Sardaar Gabbar Singh | Pawan Kalyan | Review and Rating | Kajal Aggarwal | KS Ravindra

Teluguwishesh సర్దార్ గబ్బర్ సింగ్ సర్దార్ గబ్బర్ సింగ్ Get The Complete Details of Sardaar Gabbar Singh Telugu Movie Review. Starring Pawan Kalyan, Kajal Aggarwal, Sharad Kelkar, Raai Laxmi, Brahmanandam, Ali among others. Directed by K. S. Ravindra (Bobby), produced by Sharrath Marar and Sunil Lulla. Music Composed By Devi Sri Prasad. For More Details Visit Teluguwishesh.com Product #: 73696 3 stars, based on 1 reviews
  • చిత్రం  :

    సర్దార్ గబ్బర్ సింగ్

  • బ్యానర్  :

    నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లిమిటెడ్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, ఈరోస్ ఇంటర్నేషనల్

  • దర్శకుడు  :

    కె.యస్. రవీంద్ర (బాబీ)

  • నిర్మాత  :

    శరత్ మరార్, సునీల్ లుల్లా

  • సంగీతం  :

    దేవిశ్రీప్రసాద్

  • సినిమా రేటింగ్  :

    333  3

  • ఛాయాగ్రహణం  :

    ఆర్థర్.ఎ.విల్సన్

  • ఎడిటర్  :

    గౌతంరాజు

  • నటినటులు  :

    పవన్ కళ్యాణ్, కాజల్ అగర్వాల్, శరద్ కేల్కర్, అలీ, రాయ్ లక్ష్మీ, సంజన, అలీ, బ్రహ్మానందం తదితరులు.

Sardaar Gabbar Singh Movie Review

విడుదల తేది :

2016-04-08

Cinema Story

ట్రైలర్లో చెప్పినట్లుగానే మూడు రాష్ట్రాల సరిహద్దులను కలుపుకొని ఉన్న ‘రత్తన్ పూర్’ ప్రాంత నేపథ్యంలో నడిచే కథే ఈ ‘సర్దార్ గబ్బ సింగ్’. ఓ రాజకుటుంబానికి చెందిన నియంత భైరవ్ సింగ్ (శరద్ కెల్కర్). రత్తన్ పూర్ ప్రాంతంలోని సహజ వనరులను అక్రమంగా దక్కించుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. ఆ క్రమంలోనే ఓ ఊరినే నాశనం చేస్తాడు. ఇక అదే ప్రాంతంలో ఉండే మరో రాజకుటుంబం(ముఖేష్ రుషి)తో భైరవ్ సింగ్ కు ఓ శతృత్వం ఉంటుంది. రాజ కుమారి అర్షిని(కాజల్)ను పెళ్లి చేసుకొని తన పగ తీర్చుకోవాలని భైరవ్ సింగ్ అనుకుంటాడు. ఇలాంటి పరిస్థితులున్న ఊరిని చక్కబెట్టేందుకు సర్దార్ గబ్బర్ సింగ్ (పవన్ కళ్యాణ్)ను రత్తన్ పూర్ సిఐగా నియమిస్తారు. ఇక అక్కడి నుంచి ఏం జరిగింది? భైరవ్ సింగ్ అక్రమాలకు సర్దార్ ఎలా ఎదురెళ్లాడు? భైరవ్ సింగ్ కు మరియు కాజల్ కుటుంబాలకు మధ్య వున్న శతృత్వం ఏంటి? చివరకు పవన్ కళ్యాణ్ ‘రత్తన్ పూర్’ ప్రాంత సమస్యలను ఎలా పరిష్కరించాడు? అనే అంశాలను వెండితెర మీద చూస్తేనే బాగుంటుంది.

cinima-reviews
సర్దార్ గబ్బర్ సింగ్

పవర్ స్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం దగ్గరికొచ్చేసింది. మరికొద్ది రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సందడి చేయనున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఏప్రిల్ 8వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ భాషలలో గ్రాండ్ గా విడుదల కానుంది. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకొని, సెన్సార్ బోర్డ్ నుంచి ఎలాంటి కట్స్ లేకుండా U/A సర్టిఫికెట్ ను దక్కించుకుంది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన పాటలు ఇప్పటికే విడుదలై బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఇక ట్రైలర్లకు భారీ రెస్పాన్స్ వస్తోంది.

పవర్ ఫుల్, హై వోల్టేజ్ యాక్షన్, ఎంటర్ టైనర్ గా రూపొందిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కేవలం తెలుగులోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ లలో కూడా భారీ క్రేజ్ వచ్చేసింది. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ రాక కోసం బాలీవుడ్, కోలీవుడ్ జనాలు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాబీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లిమిటెడ్ బ్యానర్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లపై శరత్ మరార్, సునీల్ లుల్లాలు సంయుక్తంగా నిర్మించారు. పవన్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. రాయ్ లక్ష్మీ, సంజనలు కీలక పాత్రలలో నటించారు. బాలీవుడ్ నటుడు శరత్ కేల్కర్ విలన్ పాత్రలో నటించాడు. మరి ‘సర్దార్ గబ్బర్ సింగ్’ నేడు(ఏప్రిల్ 8) ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యింది. మరి ఈ సినిమా ఎలా వుందో ఒకసారి చూద్దామా!

ప్లస్ పాయింట్స్:
‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ లేకుంటే ఈ సినిమా అంతా బాగా సెట్ అయ్యేది కాదని చెప్పుకోవచ్చు. ఇందులో పవన్ తన స్టైల్, యాక్టింగ్, డైలాగ్ డెలివరీ, మ్యానరిజమ్స్, యాక్షన్ సన్నివేశాలలో అదరగొట్టేసాడు. అభిమానులు కోరుకునే అంశాలను పవన్ ఫుల్ మీల్స్ గా ఈ సినిమాలో చూపించేసాడు. తన కామెడీ టైమింగ్ తో సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోసుకొని నడిపించేసాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో కొన్ని కొన్ని కామెడీ బిట్స్, క్లైమాక్స్ లో వీణ స్టెప్ అభిమానులను ఖుషీ చేస్తాయి. ఇక రాజకుమారి పాత్రలో కాజల్ చాలా చక్కగా నటించింది. తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. పవన్ కళ్యాణ్-కాజల్ ల మధ్య వచ్చే సీన్లు చాలా బాగున్నాయి. వీరిద్దరి కెమిస్ట్రీ అద్భుతంగా పండింది. భైరవ్ సింగ్ గా విలన్ పాత్రలో శరద్ కెల్కర్ మంచి నటన కనబరిచాడు. రత్తన్ పూర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి వలే తన హవాభావాలతో చాలా చక్కగా నటించాడు. ఇక మిగతా నటీనటులు వారి వారి పాత్రలమేరకు బాగా నటించారు.

సినిమా పరంగా చూసుకుంటే.. ఫస్ట్ హాఫ్ అంతా కూడా కాస్త ఎంటర్ టైనింగ్ గా సాగుతూ వుంటుంది. సెకండ్ హాఫ్ లో ఎంటర్ టైన్మెంట్ తో పాటు యాక్షన్, లవ్ వంటి అంశాలతో కొనసాగుతుంది. రత్తన్ పూర్ విలేజ్ సెట్ అద్భుతం. పాటలు చాలా బాగా సెట్ అయ్యాయి. ముఖ్యంగా తోబ తోబ పాట పవర్ స్టార్ ఫ్యాన్స్ కు పండగే పండగ అని చెప్పుకోవచ్చు. మొత్తానికి పవర్ స్టార్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాతో దుమ్ముధులిపేసాడు.

మైనస్ పాయింట్స్:
ఈ చిత్రానికి మేజర్ మైనస్ పాయింట్ కథ, స్ర్కీన్ ప్లే. ఇలాంటి కథలు ఇప్పటికే చాలా వచ్చినప్పటికీ... కథనం విషయంలో ఆకట్టుకోలేకపోయింది. సరైన విధంగా స్ర్కీన్ ప్లే లేకపోవడంతో చాలా చోట్ల మైనస్ గా నిలిచాయి. ఎలాంటి ఎమోషన్స్ లేకుండా కథనం సాగడం, అతిగా అనిపించే యాక్షన్ సీన్లు, కథలో సరైన క్లారిటీ లేకపోవడం... ఇక కథ ప్రారంభమైన కొద్దిసేపటికే సినిమా పట్టుతప్పినట్లుగా అనిపిస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ వరకు ఎలాగోలా లాక్కొచ్చినా.. సెకండ్ హాఫ్ లో మాత్రం పూర్తిగా కథ ట్రాక్ తప్పినట్లుగా కనిపిస్తుంది. దీనికి తోడు సినిమా రన్ టైం. రెండున్నర గంటలకు పైనే వున్న చిత్ర నిడివి సినిమాకు మైనస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ వంటి హీరోతో ఫైట్ చేయాలంటే విలన్ పాత్ర ఎలా వుండాలో ఊహించుకోండి... కానీ విలన్ పాత్రను క్లైమాక్స్ వరకు స్ట్రాంగ్ గా డిజైన్ చేసుకోలేదు. మొత్తానికి ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర, పాటలు, సెట్స్ తప్ప మిగతావి అంతా కాస్త మైనస్ పాయింట్స్ గా చెప్పుకోవచ్చు.

సాంకేతికవర్గం పనితీరు:
‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాలోని సాంకేతికవర్గం గురించి మాట్లాడుకోవాలంటే ముందుగా... రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం గురించి స్టార్ట్ చేద్దాం. ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ అందించిన మ్యూజిక్ మేజర్ ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. పాటలు ఇప్పటికే బ్లాక్ బస్టర్ హిట్టయ్యాయి.. ఇక సినిమాలో విజువల్స్ పరంగా మరింత బాగున్నాయి. అలాగే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ లో దేవి అదరగొట్టాడు. తోబ తోబ సాంగ్ కు అభిమానులు స్టెప్పులెసే విధంగా థియేటర్లలో దుమ్మురేపుతోంది. ఆర్థర్ విల్సన్ సినిమాటోగ్రఫి చాలా బాగుంది. విజువల్స్ పరంగా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ను చాలా చక్కగా చూపించారు. ప్రతి సీన్ కూడా చాలా గ్రాండ్ గా చూపించారు. ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ కడలి పనితీరు అద్భుతం. రత్తన్ పూర్ సెట్ సింప్లీ సూపర్బ్. ఎడిటింగ్ అస్సలు బాగోలేదు. ఇక దర్శకుడిగా బాబీ నటీనటులు నుంచి తనకు కావాలసిన నటనను రాబట్టుకోగలిగాడు. కానీ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ను స్ర్కీన్ మీద సరైన విధంగా చూపించడంలో బాబీ ప్రతిభ ఎక్కడా కనిపించలేదు. ఇక పవన్ కళ్యాణ్ అందించిన కథ, స్ర్కీన్ ప్లే అంతంత మాత్రంగానే వున్నాయి. సాయిమాధవ్ బుర్రా అందించిన మాటలు సూపర్బ్. నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమా అంతా కూడా గ్రాండ్ విజువల్స్ తో రూపొందించారు.

చివరగా:
‘సర్దార్ గబ్బర్ సింగ్’: కమర్షియల్ ఫ్యాన్స్ ఎంటర్ టైనర్.