Chuttalabbayi movie review | చుట్టలబ్బాయి రివ్యూ

Teluguwishesh చుట్టాలబ్బాయి చుట్టాలబ్బాయి Aadi Chuttalabbayi telugu movie review. Product #: 77146 2.25 stars, based on 1 reviews
  • చిత్రం  :

    చుట్టాలబ్బాయి

  • బ్యానర్  :

    శ్రీ ఐశ్వర్యలక్ష్మీ మూవీస్‌, ఎస్‌.ఆర్‌.టి. మూవీ హౌస్‌ బ్యానర్స్‌

  • దర్శకుడు  :

    వీరభద్రమ్‌ చౌదరి

  • నిర్మాత  :

    రాము తాళ్ళూరి, వెంకట్‌ తలారి

  • సంగీతం  :

    ఎస్ఎస్ థమన్

  • సినిమా రేటింగ్  :

    2.252.25  2.25

  • ఛాయాగ్రహణం  :

    ఎస్‌.అరుణ్‌కుమార్‌

  • ఎడిటర్  :

    ఎస్‌.ఆర్‌.శేఖర్‌

  • నటినటులు  :

    ఆది, నమిత ప్రమోద్, సాయి కుమార్, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, పృథ్వి, రఘుబాబు, కృష్ణభగవాన్‌, అభిమన్యు సింగ్‌, జీవా, సురేఖావాణి తదితరులు

Chuttalabbayi Movie Review

విడుదల తేది :

2016-08-19

Cinema Story

ఎంతటి మొండి బకాయిలను అయినా సరే రికవరీ చేయగల ఏజెంట్ బాజ్జీ(ఆది). సరదాగా జీవితం గడుపుతున్న ఈ కుర్రాడి జీవితంలోకి అనుకోకుండా వస్తుంది కావ్య(నమిత ప్రమోద్). వీరిద్దరు కాస్త క్లోజ్ గా ఉండటం చూసి కావ్య అన్నయ్య ఏసీపీ (అభిమన్యు సింగ్) బాబ్జీకి వార్నింగ్ ఇస్తాడు. ఇక కావ్య ఇంట్లో సమస్యలతో పారిపోదామని ప్రయత్నిస్తుంది. ఆ క్రమంలో బాబ్జీ సాయం తీసుకోగా, వారిద్దరు లేచిపోతున్నారనుకొని పోలీసులు వారి వెంట పడతారు. అదే సమయంలో మరో రౌడీ గ్యాంగ్ కూడా వీరిని తరుముతుంది. ఇంతలో ఎక్కడి నుంచో ఊరిపడ్డ దొరబాబు (సాయికుమార్) మనుషులు వీరిని ఎత్తుకెళ్లిపోతారు. ఇంతకీ ఈ రౌడీ గ్యాంగ్ ఎవరు? దొరబాబు ఎవరు? కావ్యతో వాళ్లకు ఉన్న సంబంధం ఏంటి? చివరికి ఏమౌతుంది? అన్నదే కథ...

cinima-reviews
చుట్టాలబ్బాయి

విశ్లేషణ:

చుట్టాలబ్బాయ్ కథ పాతదే కాని దాన్ని కొత్తగా చెప్పే ప్రయత్నంలో కూడా దర్శకుడు పూర్తిగా పట్టు తప్పాడు. ఎంటర్ టైన్ మెంట్ గా ఫస్టాఫ్ ను నడిపించి, కీలకమైన సెకండాఫ్ లో రొటీన్ ఫ్యామిలీ డ్రామాతో లాగించి చివరకు మళ్లీ రొటీన్ ఎండింగే ఇచ్చేశాడు దర్శకుడు వీరభద్రం చౌదరి. ఓ పాత సినిమా టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆది ఇదివరకు సినిమాల కంటే స్క్రీన్ స్కోప్ బాగానే వాడుకున్నాడు. నటన, డాన్సు, ఫైట్ లలో మునపటి చిత్రాల కంటే జోష్ తో నటించాడు. ఇక హీరోయిన్ విషయానికొస్తే ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. హీరోయిన్ కు స్కోప్ ఉన్నా ఆమె నటన జస్ట్ ఓకే అనిపిస్తుంది. లుక్ పరంగా అక్కడక్కడ ఇంప్రెసివ్ గా అనిపించినా నటనలో ఆమె ఫేలయిందనే చెప్పొచ్చు. హీరో హీరోయిన్ లవ్ సీన్స్ కూడా అంతగా వర్క్ అవుట్ కాలేదు. సిల్లీ లవ్ ట్రాక్ తో నడుస్తుంది. అప్పటిదాకా కలిసి ఉన్నా రాని ఫీలింగ్ వారు విడిపోయాక రావడం ఆకట్టుకోదు. ఉన్నంతలో ఈగో గోవర్థన్ రెడ్డి(థర్టీ ఇయర్స్ పృథ్వీ) పాత్ర కాస్త నవ్వులు పూయిస్తుంది. దొరబాబుగా సాయికుమార్ హైలెట్ చేయటం తప్పించి చేసిందేమీ లేదు. అభిమన్యు సింగ్ జస్ట్ ఓకే. మిగతా పాత్రలు అంతంత మాత్రంగానే నటించాయి.

టెక్నికల్ అంశాల విషయానికొస్తే... థమన్ సంగీతం ఓకే అనిపించింది. నేపథ్య సంగీతం కాస్త సినిమాను కాపాడింది. అరుణ్ కుమార్ సినిమాటోగ్రఫీ పర్వాలేదు ఎస్.ఆర్ శేఖర్ ఎడిటింగ్ ఒకే కాని సినిమా ఇంకాస్త ట్రిం చేసి ఉంటే బాగుండనిపిస్తుంది. మొదటి సినిమా అయినప్పటికీ ఎస్.ఆర్.టి బ్యానర్ ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గానే ఉన్నాయి.

ఫ్లస్ పాయింట్లు
ఫస్టాఫ్
ఆది, థర్టీ ఇయర్స్ పృథ్వీ, షకలక శంకర్ కామెడీ
థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్, రబ్బా రబ్బా సాంగ్

 

మైనస్ పాయింట్లు:
సెకండాఫ్
ప్రధాన పాత్రల పేలవమైన యాక్టింగ్
రోటీన్ కథ

తీర్పు:
దర్శకుడు వీరభద్రం కథలో కొత్తదనం లేదు. పోనీ... స్క్రీన్ ప్లే తో అయినా ఏమన్నా మ్యాజిక్ చేస్తాడనుకుంటే అదీ లేదు. పరమ రొటీన్ అండ్ పేలవమైన సినిమాగా చుట్టాలబ్బాయిని తీర్చిదిద్దాడు. అక్కడక్కడ వచ్చే కొన్ని కామెడీ సీన్లు తప్పించి సినిమా నుంచి కొత్తదనం లేకుండా చేశాడు. గ్రిప్పింగ్ లేని కథతో రెండున్నర గంటలు ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించాడు. వెరసి ఆది ఎనర్జిటిక్ ఫెర్ఫార్మెన్స్ కూడా సినిమాను కాపాడలేకపోయింది.

చివరగా... కొన్ని నవ్వులు తప్పించి చిరాకు తెప్పిస్తాడీ చుట్టాలబ్బాయి.

 

 

 

 

Author Info

Bhaskar

పూర్తి పేరు భాస్కర్ గౌడ్ శ్రీపతి.  ఏ వార్త అయినా సరే సింపుల్ గా రాసేందుకు ప్రయత్నిస్తుంటాడు. సమకాలీన రాజకీయాలు, పరిస్థితులపై విశ్లేషణ చేసి వ్యాసాలు రాయటం అదనపు బాధ్యతగా నిర్వహిస్తున్నాడు.  సినిమాలు చూడటం అంటే ఇతనికి ఎక్కువ పిచ్చి.  స్టాంపుల సేకరణ, కాయిన్ కలెక్షన్ ఇతని హాబీలు. సోషల్ మీడియా అప్ డేట్లతో వార్తలు త్వరగతిన అందించడం ఇతని ప్రత్యేకత. అయాన్ రాండ్ నవలలు ఎక్కువగా చదువటం, కార్డూన్లు ఎక్కువ చూడటం చేస్తుంటాడు.