ఒక మనసు రివ్యూ|Oka Manasu movie review

Teluguwishesh ఒక మనసు ఒక మనసు Oka Manasu movie review Product #: 75832 2 stars, based on 1 reviews
  • చిత్రం  :

    ఒక మనసు

  • బ్యానర్  :

    మధుర ఎంటర్‌టైన్‌మెంట్స్ , టివి9 సమర్పణ

  • దర్శకుడు  :

    రామరాజు

  • నిర్మాత  :

    మధుర శ్రీధర్

  • సంగీతం  :

    సునీల్ కశ్యప్

  • సినిమా రేటింగ్  :

    22  2

  • ఛాయాగ్రహణం  :

    రాంరెడ్డి

  • ఎడిటర్  :

    ధర్మేంద్ర కాకర్ల

  • నటినటులు  :

    నాగశౌర్య, నీహారిక, రావు రమేష్, ప్రగతి, వెన్నెల కిషోర్, అవసరాల శ్రీనివాస్ తదితరులు

Oka Manasu Movie Review

విడుదల తేది :

2016-06-24

Cinema Story

హీరో సూర్య (నాగశౌర్య) ఒక రాజకీయనాయకుడు కావాలనుకుంటాడు. అందుకోసం ఊళ్లో సెటిల్ మెంట్స్ చేస్తుంటాడు. సూర్య మేనమామ ఎమ్మెల్యే అవడంతో తనుకూడ మామ బాటలో ఎప్పటికైనా ఎమ్మెల్యేగా గెలుస్తానని అనుకుని కలలు కంటుంటాడు. సూర్య తండ్రి రావు రమేష్. అదే ఊళ్లో ఒక హాస్పిటల్ లో హౌస్ సర్జన్ గా పనిచేస్తున్న సంధ్య ( నిహారిక ) , సూర్యని తొలి చూపులోనే ఇష్టపడుతుంది. వాళ్లిద్దరి పరిచయం ప్రేమగా మారుతుంది. ఈ నేపథ్యంలో నాగశౌర్య ఒక సమస్యలో ఇరుక్కుంటాడు. ఆ సమస్య వల్ల తను జైలుపాలు అవుతాడు. బెయిల్ పైన బయటకి వచ్చినా కేసు మాత్రం అతడిని వెంటాడుతూనే ఉంటుంది. రావురమేష్ తన తండ్రి కారణంగా సంధ్యకి దూరమవుతాడు సూర్య. క్లైమాక్స్ లో అసలు సూర్య సంధ్యకి ఎందుకు దూరంగా ఉన్నాడు. వీళ్ల ప్రేమకథ సుఖాంతం అయ్యిందా లేదా ? సూర్యకి వచ్చిన సమస్య ఏంటి అన్నది మనం వెండితెరపై చూడాల్సిందే.

cinima-reviews
ఒక మనసు

చాలాకాలం తర్వాత ఒక హీరోయిన్ రిప్యూటెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చి తెరంగేట్రం చేసింది. మెగాఫ్యామిలీ మెగాబ్రదర్ నాగబాబు కూతురు నిహారిక హీరోయిన్ గా, నాగశౌర్య హీరోగా వెండితెరపై ఒక మనసు అంటూ సందడి చేసారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్ 24వ తేదిన విడుదలయ్యింది. మరి ఈ మెగాపాప అభిమానుల మనసును దోచుకుందా అనేది ఇప్పుడు చూద్దాం...


 

 
ప్లస్ పాయింట్స్ :
నాగశౌర్య యాక్టింగ్ గురించి ముందుగా చెప్పుకోవాలి. ఇప్పటివరకూ తన గ్లామర్ తోనే ఆకట్టుకున్న ఈ కుర్రహీరో ఈసినిమాలో మంచి పెర్ఫామెన్స్ స్కోప్ ఉన్న పాత్రలో నటించాడు. మంచి మార్కులు కొట్టేసాడు. సినిమాకి నాగశౌర్య మంచి ప్లస్ అయ్యాడు. ఇక నిహారిక తెరపైన మంచి డిగ్నిటీగా, తనదైన మార్క్ యాక్టింగ్ ని చేసింది. సినిమా ఆద్యంతం తన హావభావాలతో ఫర్వాలేదనిపించింది. ఎప్పటిలాగే సినిమాకి రావ్ రమేష్ తన యాక్టింగ్ తో ప్రాణం పోసాడు. హీరో ఫ్రెండ్స్ గా అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్ లు పరిధి మేరకు నటించారు.
సినిమాకి మ్యూజిక్ చాలా ప్లస్ పాయింట్స్. సాంగ్స్ అన్నీ కూడ వినడానికి ఎంతబాగున్నాయో, చూడటానికి కూడ అంతే బాగున్నాయి. సినిమాలో ఫోటోగ్రఫీ కూడ బాగా ఆకట్టుకుంటుంది. డైరెక్టర్ ప్రతిభ మనకి ఈ సినిమాలో ప్రతి ఫ్రేమ్ లో కనబడుతుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. మెయిన్ స్టోరీ సినిమాకి ప్రధాన బలంగా చెప్పుకోవచ్చు.

మైనస్ పాయింట్స్ :
నీహారికను హీరోయిన్గా ఎంచుకొని సినిమాకు భారీ హైప్ క్రియేట్ చేసిన దర్శకుడు రామరాజు. ఈ విషయంలో సినిమామని మంచి బిజినెస్ చేయగలిగాడు. కానీ, కొన్ని సన్నివేశాల్లో నిహారికా యాక్టింగ్ చేస్తున్నట్లుగా తెలిసిపోతోంది. ఫస్ట్ హాఫ్ అంతా స్లో నారేషన్ తో ప్రేక్షకులకు బోర్ కొట్టించాడు దర్శకుడు. సినిమా చాలావరకూ హీరో హీరోయిన్స్ మాటలపైనే నడిపించిన సన్నివేశాల్లో డైలాగ్స్ అంతగా ఆకట్టుకోలేదు. డైలాగ్స్ పై మరింత దృష్టి పెడితే బాగుండేది. కథాంశాన్ని చక్కగా ఎంచుకున్న దర్శకుడు కొన్ని సీన్స్ హైలెట్ గా రాసుకుంటే బాగుండేది. మద్యలో వచ్చే కొన్ని సీన్స్ ప్రేక్షకులకు బోర్ కొట్టించాయి. ఇలాంటి సినిమాలకి ఫీల్ చాలా ముఖ్యం. ఆ ఫీల్ నే సినిమా మొత్తం క్యారీ చెయ్యాలి. అలా చేయడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు.

విశ్లేషణ
సినిమా మెయిన్ స్టోరీ చాలా బాగుంటుంది. కానీ, దర్శకుడు నడిపించిన కథనం స్లోగా ఉంటుంది. ముఖ్యంగా డైలాగ్స్ పై మరింత వర్క్ చేస్తే బాగుండేది. నిహారిక కొన్ని సన్నివేశాల్లో బాగా చేసినా, ఒక హౌస్ సర్జన్ బాడీ లాంగ్వేజ్ ని ఎక్కడా చూపించలేకపోయింది. బహుశా మరికొన్ని సినిమాలు చేస్తే ఆ అనుభవం వస్తుందనుకుంటా. ఇలాంటి ప్రేమకథలకి మ్యూజిక్ ప్రధాన బలం. సినిమాలో మ్యూజిక్ ప్రాణం పోసింది. అదేగనక లేకపోతే సినిమా మొత్తం బోరింగానే ఉండేదేమో.
సింపుల్ గా చెప్పాలంటే వీకెండ్ ఖాళీగా ఉన్నవాళ్లు మెగాపాపని వెండితెరపై చూడాలనుకున్నవాళ్లు సినిమాని ఖచ్చితంగా ఒకసారి చూడొచ్చు