్ధార్థ

 • నటినటులు  :

  సందీప్ కుమార్, నైనా గంగూలీ, శ్రీతేజ్ వంశీ చాగంటి, కౌటిల్య తదితరులు

Vangaveeti Movie Review

విడుదల తేది :

2016-12-23

Cinema Story

కథ:
బెజవాడలో వెంకట రత్నం అనే ఓ బడా రౌడీ రాజ్యమేలుతున్న రోజులవి. సెటిలింగ్ డీలింగ్ లు అన్నీ అతని చేతిలోనే ఉండేవి. అదే అతనికి గౌరవమర్యాదలు అందించేవి కూడా. ఇక వెంకటరత్నం అండతో నగరాన్నే శాసించే స్థాయికి ఎదుగుతాడు బస్టాండ్ రాధా (సందీప్ కుమార్). అయితే రాధా ఎదుగుదల వెంకటరత్నానికి కంటగింపు అవుతుంది. అతణ్ని ఇంటికి పిలిపించి మరీ అవమానిస్తాడు. దీంతో రాధా.. వెంకటరత్నాన్ని మట్టుబెట్టి విజయవాడను తన గుప్పెట్లోకి తెచ్చుకుంటాడు.

 

ఆపై రాధాకు.. దేవినేని అన్నదమ్ములైన గాంధీ (కౌటిల్య).. నెహ్రూ (శ్రీతేజ్) దగ్గరవుతారు. ఇంతలో తమ నేతను మట్టుబెట్టాడన్న కోపంతో వెంకటరత్నం పార్టీ మనుషులు రాధాను చంపేస్తారు. దీంతో రాధా తమ్ముడైన రంగా అతడి స్థానంలోకి వస్తాడు. వెంటనే రాజకీయ మలుపుల కారణంగా రంగ ప్రజా నేతగా ఎదగటం, అది నచ్చని ఓ పార్టీ అతన్ని ఎలా చంపింది. చివరగా దుర్గమ్మ సాక్షిగా జరిగిన హత్యాకాండకు ముగింపు ఎలా జరిగింది అన్నదే కథ.

cinima-reviews
వంగవీటి

చాలా కాలం తర్వాత రక్త చరిత్ర సినిమాతో ఒక్కసారి వెలిగిన వర్మ తర్వాత తన పాత పంథాతో తుస్సుమనిపించే సినిమాలే అందించాడు. చివరగా కిల్లింగ్ వీరప్పన్ తో ఆకట్టుకున్నప్పటికీ తన స్థాయి సినిమా అనిపించుకోలేకపోయాడు. దీంతో ఆఖరి సినిమా, ప్రాణం పెట్టి తీశానంటూ వంగవీటి ప్రమోషన్ చేసుకొచ్చాడు. విజయవాడ రౌడీ రాజకీయాలతో ముడిపడిన సినిమా, పైగా రెండు వంశాల మధ్య కొట్లాటకు సంబంధించింది కావటంతో ఆటోమేటిక్ గా హైప్ క్రియేట్ అయ్యింది. మరి వర్మ ఆ అంచనాలను అందుకున్నాడా? చూద్దాం.

విశ్లేషణ:

నిజజీవిత క్రైమ్ గాథలు అంటే చాలూ వర్మకు ఎక్కడా లేని ఉత్సాహం వచ్చేసింది. అందులోని ఇంటెన్సిటిని సరిగ్గా క్యాచ్ చేసి పర్సనల్ గా తీసుకుని అద్భుతంగా ప్రజెంట్ చేస్తుంటాడు. వంగవీటిలోనూ అదే జరిగింది. అయితే ఎటోచ్చి నేరేషన్ దగ్గరే వర్కవుట్ కాలేదని అనిపించకమానదు. 80లో నెలకొన్న పరిస్థితులు, యథార్థ గాథలను ఉన్నది ఉన్నట్లుగా చూపించే ప్రయత్నంలో నటీనటులను వాడుకున్న విధానం, కథ అంతా చక్కగా కుదిరింది. కానీ, మధ్యలో వాయిస్ ఓవర్ కాస్త చిరాకు పుట్టిస్తుంది. ఇక రక్త చరిత్రలాంటి సినిమాలో పవర్ ఫుల్ డైలాగులు వాడిన వర్మ ఇందులో ఆ పని చేయలేకపోయాడు. ఎక్కువ శాతం ఫ్రేమ్ ల మీద ఆధారపడటంతో బోర్ కొట్టించక మానదు. బహుశా హింసా ఎక్కువైనందున ఆ ఫీలింగ్ కలగొచ్చచు. ఇక వెంకటరత్నం, గాంధీ, మురళి హత్యలకు కంక్లూజన్ ఇచ్చిన వర్మ రంగా మరణం వెనక ఉన్నది ఎవరు అన్నది మాత్రం ప్రశ్నగానే వదిలేయటం మాత్రం ఆకట్టుకుంది.


నటీనటులు.. సందీప్ కుమార్ డ్యూయోల్ రోల్ లో ఆకట్టుకున్నాడు. రాధా.. రంగా పాత్రలు రెండింట్లోనూ సులువుగా ఒదిగిపోయాడు. ఇలాంటి నటులను వర్మ ఎక్కడి నుంచి తీసుకొస్తాడో అని ఆశ్యర్యం కలగక మానదు. వర్మ మార్క్ క్లోజప్ షాట్లలో అతను ఇచ్చిన హావభావాలు సూపర్. హ్యాపీడేస్ లో సాఫ్ట్ గా కనిపించే వంశీ చాగంటి.. దేవినేని మురళి పాత్రలో ఆశ్చర్యపరిచాడు. నెహ్రూ పాత్రలో శ్రీతేజ్ కూడా ఆకట్టుకున్నాడు. నైనా గంగూలీ.. కౌటిల్య కూడా బాగా చేశారు. వెంకటరత్నం దగ్గరి నుంచి సినిమాలో మిగతా నటీనటులందరూ కూడా ఆకట్టుకుంటారు. కొత్త వాళ్లైనా పాత్రలో వాళ్లు లీనమైన తీరు, పాత్రల తాలూకు మార్పుల్ని వర్మ చక్కగా ప్రజెంట్ చేశాడు.


టెక్నికల్ అంశాల విషయానికొస్తే... రవిశంకర్ మ్యూజిక్ ఫర్వాలేదు. గత సినిమాలతో పోలిస్తే బ్యాగ్రౌండ్ స్కోర్ లో కాస్త లౌడ్ నెస్ కొంచెం తగ్గించాడు. ‘మరణం’ సాంగ్ బాగుంది. బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు తగ్గట్లుగా ఉంది. మాటలు కూడా సన్నివేశాలకు తగ్గట్లుగా సంక్షిప్తంగా ఉన్నాయి. నిర్మాణ విలువలు ఓకే. డైలాగులు తక్కువగానే ఉన్నప్పటికీ, ఉన్నకాసిన్నీ ఫిలాసఫికల్ మాటలు ఆకట్టుకుంటాయి. ఇక దర్శకుడిగా వర్మ తన ముద్రను చూపించాడు. సినిమా అంతటా ఆయన వినిపిస్తాడు. కనిపిస్తాడు. టేకింగ్ పరంగా వర్మకు ఫుల్ మార్కులు పడతాయి కానీ.. జనాలు ఆశించినంత విపులంగా కథను చెప్పలేకపోయాడు.


ఫ్లస్ పాయింట్లు..
కథ
లీడ్ రోల్స్ నటన
వర్మ దర్శకత్వం

 

మైనస్ పాయింట్లు
స్లో నారేషన్
పాటలు
హింస

తీర్పు:

వర్మ గత చిత్రాల కంటే వంగవీటి మంచి బెటర్ గా ఉంది. కానీ, బెస్ట్ అని చెప్పలేం. కొన్ని సందర్భాలలో ఎంత గ్రిప్పింగ్ గా చూపించాడు.. అంతే రేంజ్ లో తేలిపోయాడు కూడా. చెప్పాలనుకున్న కథను హింసాత్మక రాజకీయాలతో చూపించాలనుకున్న యత్నం కాస్త బెడిసి కొట్టించిందనే అనుకోవాలి. బెజవాడ రౌడీయిజం గురించి అవగాహన ఉన్నవాళ్లకి ఎక్కోచ్చుగానీ, ఆర్టినరీ ప్రేక్షకులకు ఆర్జీవీ వంగవీటి అంత రుచించదు. ఓవారల్ గా డెప్త్ లేని కథతోనే్ వర్మ పలకరించాడనే అనుకోవాలి. 


చివరగా... వంగవీటి వర్మ మెరుపులు లేవు.. రక్తపు మరకలే ఉన్నాయి.

Author Info

Bhaskar

పూర్తి పేరు భాస్కర్ గౌడ్ శ్రీపతి.  ఏ వార్త అయినా సరే సింపుల్ గా రాసేందుకు ప్రయత్నిస్తుంటాడు. సమకాలీన రాజకీయాలు, పరిస్థితులపై విశ్లేషణ చేసి వ్యాసాలు రాయటం అదనపు బాధ్యతగా నిర్వహిస్తున్నాడు.  సినిమాలు చూడటం అంటే ఇతనికి ఎక్కువ పిచ్చి.  స్టాంపుల సేకరణ, కాయిన్ కలెక్షన్ ఇతని హాబీలు. సోషల్ మీడియా అప్ డేట్లతో వార్తలు త్వరగతిన అందించడం ఇతని ప్రత్యేకత. అయాన్ రాండ్ నవలలు ఎక్కువగా చదువటం, కార్డూన్లు ఎక్కువ చూడటం చేస్తుంటాడు.