సునీల్ జక్కన్న రివ్యూ | jakkanna movie review

Teluguwishesh జక్కన్న జక్కన్న Sunil Jakkanna movie review. Product #: 76732 2.25 stars, based on 1 reviews
  • చిత్రం  :

    జక్కన్న

  • బ్యానర్  :

    ఆర్పీఏ క్రియేషన్స్

  • దర్శకుడు  :

    వంశీ కృష్ణ ఆకెళ్ల

  • నిర్మాత  :

    సుదర్శన్ రెడ్డి, ఆయుష్ రెడ్డి, అక్షిత్ రెడ్డి

  • సంగీతం  :

    దినేష్

  • సినిమా రేటింగ్  :

    2.252.25  2.25

  • ఛాయాగ్రహణం  :

    సి.రాంప్రసాద్

  • ఎడిటర్  :

    ఎంఆర్ వర్మ

  • నటినటులు  :

    సునీల్, మన్నారా చోప్రా, కబీర్ దుల్హన్ సింగ్, సప్తగిరి, నాగినీడు తదితరులు

Sunil Jakkanna Movie Review

విడుదల తేది :

2016-07-29

Cinema Story

సాయానికి ప్రతి సంస్కారం అని చిన్నప్పుడు తండ్రి చెప్పిన నీతి సూక్తిని పట్టుకుని తనకు ఎవరు హెల్ప్ చేసిన తిరిగి సాయం చేసే గుణం గణేష్ యువకుడు (సునీల్). ఇదే క్రమంలో తనను చిన్నతనంలో ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడిన బైరాగి అనే వ్యక్తికి సాయం చేసేందుకు వెతుకుతుంటాడు. కానీ, బైరాగి వైజాగ్ లో పెద్ద గుండాగా చెలామణి అవుతుంటాడు. దీంతో బైరాగిని ఎలాగైనా ఓ మంచి వ్యక్తిగా మార్చాలని గణేష్ ప్రయత్నిస్తుంటాడు. 

                        అంతలో బైరాగి చెల్లెలు సహస్రతో (మన్నారా చోప్రా) అనుకోకుండా ప్రేమలో పడి ఆమెను ముగ్గులోకి దించే పని చేస్తుంటాడు. అయితే ఈ క్రమంలో గణేష్ చేసే కొన్ని పనుల వల్ల బైరాగి ఇల్లీగల్ బిజినెస్ లు బయటపడి, అతడు ఇబ్బంది పడటానికి కారణమౌతుంటాయి. దీంతో కోపం పెంచుకున్న బైరాగి గణేష్ ను చంపాలని చూస్తుంటాడు. అయినా గణేష్ మాత్రం వెనక్కి తగ్గడు. మరి చివరికి ఏమౌతుంది. సహస్ర బైరాగిని మారుస్తాడా? లేక బైరాగి చేతులో దెబ్బ తింటాడా? అన్నదే జక్కన్న కథ... 

cinima-reviews
జక్కన్న

హీరోగా మారిన తర్వాత ఒకటి రెండు హిట్లు, పైగా రాజమౌళి లాంటి దర్శకుడితో సినిమా తీశాక సునీల్ రేంజ్ మారిపోయిందని అంతా భావించారు. కానీ, విధివశాత్తూ అలా జరగకపోగా, వరుస ఫ్లాపులతో అతని కెరీర్ ఢీలా పడిపోయింది. ఒకానోక టైంలో సునీల్ మళ్లీ పాత కమెడియన్ వేషాలు వేసుకుంటే మంచిందని సగటు ప్రేక్షకుడు సైతం చిరాకుపడిపోయే పరిస్థితి వచ్చింది. ఇలాంటి సమయంలో కామెడీనే నమ్ముకుని దర్శకుడు వంశీకృష్ణ అకెళ్లతో జక్కన్నగా మన ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమాతో సునీల్ ఫేట్ మారిపోయిందా? ఇంతకీ సినిమా ఎలా ఉంది... రివ్యూలోకి వెళ్లి చూద్దాం...

విశ్లేషణ

కమెడియన్ గా ఉన్నప్పుడే చేతినిండా సినిమాలతో మాంచి బిజీగా గడిపిన సునీల్ పూర్తిస్థాయి కథానాయకుడిగా మారాక తిన్న దెబ్బలు అంత ఇంత కాదు. మూస కథలతో ఒకేరకమైన సినిమాలతో విసిగిస్తూ వస్తున్నాడు. అయితే ఈసారి మాత్రం కాస్త కొత్త కథతోనే వచ్చాడని అనుకున్న ప్రేక్షకులకు జక్కన్న పెద్ద దెబ్బే వేశాడు. చిన్నప్పుడెప్పుడో తన తండ్రి చెప్పిన పిట్ట పట్టుకుని రియాక్ట్ అయి ఓవర్ గా సాయం చేసే హీరో వ్యవహారం మరీ టూమచ్ అనిపించకమానదు. అప్పుడెప్పుడో రక్ష లాంటి టార్చర్ సినిమాతో వచ్చిన వర్మ శిష్యుడు వంశీకృష్ణ ఆకెళ్ల ఎనిమిదేళ్ల తర్వాత అదీ సునీల్ కెరీర్ బాగా లేని టైంలో రావటం, పైగా ట్రైలర్ లో కామెడీపాలు ఎక్కువగా చూపించాడని వెళితే మాత్రం మోసపోయినట్లే...

ఇక సునీల్ విషయానికొస్తే కాస్త ఊరట కలిగించే అంశం ఏంటంటే... పాత సినిమాలో లాగా కామెడీ చేసినట్లు అనిపిస్తుంది. అయితే యాక్షన్ సీన్లలో మాత్రం కాస్త అతి అనిపించకమానదు. ఓవర్ ఫైట్లు, మధ్య మధ్యలో ఓవరాక్షన్ చేసినట్లు అనిపిస్తుంది. హీరోయిన్ మన్నారా చోప్రా నుంచి అందాల విందు తప్ప క్యారెక్టర్ పరంగా ఏం ఆశించలేం. బీ, సీ సెంటర్ల ఆడియన్స్ ను ఆకట్టుకునేందుకు ఆమెను వాడుకున్నట్లు ఉన్నారు. విలన్ గా కబీర్ సింగ్ దుల్హన్ బాగా చేశాడు. కానీ, ఫస్ట్ హాఫ్ లో అతని పాత్రను ఎంత పవర్ ఫుల్ గా చూపించారో, సెకండాఫ్ వచ్చేసరికి జోకర్ గా మార్చేశారు. మిగతా నటీనటుల్లో సప్తగిరి, థర్టీ ఇయర్స్ పృథ్వీ కామెడీయే కాస్త ఊరట ఇచ్చే అంశం.

సాంకేతిక విభాగం పరంగా దినేష్ బాణీలు పర్వాలేదనిపించేలా ఉన్నాయి. కానీ.. బ్యాగ్రౌండ్ స్కోర్ లౌడ్ మరీ ఎక్కువయ్యింది. సి.రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ బాగుంది. పాటలు వినడానికి బాగా లేకపోయినా పిక్చరైజేషన్ బాగా చేశాడు. ఎడిటింగ్ వర్మ సీన్ సీన్ కి సంబంధం లేకుండా అతికించేశాడు. యాక్షన్ పార్ట్ మరీ ఓవర్ గా అనిపించకమానదు. మొత్తానికి దర్శకుడిగా తన తొలి చిత్రమైన "రక్ష"తో కనీసం ఓ మోస్తరు మార్కులు వేయించుకున్న వంశీ ఇప్పుడు జక్కన్నగా మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు.

ఫ్లస్ పాయింట్లు:

సునీల్ కామెడీ టైమింగ్

ఫస్టాఫ్

సప్తగిరి, థర్టీ ఇయర్స్ పృథ్వీ కామెడీ

మైనస్ పాయింట్లు:

సెకండాఫ్

విసిగించే పాటలు

వీక్ ఎడిటింగ్

దర్శకత్వం

తీర్పు:
ఈ సినిమా కోసం అనుకున్న కథ... అందుకోసం ఎంచుకున్న తారాగణం అంతా బాగా ఉన్నప్పటికీ దానిని నడిపించే స్క్రీన్ ప్లేలోనే పూర్తిగా బోల్తాపడ్డాడు దర్శకుడు. సునీల్ ఈజ్ బ్యాక్ టు ఎంటర్ టైన్ అని వెళ్లిన వారందరికీ నిరాశే ఎదురుకాక తప్పదు. సునీల్ లాంటి మంచి కామెడీ టైమింగ్ ఉన్న నటుడికి ఈ సబ్జెక్ట్ సరిగ్గా సరిపోయేదే. కానీ, సెకంఢాఫ్ లో నిర్లక్ష్యం సినిమా మొత్తాన్ని చెడగొట్టేసింది. చాలా వరకు పాత సినిమాలోని సీన్లను కాపీ పేస్ట్ చేసేశాడు వంశీ. ఫ్యామిలీ ఆడియన్స్ అంతగా ఆకట్టుకోవటం కష్టమే. ఓవరాల్ గా జక్కన్న మరో రోటీన్ కామెడీ ఎంటర్ టైనర్ గానే మిగిలిపోయింది.

చివరగా... నవ్వులు అంతగా పూయించగా పోగా కాస్త విసిగించిన ఈ జక్కన్న.. జస్ట్ బిలో యావరేజ్.

Author Info

Bhaskar

పూర్తి పేరు భాస్కర్ గౌడ్ శ్రీపతి.  ఏ వార్త అయినా సరే సింపుల్ గా రాసేందుకు ప్రయత్నిస్తుంటాడు. సమకాలీన రాజకీయాలు, పరిస్థితులపై విశ్లేషణ చేసి వ్యాసాలు రాయటం అదనపు బాధ్యతగా నిర్వహిస్తున్నాడు.  సినిమాలు చూడటం అంటే ఇతనికి ఎక్కువ పిచ్చి.  స్టాంపుల సేకరణ, కాయిన్ కలెక్షన్ ఇతని హాబీలు. సోషల్ మీడియా అప్ డేట్లతో వార్తలు త్వరగతిన అందించడం ఇతని ప్రత్యేకత. అయాన్ రాండ్ నవలలు ఎక్కువగా చదువటం, కార్డూన్లు ఎక్కువ చూడటం చేస్తుంటాడు.