నిర్మల కాన్వెంట్ రివ్యూ | Nirmala Convent Review

Teluguwishesh నిర్మలా కాన్వెంట్ నిర్మలా కాన్వెంట్ Nirmala Convent Movie Review. Product #: 77738 2.25 stars, based on 1 reviews
  • చిత్రం  :

    నిర్మలా కాన్వెంట్

  • బ్యానర్  :

    అన్నపూర్ణ స్టూడియోస్, మాట్రిక్స్ టీమ్ వర్క్స్

  • దర్శకుడు  :

    జి.నాగ కోటేశ్వర రావు

  • నిర్మాత  :

    నాగార్జున అక్కినేని, నిమ్మగడ్డ ప్రసాద్

  • సంగీతం  :

    రోషన్ సాలూరి

  • సినిమా రేటింగ్  :

    2.252.25  2.25

  • ఛాయాగ్రహణం  :

    ఎస్వీ విశేశ్వర్

  • నటినటులు  :

    రోషన్, శ్రీయా శర్మ, గెస్ట్ రోల్ లో నాగార్జున, ఆదిత్య మీనన్‌, సత్యకృష్ణ, సూర్య, అనితా చౌదరి, సమీర్‌, తాగుబోతు రమేష్‌

Nirmala Convent Review

విడుదల తేది :

2016-09-16

Cinema Story

కథ:

అనగగనగా భూపతినగరం అనే ఊర్లో ఓ రాజుగారి ఫ్యామిలీకి, ఓ కులానికి అస్సలు పడదు. ఈ గొడవల కారణంగా వీరయ్య (ఎల్బీ శ్రీరాం) అనే రైతు మరణించడమే కాదు, అతని కుటుంబం రోడ్డుపాలు అవుతుంది. ఆపై వీరయ్య కొడుకు(సూర్య) మతం, పేరు  మార్చుకుని ఓ అమ్మాయిని(అనితాచౌదరి) పెళ్లిచేసుకుని కొడుకు శ్యామూల్స్ (రోషన్ ) తో ప్రశాంతంగా జీవిస్తుంటాడు. అదే సమయంలో రాజుగారి కొడుక్కి(ఆదిత్యమీనన్) కూతురు శాంతి(శ్రియాశర్మ) పుడుతుంది. వీరిద్దరు నిర్మలా కాన్వెంట్ లో చదువుకుంటారు. అదే సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. అయితే అది గిట్టని శాంతి తండ్రి, శామ్యూల్స్ తోపాటు, అతని కుటుంబాన్ని ఇబ్బంది పెడుతుంటాడు. ఆ సమయంలో శ్యామూల్స్ ఏం చేస్తాడు? హీరో అక్కినేని నాగార్జున(అదే పాత్రలో) కలవాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తాయి. మరి నాగ్ వీళ్ల ప్రేమకు సాయం చేస్తాడా? లేక శ్యామూల్స్ ఒంటరిగానే పోరాడి ప్రేమను గెలిపించుకుంటాడా? అన్నదే కథ. 

cinima-reviews
నిర్మలా కాన్వెంట్

ప్రయోగాలకే కాదు, కొత్త కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేయటంలో ఎప్పుడూ ముందుటాడు అక్కినేని నాగార్జున. ఉయ్యాలా జంపాలా, పడేశావే చిత్రాలను అన్నపూర్ణ స్డూడియోస్ బ్యానర్ లో తెరకెక్కించి దాన్ని ఫ్రూవ్ చేసుకున్నాడు.  ఇప్పుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ ను హీరోగా పరిచయం చేస్తూ నిర్మలా కాన్వెంట్ అనే చిత్రాన్ని స్వీయంగా నిర్మించడమే కాదు, అందులో ఓ కీ రోల్ పోషించానని చెప్పుకొచ్చాడు. ఫ్రెష్ లవ్ స్టోరీ అంటూ హడావుడి చేసిన ఈ సినిమా ఈ రోజే మన ముందుకు వచ్చేసింది. మరి దీని ఫలితం ఎలా రివ్యూ లోకి వెళ్లి చూద్దాం...

విశ్లేషణ:
తెలుగులో నూనుగు మీసాల టీనేజ్ ప్రేమ కథలు చాలానే వచ్చాయి. పెద్దింటి అమ్మాయిని ప్రేమించే ఓ కుర్రాడు, అడ్డుకునే పెద్దలు.. చివరకు ఎలాగోలా తమ లవ్ ను నెగ్గించుకునే జంట. నిర్మలా కాన్వెంట్ కూడా సేమ్ టూ సేమ్ అలాంటి స్టోరీనే. అయితే మొదటి నుంచి ఊదరగొడుతున్నట్లు ఇందులో ఫ్రెష్ ఫీలింగ్ మాత్రం లేదనే చెప్పాలి. ఫస్ట్ హాఫ్ మొత్తం రోటీన్ ప్రేమ కహానీతోనే కానిచ్చేసిన దర్శకుడు నాగ కోటేశ్వరరావు, సెకండాఫ్ ను మాత్రం మీలో ఎవరు కోటీశ్వరుడు తరహాలో గేమ్ షోతో నెట్టుకొచ్చేందుకు బాగానే ప్రయత్నం చేశాడు. కానీ, అవేం అంతగా రుచించవు. యూత్ ఫుల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన నిర్వలా కాన్వెంట్ లో ఎంటర్ టైన్ మెంట్ కూడా పెద్దగా లేకపోవటం మైనస్ గానే నిలిచింది. అసలు నాగ్ ఇలాంటి సబ్జెక్ట్ ను ఎందుకు ఎంకరేజ్ చేశాడా? అన్న అనుమానాలు కూడా కలుగుతాయంటే అర్థం చేసుకోవచ్చు.

ఇక తారాగణం విషయానికొస్తే... మొదటి సినిమా అయిన రోషన్ బాగా చేశాడు. చాలా కాన్ఫిడెంట్ తో టీనేజ్ ప్రేమికుడిగా అలరించాడు. ఫ్యూచర్ లో మంచి నటుడిగా ఎదిగే అవకాశం ఉంది. శ్రియాశర్మ విషయానికొస్తే నటనపరంగా ఓకే. కానీ, అప్పీరియన్స్ పరంగా, కొన్ని సన్నివేశాల్లో ఇంకా చిన్నపిల్లలాగే అనిపించకమానదు. వీరి తర్వాత చెప్పుకోవాల్సింది అసలు సూత్రధారి నాగ్ గురించి. నాగ్ లేకపోతే సెకండాఫ్ లేదు. మొత్తం తన భుజాలపై వేసుకుని సినిమాను నడిపించాడు. మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమం తరహాలోనే చాంపియన్ ఆఫ్ చాంపియన్ అంటూ టీవీ షోతో ఆకట్టుకుంటాడు. అయితే ఆ ఎపిసోడ్ అంతా కాస్త సిల్లీగా అనిపిస్తుంది. కమెడియన్లు ఉన్నా వారిని వాడుకునే ప్రయత్నం చేయలేదు. మిగతా కాస్టింగ్ ఎవరి పాత్రకు వారు న్యాయం చేశారు.

టెక్నికల్ పరంగా... హైలెట్ గా చెప్పుకోదగింది కెమెరావర్క్ మరియు బ్యాగ్రౌండ్ స్కోర్. విశ్వేశ్వర్ అందించిన సినిమాటోగ్రఫీ చాలా రిచ్ గా ఉంది. బోరింగ్ సన్నివేశాల్లో కూడా సీన్ ను రిచ్ గా చూపించి ఫ్రెష్ లుక్ తెచ్చాడు. కొత్త కొత్త భాష పాటతప్ప, మిగతావేవి అంతగా ఆకట్టుకోకపోయినా, రోషన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం అదిరిపోయింది. మిగతా విభాగాల గురించి చెప్పుకోవటం అవసరం లేదు. ప్రోడక్షన్ వాల్యూస్ అఫ్ కోర్స్ అన్నపూర్ణ స్టూడియో కాబట్టి రిచ్ గానే ఉన్నాయి.

ఫ్లస్ పాయింట్లు:
రోషన్ నటన,
నాగ్ గెస్ట్ రోల్,
కెమెరావర్క్, బ్యా గ్రౌండ్ స్కోర్

 

మైనస్ పాయింట్లు:
అవుట్ డేట్ కథ,
నో ఎంటర్ టైన్ మెంట్,
డైరక్షన్

తీర్పు:

రోటీన్ ప్రేమకథగా వచ్చిన నిర్మలా కాన్వెంట్ ఏ పరంగానూ ఆకట్టుకోలేకపోయింది. రోషన్ నటన, నాగ్ గెస్ట్ రోల్, తప్ప మిగతా అంశాలు అంతగా ఎక్కించుకోలేం. అసలు సినిమా చివరి దాకా బలవంతంగా కూర్చున్నామంటే అది కేవలం నాగ్ ఉన్నాడన్న ఒకేఒక్క కారణం. అవుట్ డేటెట్ కథ, దాని ఎంటర్ టైన్ మెంట్ గా తీర్చిదిద్దడంలో దర్శకుడు నాగ కొటేశ్వరరావు ఘోరంగా ఫేలయ్యాడు.

చివరగా... నిర్మలా కాన్వెంట్.. ఓ చప్పటి ప్రేమకథ.

 

 

Author Info

Bhaskar

పూర్తి పేరు భాస్కర్ గౌడ్ శ్రీపతి.  ఏ వార్త అయినా సరే సింపుల్ గా రాసేందుకు ప్రయత్నిస్తుంటాడు. సమకాలీన రాజకీయాలు, పరిస్థితులపై విశ్లేషణ చేసి వ్యాసాలు రాయటం అదనపు బాధ్యతగా నిర్వహిస్తున్నాడు.  సినిమాలు చూడటం అంటే ఇతనికి ఎక్కువ పిచ్చి.  స్టాంపుల సేకరణ, కాయిన్ కలెక్షన్ ఇతని హాబీలు. సోషల్ మీడియా అప్ డేట్లతో వార్తలు త్వరగతిన అందించడం ఇతని ప్రత్యేకత. అయాన్ రాండ్ నవలలు ఎక్కువగా చదువటం, కార్డూన్లు ఎక్కువ చూడటం చేస్తుంటాడు.