Attack | Manchu Manoj | Review and Rating | RGV | Surabhi

Teluguwishesh ఎటాక్ ఎటాక్ Get The Complete Details of Attack Telugu Movie Review. featuring Manchu Manoj, Surabhi, Jagapathi Babu, Prakash Raj, Vadde Naveen, Narsing Yadav among others. Directed by Ram Gopal Varma. Music by Ravi Shankar, D.O.P by Anji and Editing by Anwar Ali. Produced by Swethalana, Varun, Teja and CV Rao under the banner Sree Subha Swetha Films. For More Details Visit Teluguwishesh.com Product #: 73575 2 stars, based on 1 reviews
  • చిత్రం  :

    ఎటాక్

  • బ్యానర్  :

    శ్రీ శుభశ్వేత ఫిలింస్

  • దర్శకుడు  :

    రాంగోపాల్ వర్మ

  • నిర్మాత  :

    శ్వేతలానా, వరుణ్, తేజ, సివిరావ్

  • సంగీతం  :

    రవిశంకర్

  • సినిమా రేటింగ్  :

    22  2

  • ఛాయాగ్రహణం  :

    అంజి

  • ఎడిటర్  :

    అన్వర్ అలీ

  • నటినటులు  :

    మంచు మనోజ్, సురభి, ప్రకాశ్ రాజ్, జగపతి బాబు, వడ్డే నవీన్, అభిమన్యు సింగ్, మంజు భార్గవి, పూనమ్ కౌర్ తదితరులు.

Attack Movie Review

విడుదల తేది :

2016-04-01

Cinema Story

రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వ్యక్తి గురురాజ్(ప్రకాష్ రాజ్). గతంలో గురురాజ్ కు కొంతమందితో తగదాలు వున్నప్పటికీ.. వాటన్నిటిని మర్చిపోయి తన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ వుంటాడు. గురురాజ్ కు ముగ్గురు కొడుకులు. పెద్దవాడు కాళీ(జగపతిబాబు), రెండవ వాడు బూపీ(జగపతిబాబు), చిన్నవాడు రాధా(మంచు మనోజ్). అయితే ఓసారి ఓ ల్యాండ్ తగాదాపై ఓ వ్యక్తితో మాట్లాడి వస్తుండగా గురురాజ్ ను కొంతమంది ఎటాక్ చేసి హత్య చేస్తారు. తన తండ్రిని ఎవరు హత్య చేసారనే విషయం కనుక్కునే పనిలో వున్న కాళిని కూడా చంపేస్తారు. తన తండ్రి, పెద్దన్నలను హత్య చేసింది ఎవరు? ఈ హత్యల వెనుకున్న కారణం ఏంటి? ఈ కారణాలను రాధా ఎలా కనుక్కొన్నాడు? చివరకు రాధా ఏం చేసాడు అన్నది మిగతా కథ. 

cinima-reviews
ఎటాక్

దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో మంచు మనోజ్, సురభి హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘ఎటాక్’. సి.కె.ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి. బ్యానర్ సమర్పణలో శ్రీ శుభశ్వేత ఫిలింస్ బ్యానర్ పై శ్వేతలానా, వరుణ్, తేజ, సివిరావ్ సంయుక్తంగా నిర్మించారు. ప్రకాశ్ రాజ్, జగపతి బాబు, వడ్డే నవీన్, అభిమన్యు సింగ్, మంజు భార్గవి, పూనమ్ కౌర్ ప్రధాన పాత్రలలో నటించారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. గతకొద్ది కాలంగా విడుదలకు నోచుకోని ఈ చిత్రాన్ని నేడు(ఏప్రిల్ 1) ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. యాక్షన్ రివేంజ్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా ఎలా వుందో ఒకసారి చూద్దామా!

ప్లస్ పాయింట్స్:

‘ఎటాక్’ సినిమాలో మంచు మనోజ్ నటన మేజర్ ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. మొట్టమొదటిసారిగా పూర్తిస్థాయి గడ్డంతో, ఫుల్ మాస్ పాత్రలో కనిపించి, ప్రేక్షకులను తన నటనతో మెప్పించాడు. డైలాగ్ డెలివరి, యాక్టింగ్ లో మంచి ప్రతిభ కనబరిచాడు. సినిమా ప్రీ క్లైమాక్స్ లో మనోజ్ యాక్టింగ్ సూపర్బ్. మనోజ్ తర్వాత అంత రేంజులో చెప్పుకోదగ్గ పాత్ర ‘సత్తు’. ‘ఎటాక్’ చిత్రంలో విలన్ గా సత్తు పాత్రలో నటించిన అభిమన్యు సింగ్ తన నటనతో ఆకట్టుకున్నాడు. అభిమన్యు సింగ్ తన నటనతో మనోజ్ కు గట్టి పోటీనే ఇచ్చాడు. ఇక ప్రకాష్ రాజ్, జగపతి బాబులు వారి వారి పాత్రలలో జీవించేసారు. హీరోయిన్ సురభి పాత్ర చిన్నదే అయినప్పటికీ.. చాలా చక్కగా నటించింది. ఫస్ట్ హాఫ్ లో ప్రకాష్ రాజ్ పై ఎటాక్ చాలా ఉత్కంఠను కలిగిస్తుంది. అలాగే క్లైమాక్స్ లో విలన్ ను శిక్షించే విధానం బాగుంది. రన్ టైం సినిమాకు ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు.

మైనస్ పాయింట్స్:
‘ఎటాక్’ సినిమా కథ చిన్నదైనా.. కథనంలో ఏమాత్రం కొత్తదనం కనిపించలేదు. కథనంలో రాసుకున్న పాత్రల ఎమోషన్స్ ను పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేసి వుంటే అదిరిపోయేది. కానీ కథనంలో పూర్తిగా లోపించిందని చెప్పుకోవచ్చు. ఇక పాత్రలు ఎక్కువ కావడంతో క్లారిటీ మిస్ అవుతుంది. ప్రేక్షకులను థ్రిల్ చేసి అంశాలు, ట్విస్టులు ఏమి లేకపోవడం మైనస్ పాయింట్. ఇక సెకండ్ హాఫ్ పెద్ద మైనస్. సెకండ్ హాఫ్ అంతా కూడా సాగదీసినట్లుగా అనిపిస్తుంది. చూసే ప్రేక్షకులకు మరీ బోర్ కొడుతుంది. కొన్ని కొన్ని సీన్లకు లాజిక్స్ లేవు. ఇక రెగ్యులర్ సినిమాల్లో వుండే ఎంటర్ టైన్మెంట్ అస్సలు లేదు.

సాంకేతికవర్గం పనితీరు:
సినిమాటోగ్రఫి బాగుంది. సీన్స్ ఎమోషన్స్ ను బాగా కాప్చర్ చేసారు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదనిపించింది. అన్సర్ అలీ ఎడిటింగ్ బాలేదు. ఆర్ట్ వర్క్ బాగుంది. ఇక దర్శకుడు రాంగోపాల్ వర్మ రొటీన్ కథనే ఎంచుకొని, తనదైన శైలిలో కథనంతో తీర్చిదిద్దాలని ప్రయత్నించారు. కానీ కథనంలో ఎలాంటి కొత్తదనం లేకపోవడంతో ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరగా:
‘ఎటాక్’ : బోరింగ్ రివేంజ్ డ్రామా