Run | Sundeep Kishan | Run Review | Anisha Ambrose

Teluguwishesh రన్ రన్ Get The Complete Details of Run Telugu Movie Review. The Latest Telugu Movie Run featuring Naga Shourya and Anisha Ambrose exclusively on Madhura Audio. Music composed by Kalyan Koduri. Directed by BV Nandini Reddy and produced by KL Damoodar Reddy. For More Details Visit Teluguwishesh.com Product #: 73367 2.75 stars, based on 1 reviews
  • చిత్రం  :

    రన్

  • బ్యానర్  :

    ఎకె ఎంటర్ టైన్మెంట్స్

  • దర్శకుడు  :

    అని కన్నెగంటి

  • నిర్మాత  :

    సుధాకర్ చెరుకూరి, కిషోర్ గరికపాటి, అజయ్ సుంకర

  • సంగీతం  :

    సాయికార్తీక్

  • సినిమా రేటింగ్  :

    2.752.75  2.75

  • ఛాయాగ్రహణం  :

    బి.రాజశేఖర్

  • ఎడిటర్  :

    ఎం.ఆర్.వర్మ

  • నటినటులు  :

    సందీప్ కిషన్, అనీషా అంబ్రోస్, బాబీ సింహ, బ్రహ్మాజీ, పోసాని తదితరులు.

Run Movie Review

విడుదల తేది :

2016-03-23

Cinema Story

ఓ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేసే సంజయ్ (సందీప్ కిషన్).. అనుకోకుండా ఉద్యోగం కోల్పోతాడు. దీంతో అవసరాల కోసం వడ్డీరాజా(బాబీసింహ) దగ్గర వడ్డీకి డబ్బులు తీసుకుంటాడు. అనుకున్న సమయానికి వడ్డీ డబ్బులు ఇవ్వలేదని సంజయ్ వెంటపడతాడు వడ్డీరాజా. అలాగే సందీప్ ప్రేమించిన అమూల్య(అనీషా అంబ్రోస్) తండ్రి.. వీళ్లిద్దరి పెళ్లికి నిరాకరిస్తాడు. దీంతో వీరిద్దరూ ఇంట్లో నుంచి పారిపోతారు. అలా అటు వడ్డీరాజా నుంచి అమూల్య తండ్రి నుంచి వీరిద్దరూ ఎలా తప్పించుకున్నారు? వారికి ఎదురైన సమస్యలేంటి? అసలు అమూల్య తండ్రి ఎందుకు పెళ్లికి నిరాకరిస్తాడు? ఈ కష్టాల నుంచి ఎలా బయటపడ్డారు అనే అంశాలను వెండితెరమీద చూడాల్సిందే.

cinima-reviews
రన్

సందీప్ కిషన్, అనీషా అంబ్రోస్ జంటగా ఏ టీవీ రామబ్రహ్మం సుంకర సమర్పణలో సుధాకర్ చెరుకూరి, కిషోర్ గరికపాటి, అజయ్ సుంకర నిర్మాతలుగా మిష్టర్ నూకయ్య ఫేమ్ అని కన్నెగంటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రన్’. విడుదలైన సినిమా ఫస్ట్ లుక్, టీజర్, కాన్సెప్ట్ ట్రైలర్, పాటలకు ఆడియెన్స్ నుండి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రంలో సంజు అనే పాత్ర సందీప్ కిషన్, అమ్ము పాత్రలో అనీషా అంబ్రోస్, వడ్డీ రాజా పాత్రలో నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ బాబీ సింహా నటిస్తున్నారు. ఈ క్యారెక్టర్స్ లో టైమ్ వల్ల ఎలాంటి మలుపులు తిరిగాయనే కథాంశంతో రూపొందింది. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని క్లీన్ యు సర్టిఫికేట్ ను సొంతం చేసుకుంది. హోలి సంద‌ర్భంగా నేడు(మార్చి 23) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా వుందో ఒకసారి చూద్దామా!

ప్లస్ పాయింట్స్ :
సంజయ్ పాత్రలో నటించిన హీరో సందీప్ కిషన్ తన పాత్రకు పూర్తి న్యాయం చేసాడు. లవ్, ఎమోషన్, యాక్షన్ సీన్లలో బాగా నటించాడు. ఇక హీరోయిన్ గా నటించిన అనీషా తన పాత్రకు తగిన న్యాయం చేసింది. అనీషా పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ.. వున్నంతమేరకు పర్వాలేదనిపించింది. ఇక వడ్డీరాజా పాత్రలో నటించిన బాబీ సింహ అద్భుతంగా నటించాడు. తన పాత్రకు పూర్తి న్యాయం చేసాడు. బాబీ సింహ హవాభావాలు, నటన, టైమింగ్ చాలా బాగున్నాయి. ఇక పోలీస్ ఆఫీసర్ గా బ్రహ్మాజీ, పొలిటికల్ లీడర్ గా పోసానీలు అక్కడక్కడ నవ్వించే ప్రయత్నం చేసారు. మిగతా నటీనటులు పర్వాలేదనిపించారు.

‘రన్’ సినిమా అంతా కూడా టైమ్ అనే అంశం చుట్టూ తిరుగుతూవుంటుంది. అనుకున్న సమయానికి చేయాల్సిన పనులు, నేరవేర్చాల్సిన బాధ్యతలు, అనుకోకుండా వచ్చిపడే కొత్త సమస్యలు, కష్టాలు.. వీటన్నింటిని ఒకే రోజులో చెప్పాలనే కథాంశంతో చాలా చక్కగా ప్లాన్ చేసుకున్నారు. స్టోరీ లైన్ బాగుంది. ఫస్ట్ హాఫ్ హైలెట్ గా చెప్పుకోవచ్చు. స్ర్కీన్ ప్లే కూడా బాగా హెల్ప్ అయ్యింది. మొత్తానికి పర్వాలేదనిపించింది.

మైనస్ పాయింట్స్ :
‘రన్’ సినిమాకు సెకండ్ హాఫ్ మైనస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక బాగా సాగదీసినట్లుగా అనిపిస్తూ వుంటుంది. చూసే ప్రేక్షకులకు బోర్ ఫీలింగ్ కలుగుతుంది. అనీషా, బాబీ సింహాల పాత్రలను సరిగ్గా డిజైన్ చేసుకోలేదు. సంజయ్ పాత్రలో మలుపులు తిప్పే వడ్డీరాజా క్యారెక్టర్ సరైన విధంగా రాసుకోలేదు. ఇక ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఏదో హడావిడిగా చెప్పేసి, శుభం కార్డు సమయానికి ఇంతేనా అనిపించేలా చేసారు. సందీప్, అనీషాల మధ్య కెమిస్ట్రీ కూడా అంతగా లేదు. అలాగే సెకండ్ హాఫ్ లో హీరోయిన్ పాత్రను మర్చిపోయినట్లుగా అనిపిస్తోంది. ‘రన్’ చిత్రానికి సెకండ్ హాఫ్ బోర్.

సాంకేతికవర్గం పనితీరు:
‘రన్’ సినిమాకు రాజశేఖర్ అందించిన సినిమాటోగ్రఫి బాగుంది. విజువల్స్ పరంగా చాలా క్వాలిటీతో చూపించారు. సాయికార్తీక్ అందించిన పాటలు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు. ఎడిటింగ్ బాగుంది. సెకండ్ హాఫ్ లో మరింత కేర్ తీసుకుని వుంటే బాగుండేది. ఇక మాళయాలం ఒరిజనల్ కథకు ఏ మాత్రం మార్పులు చేయకుండా తెలుగులో కూడా అలాగే చెప్పే ప్రయత్నం చేసాడు దర్శకుడు అనీ. కానీ తెలుగు నెటివిటికి తగ్గ ఎమోషన్ ను సెట్ చేయలేకపోయారు. కొన్ని కొన్ని సీన్లలో అనీ ప్రతిభను మెచ్చుకోవచ్చు. మొత్తానికి దర్శకుడిగా అనీ పర్వాలేదనిపించాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరగా:
‘రన్’: పర్వాలేదనిపించే థ్రిల్లింగ్ రన్