మన ఊరి రామాయణం రివ్యూ | mana oori ramayanam movie review

Teluguwishesh మన ఊరి రామాయణం మన ఊరి రామాయణం Mana Oori Ramayanam Telugu Movie Review. Product #: 78201 2.75 stars, based on 1 reviews
  • చిత్రం  :

    మన ఊరి రామాయణం

  • బ్యానర్  :

    ప్రకాశ్ రాజ్ ప్రోడక్షన్

  • దర్శకుడు  :

    ప్రకాశ్ రాజ్

  • నిర్మాత  :

    రామ్ జీ నరసింహన్

  • సంగీతం  :

    ఇళయరాజా

  • సినిమా రేటింగ్  :

    2.752.75  2.75

  • ఛాయాగ్రహణం  :

    ముఖేష్

  • ఎడిటర్  :

    శ్రీకర్ ప్రసాద్

  • నటినటులు  :

    ప్రకాశ్ రాజ్, ప్రియమణి, సత్యదేవ్, పృథ్వీ తదితరులు

Mana Oori Ramayanam Movie Review

విడుదల తేది :

2016-10-07

Cinema Story

దుబాయ్ లో డబ్బు దండిగా సంపాదించి తిరిగి ఇండియాకు వచ్చి ఊళ్లో మంచి పనులు చేస్తూ సోసైటీలో మంచి పేరు గడిస్తాడు భుజంగయ్య(ప్రకాశ్ రాజ్). అనవసర పెత్తనంతో ఇంట్లో వాళ్లని విసిగిస్తూ డిగ్రీ చదువుతున్న తన కూతురికి త్వరగా పెళ్లి చేయాలనుకుంటాడు భుజంగం. ఈ విషయంలో కుటుంబ సభ్యులు విభేధించడటంతో అలిగి, బయటికి వెళ్లిపోతాడు. తనకు బాగా దగ్గరి వ్యక్తి అయిన ఆటోడ్రైవర్ శివ(సత్యదేవ్) తో కలిసి ఫుల్లుగా మందుకోడతాడు. ఆ తర్వాత అక్కడ కనిపించిన వేశ్య(ప్రియమణి) తో ఓ రాత్రి గడపాలన్న బుద్ధి పుడుతుంది. తన ఇంటి వాకిట్లో ఉన్న ఓ గదిలో ఫ్లాన్ వేసుకుని ఇద్దరు అక్కడికి వెళ్తాడు. బయట నుంచి గడి పెట్టి ఓ గంట తర్వాత వచ్చి తలుపు తీయమని శివకు చెబుతాడు భుజంగం. కానీ, శివను అనుకోకుండా పోలీసులు అరెస్ట్ చేస్తారు. మరి తర్వాత వారిద్దరు ఎలా బయటపడ్డారు. విషయం బయటికి పొక్కుతుందా? ఇంట్లో, ఊళ్లో వాళ్ల దృష్టిలో భుజంగం గౌరవం ఉంటుందా? ఊడుతుందా? అన్నదే కథ. 

cinima-reviews
మన ఊరి రామాయణం

విలక్షణమైన నటుడిగానే కాదు నిర్మాత, దర్శకుడిగా విభిన్నమైన చిత్రాలకే ప్రయారిటీ ఇస్తాడు ప్రకాశ్ రాజ్. ధోనీ, ఆకాశమంత, గగనం, ఉలవచారు చిత్రాలను పరిశీలిస్తే ఆయన టేస్ట్ ఏంటో తెలిసిపోతుంది. ఇప్పుడు సొంతంగా మన ఊరి రామాయణంను స్వీయ నిర్మాణంలో తెరకెక్కించి, దర్శకత్వం వహించాడు. రాముడు రావణుడు అన్న కాన్సెప్ట్ తో వచ్చిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి చిత్రం ఎలా ఉందో రివ్యూలోకి వెళ్లి చూద్దాం.

విశ్లేషణ:
పైకి రీమేక్ అని ఎక్కడా చెప్పనప్పటికీ, ఓ సినిమా నుంచి ఇన్సిపిరేషన్ పొందానని నిజాయితీగా ఒప్పుకున్నాడు ప్రకాశ్ రాజ్. మళయాళంలో హిట్ మూవీ అయిన షటర్ నుంచి ప్రేరణ పొందిన కథే ఇది. అయితే మాతృక మొత్తం సస్పెన్స్ థ్రిల్లర్ గా ఉంటే, దానికి కాస్త కామెడీగా అండ్ మెసేజ్ టచప్ ఇస్తూ భలేగా చూపించాడు ఒక చిన్న ప్రపంచం చుట్టూనే తిరిగే కథను సినిమాగా అల్లిన తీరు ఇట్టే ఆకట్టుకుంటుంది. మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఎండింగ్ కార్డు దాకా ఏదో ఆర్ట్ ఫిల్మ్ చూస్తున్నామన్న భావన, సగటు ప్రేక్షకుడికి కావాల్సిన ఎంటర్ టైన్ మెంట్ ఎలిమెంట్స్ లేకపోవటం సినిమాకు మైనస్ గా మారాయి.

కుళ్లు జోకులు, అనవసరమైన ఫైట్లు లేకుండా అర్థవంతమైన డైలాగులు, కట్టి పడేసే స్క్రీన్ ప్లే సినిమాకు ఆకర్షణగా నిలిచాయి. మొదటి అర్థ భాగం స్లోగా... సెకండాఫ్ సీరియస్ నడిచినప్పటికీ రాను రాను సినిమాలో లీనమైపోతాడు ప్రేక్షకుడు. ముఖ్యంగా సినిమా నేరేషన్ విషయంలో తన పూర్తి ప్రతిభను చూపించిన ప్రకాశ్ రాజ్ కి హాట్సాఫ్.

ఇక నటీనటుల విషయానికొస్తే... నో డౌట్. ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్ ప్రకాష్ రాజ్. నాణేనికి రెండు పార్వ్శాలు ఉన్నట్లు. భుజంగయ్య ఓవైపు పెద్ద మనిషి తరహా పాత్రను పోషిస్తూనే, మరోవైపు డార్క్ షేడ్స్ ఉన్న పాత్రలో అలరించాడు. ఇంట్లో గొడవ పడి వెళ్లే సమయంలోనూ, వేశ్యను చూసి టెంప్ట్ అయిన సందర్భంలోనూ, వేశ్యతో గదిలో ఇరుక్కుపోయ తంటాలు పడే సీన్ లో హిల్లేరియస్ గా అలరించాడు. ఆఖరికి మదనపడి, తప్పు చేస్తున్నాననే ఫీలింగ్ వచ్చి మారిపోవటం లాంటి ఎమోషనల్ సీన్ లోనూ హవ భావాలు అద్భుతం. ప్రియమణి వేశ్య పాత్ర సినిమాకు మరో బలం. పెళ్లాయ్యాక కూడా ఈ తరహా పాత్ర పోషించటం ఆమె గట్స్ అనే చెప్పాలి. ముఖ్యంగా గదిలో భుజంగయ్య పాత్రను ఆడుకోవటం ఆకట్టుకుంటుంది. జ్యోతిలక్ష్మీ ఫేం సత్య పాత్ర కీలకంగా ఉంటుంది. పృథ్వీ కూడా సీరియస్ పాత్రలో అలరించాడు. మిగతా పాత్రలు చక్కగా కుదిరాయి.

ఇక టెక్నికల్ అంశాల విషయానికొస్తే... సినిమాకు బ్యాగ్రౌండ్ స్కోర్ తో ఊపిరిపోశాడు ఇళయరాజా. సైలెంట్ గా సాగిపోయే స్క్రీన్ ప్లేకు ఎమోషనల్ ఫీల్ ను అందిస్తూ అదే బలం అయ్యింది కూడా. ముకేశ్ సినిమాటోగ్రఫీ చాలా న్యాచురల్‌గా బాగుంది. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ అసంపూర్తిగా ముగిసినట్లు అనిపిస్తుంది. శశిధర్ ఆర్ట్ వర్క్ బాగుంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ సినిమా అవసరానికి తగ్గట్టు బాగున్నాయి.

ఫ్లస్ పాయింట్లు:
ప్రకాశ్ రాజ్ అండ్ మిగతా తారగణం నటన
స్ట్రాంగ్ కంటెంట్

 

మైనస్ పాయింట్లు:
ఫస్టాఫ్ స్లోగా ఉండటం,
కామెడీ, ఫైట్లు లేకపోవటం
ఎడిటింగ్

విశ్లేషణ:
నటనపరంగానే కాక దర్శకుడిగానూ తనది ప్రత్యేక శైలి అని మరోసారి నిరూపించుకున్నారు. ఒక సింపుల్ పాయింట్ నుంచి కథ అల్లి, దానికి మంచి ఎంగేజింగ్ స్క్రీన్‌ప్లే రాసుకొని మెప్పించాడు. అయితే రెగ్యులర్ కమర్షియల్ సినిమాలనే కాకుండా మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ఆదరించేవారికి ఇది ఖచ్ఛితంగా ఎక్కుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు.

చివరగా... ఈ రామాయణం ప్రకాశ్ రాజ్ కోసం చూడొచ్చు.

 

Author Info

Bhaskar

పూర్తి పేరు భాస్కర్ గౌడ్ శ్రీపతి.  ఏ వార్త అయినా సరే సింపుల్ గా రాసేందుకు ప్రయత్నిస్తుంటాడు. సమకాలీన రాజకీయాలు, పరిస్థితులపై విశ్లేషణ చేసి వ్యాసాలు రాయటం అదనపు బాధ్యతగా నిర్వహిస్తున్నాడు.  సినిమాలు చూడటం అంటే ఇతనికి ఎక్కువ పిచ్చి.  స్టాంపుల సేకరణ, కాయిన్ కలెక్షన్ ఇతని హాబీలు. సోషల్ మీడియా అప్ డేట్లతో వార్తలు త్వరగతిన అందించడం ఇతని ప్రత్యేకత. అయాన్ రాండ్ నవలలు ఎక్కువగా చదువటం, కార్డూన్లు ఎక్కువ చూడటం చేస్తుంటాడు.