• చిత్రం  :

  జయమ్ము నిశ్చయమ్మురా

 • బ్యానర్  :

  సుకుమార్ రేటింగ్స్

 • దర్శకుడు  :

  శివరాజ్ కనుమూరి

 • నిర్మాత  :

  శివరాజ్ కనుమూరి

 • సంగీతం  :

  రవిచంద్ర

 • సినిమా రేటింగ్  :

  2.752.75  2.75

 • ఛాయాగ్రహణం  :

  నగేష్ బానెల్

 • ఎడిటర్  :

  వెంకట్

 • నటినటులు  :

  శ్రీనివాస్ రెడ్డి, పూర్ణ, పోసాని, కృష్ణ భగవాన్, ప్రవీణ్, శ్రీ విష్ణు, తదితరులు

Jayammu Nischayammura Raa Review

విడుదల తేది :

2016-11-25

Cinema Story

కథ:

తెలంగాణ లోని కరీంనగర్ కు చెందిన సర్వ మంగళం అలియాస్ సర్వేశ్ కుమార్(శ్రీనివాస్ రెడ్డి) ప్రభుత్వ ఉద్యోగాల వేటలో ఉన్న ఓ యువకుడు. తన మీద కంటే మూఢనమ్మకాల మీద ఎక్కువ నమ్మకం పెంచుకున్న సర్వేశ్, పితా(జీవా) అనే దొంగ సాధువు చేతిలో పడతాడు. అయితే అదృష్టం బాగుండి కాకినాడలోని మున్సిపల్ కార్యాలయంలో జాబ్ దొరకుతుంది. అనారోగ్యంతో ఉన్న తల్లికి త్వరలో ట్రాన్స్ ఫర్ చేసుకుని వస్తానంటూ బయలుదేరతాడు.

 

అక్కడ మీ సేవలో పని చేసే రాణి(పూర్ణ)ను చూసి ప్రేమలో పడిపోతాడు. తన ప్రేమను వ్యక్తం చేసే లోపే తాను మరోకరిని ప్రేమిస్తున్నానని చెబుతుంది రాణి. అప్పుడు సర్వేశ్ ఏం చేశాడు? ప్రేమను దక్కించుకున్నాడా? అందుకోసం పడిన పాట్లు ఏంటి? చివరకు ఏం జరిగింది? అన్నదే కథ ...

cinima-reviews
జయమ్ము నిశ్చయమ్మురా

విశ్లేషణ:
సమైక్యంగా నవ్వుకుందాం ఇది ఈ సినిమా టాగ్ లైన్. అందుకు తగ్గట్లుగానే తెలంగాణ అబ్బాయి, ఆంధ్రా అమ్మాయి అంటూ మంచి ఎంటర్ టైనింగ్ కథనే అందించాడు దర్శకుడు శివరాజ్. యూత్ తోపాటు ఫ్యామిలీస్ సైతం ఆదరించేలా ఓ మంచి ప్రేమకథను రూపొందించాడు. ప్రేమించిన అమ్మాయి వేరే అతనిని ఇష్టపడటం అన్న స్టోరీతో చాలా సినిమాలు మనకు కొత్తేం కాదు. కానీ, ఇది కాస్త ప్రత్యేకంగా అనిపిస్తుంది. అందుకు కారణం సినిమా డబుల్ మీనింగ్ డైలాగులు లేకుండా నీట్ గా ఉండటమే. లీడ్ పాత్రలతోపాటు అడపా ప్రసాద్, గుంటూరు పంతులు, తత్కాల్ అన్నీ వినోదాన్ని పంచిన పాత్రలే. అయితే ఎటొచ్చి సినిమాలో విసుగుపుట్టించే అంశం ఏదైనా ఉంది అంటే.. అది సెకండాఫ్ సాగదీతే అనుకోవాలి.

హీరోయిన్ ప్రేమ వ్యవహారం తెలీశాక హీరో డల్ అయిపోవటం, ఆపై కాన్ఫిడెంట్ తెచ్చుకుని విడదీసే ప్రయత్నం చేయటం, చివరకు రియలైజ్ అయి వారిని కలపాలని చూడటం ఇదంతా ఏదో తెలుగు సీరియల్ ను చూశామనే ఫీలింగ్ కలగజేస్తుంది. దానికి తోడు కామెడీ పాలు కూడా కాస్త తగ్గిపోవటంతో ప్రేక్షకుడు ఓపికగా కూర్చోవాల్సి వస్తుంది. ఈ విషయంలో సినిమా ఓ పది నిమిషాలు కోత పెట్టి ఉండే బావుండేదేమో.

ఇక నటీనటుల విషయానికొస్తే.. సర్వ మంగళం పాత్రలో నటించాడు అనే కంటే ఒదిగిపోయాడు అనటం శ్రీనివాస్ రెడ్డికి సూటవుతుందేమో. తెలంగాణ యాసలో డైలాగులు బాగా చెప్పాడు. ఓవైపు అమాయకత్వం, మరో వైపు నిజాయితీ పరుడైన ప్రేమికుడిగా నటిస్తూ, ఇంకోవైపు తనలోని కామెడీ టైమింగ్ ను కూడా ప్రదర్శించాడు. ఈ సినిమాతో హీరోగా మరో మెట్టు ఎక్కాడనే చెప్పుకోవచ్చు. ఇక పూర్ణ పాత్ర చివరి వరకు వెంటాడుతూనే ఉంటుంది. కృష్ణ భగవాన్, పోసాని, ప్రవీణ్, శ్రీ విష్ణు తమ తమ పాత్రలతో ఎంటర్ టైన్ మెంట్ పంచారు. ముఖ్యంగా ఎదుటి వారు సంతోషంలో ఉంటే ఓర్చుకోలేని అడపా ప్రసాద్ పాత్రలో కృష్ణభగవాన్ హైలెట్ అయ్యాడు.

టెక్నికల్ అంశాల విషయానికొస్తే... రవిచంద్రన్ మ్యూజిక్ ఆకట్టుకుంది. ముఖ్యంగా ఓ రంగుల చిలకా సాంగ్ సినిమా అయ్యాక కూడా వెంటాడుతుంది. కార్తీక్ అందించిన నేపథ్య సంగీతం కూడా బావుంది. ఇక సినిమా మరో హైలెట్ ఏంటంటే... కెమెరామెన్ నగేష్‌ బానెల్ ప్రతిభ. కాకినాడ అందాలను అద్భుతంగా తెరకెక్కించాడు. ఎక్కడా చిన్న బడ్జెట్ సినిమా అన్న ఫీలింగ్ కలిగించలేదు. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.

ఫ్లస్ పాయింట్లు:
శ్రీనివాస రెడ్డి నటన,
కథ, కామెడీ
సంగీతం

 

మైనస్ పాయింట్లు:
సినిమా లెంగ్త్
స్క్రీన్ ప్లే

 

తీర్పు:

లవ్, లైఫ్, విక్టరీ అంటూ ఓ నిజాయితీతో కూడిన అర్థవంతమైన ప్రేమకథనే అందించాడు దర్శకుడు శివరాజ్. సెకండాఫ్ లో కాస్త బోర్ కొట్టించినప్పటికీ, లీడింగ్ క్యారెక్టర్ల నేచురల్ నటనతోపాటు, కమెడియన్ల ఎంటైర్ టైనింగ్ తో టైంపాస్ గా సాగిపోతుంటుంది సినిమా.


చివరగా... జయమ్ము నిశ్చయమ్మురా... ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్.

Author Info

Bhaskar

పూర్తి పేరు భాస్కర్ గౌడ్ శ్రీపతి.  ఏ వార్త అయినా సరే సింపుల్ గా రాసేందుకు ప్రయత్నిస్తుంటాడు. సమకాలీన రాజకీయాలు, పరిస్థితులపై విశ్లేషణ చేసి వ్యాసాలు రాయటం అదనపు బాధ్యతగా నిర్వహిస్తున్నాడు.  సినిమాలు చూడటం అంటే ఇతనికి ఎక్కువ పిచ్చి.  స్టాంపుల సేకరణ, కాయిన్ కలెక్షన్ ఇతని హాబీలు. సోషల్ మీడియా అప్ డేట్లతో వార్తలు త్వరగతిన అందించడం ఇతని ప్రత్యేకత. అయాన్ రాండ్ నవలలు ఎక్కువగా చదువటం, కార్డూన్లు ఎక్కువ చూడటం చేస్తుంటాడు.

X

Latest Reviews

porno