Savitri | Nara Rohit | Review and Rating | Nandita | Pavan Sadineni

Teluguwishesh సావిత్రి సావిత్రి Get The Complete Details of Savitri Telugu Movie Review. featuring Nara Rohit, Nandita, Jagapathi Babu, Prakash Raj, Vadde Naveen, Narsing Yadav among others. Directed by Ram Gopal Varma. Music by Ravi Shankar, D.O.P by Anji and Editing by Anwar Ali. Produced by Swethalana, Varun, Teja and CV Rao under the banner Sree Subha Swetha Films. For More Details Visit Teluguwishesh.com Product #: 73576 2.75 stars, based on 1 reviews
  • చిత్రం  :

    సావిత్రి

  • బ్యానర్  :

    విజన్ ఫిలిం మేకర్స్

  • దర్శకుడు  :

    పవన్ సాధినేని

  • నిర్మాత  :

    డా.వి.బి.రాజేంద్రప్రసాద్

  • సంగీతం  :

    శ్రవణ్

  • సినిమా రేటింగ్  :

    2.752.75  2.75

  • ఛాయాగ్రహణం  :

    వస్సంత్

  • ఎడిటర్  :

    గౌతం నెరుసు

  • నటినటులు  :

    నారా రోహిత్, నందిత, పోసాని, మురళి శర్మ, అజయ్, రవి బాబు, వెన్నెల కిషోర్, శ్రీముఖి, ధన్య బాలకృష్ణన్ తదితరులు.

Savitri Movie Review

విడుదల తేది :

2016-04-01

Cinema Story

సావిత్రి పెళ్లి కథాంశంతో రూపొందిన ఈ చిత్రంలో దొరబాబు (మురళి శర్మ) తన కూతురు పెళ్లిని చాలా ఘనంగా చేయాలని భావిస్తుంటాడు. అలాంటి దొరబాబు రెండవ కూతురే సావిత్రి(నందిత) పెళ్లి కథే ఈ ‘సావిత్రి’ చిత్ర కథాంశం. తన కూతురు సావిత్రి పెళ్లి కుదిరిన సంధర్భంగా తన భామ్మ మొక్కు చెల్లించటం కోసం షిరిడీ నుంచి రైలులో బయలుదేరుతారు. అనుకోకుండా అదే ట్రైన్ లో సావిత్రిని చూసిన రిషి(నారా రోహిత్) తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. కానీ అప్పటికే పెళ్లి కుదరడంతో రిషిపై నందిత కోప్పడుతుంది. కానీ సావిత్రిని పెళ్లి చేసుకోవాల్సిన వ్యక్తి మరో అమ్మాయిని ప్రేమించడంతో సావిత్రి పెళ్లి క్యాన్సిల్ అవుతుంది. ఇదే సమయంలో సావిత్రి ఇంట్లోకి ఎంట్రీ ఇస్తాడు రిషి. సావిత్రికి మళ్లీ పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెడతారు ఇంట్లో వాళ్లు. అసలు సావిత్రి ఇంట్లోకి ఎలా వచ్చాడు? ఇంట్లో వాళ్లకు రిషి ఎలా దగ్గరయ్యాడు? తను ప్రేమించిన సావిత్రిని ఎలా దక్కించుకున్నాడు? ఇలాంటి విషయాలను తెలియాలంటే వెండితెర మీద ‘సావిత్రి’ చిత్రం చూడాల్సిందే.

cinima-reviews
సావిత్రి

వరుస సినిమాలతో బిజీగా వున్న నారా రోహిత్ నటించిన తాజా చిత్రం ‘సావిత్రి’. దర్శకుడు పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని విజన్ ఫిలిం మేకర్స్ పతాకంపై డా.వి.బి.రాజేంద్రప్రసాద్ నిర్మించారు. శ్రవణ్ సంగీతం అందించాడు. నారా రోహిత్ సరసన తొలిసారిగా నందిత హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. బ్యూటీఫుల్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని నేడు(ఏప్రిల్1) ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మరి ఈ సినిమా ఎలా వుందో ఒకసారి చూద్దామా!

ప్లస్ పాయింట్స్:
‘సావిత్రి’ సినిమాకు ముగ్గురు ప్లస్ పాయింట్స్ గా నిలిచారు. వారు నారా రోహిత్, నందిత, మురళి శర్మ. నారా రోహిత్ తన పాత్రలో జీవించేసాడు. తుంటరి కుర్రాడిగా, ప్రేమికుడిగా, బంధాలను అర్థం చేసుకునే వ్యక్తి పాత్రలో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా తన డైలాగ్ డెలివరి, యాక్టింగ్ తో చక్కగా ఎంటర్ టైన్ చేసాడు. ఇక సావిత్రి పాత్రలో నందిత చాలా చక్కగా నటించింది. తన క్యూట్ క్యూట్ హవాభావాలతో, స్మైల్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక సావిత్రి తండ్రి దొరబాబు పాత్రలో మురళిశర్మ ఆకట్టుకున్నాడు. ఎక్కడా కూడా ఓవర్ కాకుండా తన పాత్రలో ఒదిగిపోయాడు. ఓ కుటుంబ పెద్దగా మురళి శర్మ కట్టిపడేస్తుంది.

ఇక ‘సావిత్రి’ సినిమాకు మరో ప్లస్ పాయింట్ కామెడీ. ఫిష్ వెంకట్, ప్రభాస్ శ్రీను, రవిబాబు, పోసానిల కామెడీ సినిమాకు హైలెట్ గా చెప్పుకోవచ్చు. సినిమా ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా కామెడీ తో చక్కగా ఎంటర్ టైన్ చేయగలుగుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఎంటర్ టైన్మెంట్ తో కొనసాగుతుంటే.. సెకండ్ హాఫ్ అంతా కుటుంబ బంధాలు, ఎమోషన్స్, ఫీలింగ్స్ తో కొనసాగుతోంది. మొత్తానికి ‘సావిత్రి’ చిత్రం కుటుంబతరహా చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులకు తెగ నచ్చేస్తుంది.

మైనస్ పాయింట్స్:
‘సావిత్రి’ సినిమాకు మేజర్ మైనస్ పాయింట్ స్టోరీ. ఇప్పటికే ఇలాంటి కథలతో చాలా సినిమాలు వచ్చాయి. ఇక ఫస్ట్ హాఫ్ ఎంటర్ టైనింగ్ గా సాగినప్పటికీ.. సెకండ్ హాఫ్ మాత్రం కాస్త సాగదీసినట్లుగా అనిపిస్తుంది. కొన్ని కొన్ని సీన్లు బోర్ ను కలిగిస్తుంటాయి.

సాంకేతికవర్గం పనితీరు:
ఈ సినిమాకు ఎ.వసంత్ అందించిన సినిమాటోగ్రఫి బాగుంది. విజువల్స్ పరంగా చాలా చక్కగా చూపించారు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ ను ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యే విధంగా చిత్రీకరించారు. శ్రవణ్ అందించిన పాటలు పర్వాలేదనిపించినా.. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. సినిమాకు బాగా హెల్ప్ అయ్యింది. రీ రికార్డింగ్ తో ఆకట్టుకుంది. ఎడిటింగ్ విషయంలో మరింత కేర్ తీసుకొని వుంటే బాగుండేది. ఆర్ట్ వర్క్ బాగుంది.

దర్శకుడు పవన్ సాధినేని మరోసారి సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. స్టోరీలైన్ పాతదే అయినప్పటికి.. కథనం పరంగా మంచి మార్కులే కొట్టేసాడు. ఇక నటీనటుల నుంచి మంచి నటనను రాబట్టుకోవడంలో సక్సెస్ అయ్యాడు. ఫస్ట్ హాఫ్ ను ఎంటర్ టైన్ గా డిజైన్ చేసుకున్నప్పటికీ.. సెకండ్ హాఫ్ లో అంతగా కేర్ తీసుకోలేనట్లుగా అనిపిస్తుంది. మొత్తానికి పర్వాలేదనిపించాడు. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

చివరగా:
‘సావిత్రి’ : ఫ్యామిలీ ఎంటర్ టైనర్.