శ్రీరస్తు శుభమస్తు రివ్యూ | Srirastu Subhamastu movie review

Teluguwishesh శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు Srirastu Subhamastu telugu movie review. Product #: 76856 3 stars, based on 1 reviews
  • చిత్రం  :

    శ్రీరస్తు శుభమస్తు

  • బ్యానర్  :

    గీతా ఆర్ట్స్

  • దర్శకుడు  :

    పరశురాం

  • నిర్మాత  :

    అల్లు అరవింద్

  • సంగీతం  :

    ఎస్ ఎస్ థమన్

  • సినిమా రేటింగ్  :

    333  3

  • ఛాయాగ్రహణం  :

    మణికందన్

  • ఎడిటర్  :

    మార్తాండ్ కే వెంకటేష్

  • నటినటులు  :

    అల్లు శిరీష్, లావణ్య త్రిపాఠి, ప్రకాశ్ రాజ్, రావు రమేష్, సుమలత, హంసానందిని తదితరులు

Srirastu Subhamastu Movie Review

విడుదల తేది :

2016-08-05

Cinema Story

శిరీష్(శిరీష్) పెద్ద బిజినెస్ మ్యాన్ (ప్రకాశ్ రాజ్ ) కొడుకు. అనన్య(లావణ్య త్రిపాఠి) ని చూసిన వెంటనే ప్రేమలో పడిపోతాడు. అనన్యకు కూడా కార్తీక్ అంటే ప్రేమ ఉంటుంది, కానీ, తండ్రి అంటే గౌరవంతో ఆ ప్రేమను బయటపెట్టలేక, కుటుంబానికి సాయం చేసిన వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడిపోతుంది. ఇది తెలిసి శిరీష్ తన ప్రేమ వ్యవహారం తండ్రితో చెబుతాడు. అయితే మిడిల్ క్లాస్ అమ్మాయిలంతా రిచ్ యువకులను ట్రాప్ చేసి ముగ్గులో దింపుతారని చెబుతాడు. దానికి శిరీష్ తన అనన్య అలాంటిది కాదని, కావాలంటే నిరూపిస్తానని ఛాలెంజ్ చేసి ఆమె ఇంట్లో మాములుగా వ్యక్తిగా  కొన్ని రోజులు జీవితం గడిపేందుకు వెళ్తాడు. అక్కడ అనన్య నోటి నుంచి ప్రేమను బయటపెట్టించడంతోపాటు, పెద్దలను ఒప్పించి పెళ్లి పీటలు ఎలా ఎక్కిస్తాడన్నదే కథ.

cinima-reviews
శ్రీరస్తు శుభమస్తు

రెండు సినిమాలు వచ్చి పోయాక నటనను అనుసరించి శిరీష్ అసలు పనికి వస్తాడా అని అనుకుంటున్న సమయంలో నటుడు దర్శకుడు పరుశ్ రాంతో సినిమా అనే సరికి ప్రేక్షకుడు కాస్త ఆలోచనలో పడాల్సి వచ్చింది. ఎందుకంటే గతంలో నిఖిల్ తో యువత, నారా రోహిత్ తో సోలో లాంటి డీసెంట్ సినిమాలు అందించాడు. అదే సమయంలో రవితేజతో ఆంజనేయులు, సారొచ్చారు వంటి ఫ్లాపులు కూడా అందించాడు అనుకోండి. అదే వేరే విషయం. అయితే ఈసారి మాత్రం శిరీష్ తో మంచి ఫ్యామిలీ ఎంటర్ టైన్ తో ముందుకు వస్తున్నానని చెప్పుకొచ్చాడు. అన్నట్లుగానే శ్రీరస్తు శుభమస్తు ఈ రోజు విడుదలైంది. లక్కీ హీరోయిన్ లావణ్య త్రిపాఠి, ప్రకాశ్ రాజ్, రావు రమేష్, తనికెళ్ల భరణి లాంటి హేమాహేమీలు ఉన్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. మరి సినిమా ఎలా ఉందో ఓసారి రివ్యూలోకి వెళ్లి చూద్దాం. 

విశ్లేషణ

సినిమాలో ముందుగా చెప్పుకోవాల్సింది కథ, దర్శకుడు పరుశ్ రాం గురించి. సారొచ్చారా లాంటి డిజాస్టర్ తర్వాత పరుశ్ రాం పాత కథే అయినా దానిని ఎంటర్ టైన్ తో, మంచి స్క్రీన్ తో తెరపైకి అద్భుతంగా ఎక్కించాడు. అమ్మాయి కోసం తండ్రితో సవాల్ చేసే కొడుకు, అల్రెడీ ఎంగేజ్ మెంట్ అయిన అమ్మాయిని గెలుచుకోవటం లాంటివి అరిగిపోయిన రికార్డు కథలే అయినా ఫ్రెష్ ఫీలింగ్ కలిగించాడు. ఓవైపు సున్నితమైన ప్రేమకథను, మరోవైపు కుటుంబ అనుబంధాలను సమాన స్థాయిలో చూపించాడు. ఫస్టాఫ్ లో లవ్ ట్రాక్, కామెడీ ఇంటర్వెల్ బ్యాంగ్ వచ్చే సరికి ఫ్యామిలీ టచ్ ఇచ్చి వదిలేశాడు. ఫస్టాఫ్ ని ప్రేక్షకుడు పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేస్తాడు. ఇక సెకండాఫ్ కు వచ్చేసరికి కథ రోటీన్ అయిపోయింది. హీరోయిన్ ఫ్యామిలీని ఇంప్రెస్ చేయడానికి హీరో పడే పాట్లు, ఆ క్రమంలో అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు ఎక్కడో చూసినట్లుగా అనిపించకమానదు. ముఖ్యంగా హీరోహీరోయిన్ల లవ్ ట్రాక్, ఇంట్లో వాళ్లు అతని మంచితనానికి ఉత్తిగే పడిపోవటం, క్లైమాక్స్ ఏ హడావుడి లేకుండా ముగిసిపోవటం లాంటివి బోర్ కొట్టిస్తాయి. కానీ, చివరికి వచ్చే సరికి ఆఖరి 20 నిమిషాలు కథలోకి మళ్లీ ఎంగేజ్ అయిపోతాం. ప్రకాశ్ రాజ్-శిరీష్ మధ్య వచ్చే సీన్ హైలెట్ గా ఉంటుంది.

నటీనటుల విషయానికొస్తే... ముందుగా చెప్పుకోవాల్సింది శిరీష్ గురించి. స్క్రీన్ పై మొదటి సీన్ లో చూడగానే ఇతను శిరీష్ ఏనా అన్నంతగా మారిపోయాడు. బాడీ లాంగ్వేజ్ , తనకు సరిగ్గా సరిపోయే కథతో వచ్చాడు. కానీ, ఎమోషన్ సీన్లలో మరింత డెవలప్ కావాల్సి ఉంది. ఇక హీరోయిన్ లావణ్య ఓవైపు అల్లరి చేస్తూనే, ఇంకోవైపు తండ్రి చాటు బిడ్డగా బాగా చేసింది. శిరీష్ ను ఆడుకునే సీన్లలో ఆమె నటన గుర్తుండిపోతుంది. ప్రకాశ్ రాజ్, రావు రమేష్ ఇద్దరూ ఇద్దరే. తనికెళ్ల భరణి, మిగతా వారు వారి వారి పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నికల్ అంశాల విషయానికొస్తే.. థమన్ అందించిన సంగీతం బాగుంది. చాలా గ్యాప్ తర్వాత ఫ్రెష్ మ్యూజిక్ ఇచ్చాడేమో అన్నట్లుగా ఉంటుంది. అయితే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ లో మాత్రం మూసను కొనసాగించాడు. సీనియర్ ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ అనుభవంతో కథను ఎడిట్ చేసిన విధానం బాగా హెల్ప్ అయింది. మణికంధన్ సినిమాటోగ్రఫీ రిచ్ గా, మంచి మార్కులు వెయ్యొచ్చు. నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ కావటంతో నిర్మాణ విలువలకు ఎలాంటి ఢోకా లేదు.

ఫ్లస్ పాయింట్లు
ఎంటర్ టైన్ మెంట్ ఫస్టాఫ్
శిరీష్, మిగతా నటీనటుల నటన
ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే ఎలిమెంట్స్

 

మైనస్ పాయింట్లు
సెకండాఫ్ లో బోరింగ్ సన్నివేశాలు

 

తీర్పు

అల్లు శిరీష్ నటనతో ఆకట్టుకోవటమే కాదు, తనకు కావలసిన విజయాన్ని కూడా శ్రీరస్తు శుభమస్తు తో అందుకున్నాడు. నటీనటుల నటన, మోతాదుకు మించని కామెడీ, కుటుంబ భావోద్వేగాలు, బోర్ కొట్టించని కథనం ఈ సినిమాకు బలం.

చివరగా... శ్రీరస్తు శుభమస్తు మస్తు.. మస్తు... ఫ్యామిలీ మొత్తం చూడదగ్గ ఓ మంచి ఎంటర్ టైనర్.

 

 

 

Author Info

Bhaskar

పూర్తి పేరు భాస్కర్ గౌడ్ శ్రీపతి.  ఏ వార్త అయినా సరే సింపుల్ గా రాసేందుకు ప్రయత్నిస్తుంటాడు. సమకాలీన రాజకీయాలు, పరిస్థితులపై విశ్లేషణ చేసి వ్యాసాలు రాయటం అదనపు బాధ్యతగా నిర్వహిస్తున్నాడు.  సినిమాలు చూడటం అంటే ఇతనికి ఎక్కువ పిచ్చి.  స్టాంపుల సేకరణ, కాయిన్ కలెక్షన్ ఇతని హాబీలు. సోషల్ మీడియా అప్ డేట్లతో వార్తలు త్వరగతిన అందించడం ఇతని ప్రత్యేకత. అయాన్ రాండ్ నవలలు ఎక్కువగా చదువటం, కార్డూన్లు ఎక్కువ చూడటం చేస్తుంటాడు.