Latha Hegde | Nara Rohit | Tuntari Review | Latha Hegde

Teluguwishesh తుంటరి తుంటరి Get The Complete Details of Tuntari Telugu Movie Review. The Latest Telugu Movie Tuntari featuring Nara Rohit, Latha Hegde. Directed by Kumar Nagendra. Music composed by Sai Karthik. Produced by Ashok Nagarjun. For More Details Visit Telguguwishesh.com Product #: 73050 3 stars, based on 1 reviews
  • చిత్రం  :

    తుంటరి

  • బ్యానర్  :

    శ్రీకీర్తి ఫిలింస్

  • దర్శకుడు  :

    కుమార్ నరేంద్ర

  • నిర్మాత  :

    అశోక్, నాగరాజు

  • సంగీతం  :

    సాయి కార్తీక్

  • సినిమా రేటింగ్  :

    333  3

  • ఛాయాగ్రహణం  :

    పలానీ కుమార్

  • నటినటులు  :

    నారా రోహిత్,. లత హెగ్డే

Tuntari Review
Cinema Story

కిశోర్, ఆనంద్, సుదర్శన్, కల్కి, పూజిత ఐదుగురు స్నేహితులు, సత్వం సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేసే ఈ ఐదుగురు ఫ్రెండ్స్ అనంతగిరి ఫారెస్ట్కు పిక్నిక్ వెళతారు. అక్కడ ఓ సాధువును కలిసిన వీళ్లకు భవిష్యత్తు గురించి ఓ విషయం తెలుస్తుంది. నాలుగు నెలల తరువాత జరగబోయే ఓ బాక్సింగ్ మ్యాచ్లో రాజు అనే వ్యక్తి గెలుస్తాడు. ఆ రాజు బిఎస్ఎన్ఎల్లో పనిచేసే ఆనందరావు గారి అబ్బాయి అని తెలుస్తుంది. దీంతో బాక్సింగ్ మ్యాచ్ విన్నర్కి ఇచ్చే ఐదు కోట్ల ప్రైజ్ మనీ కోసం ఎలాగైన ఆ రాజును వెతికి పట్టుకోవాలనుకుంటారు.

 

అదే సమయంలో చిన్నప్పటి నుంచి చదువు, పని లేకుండా గాలికి తిరిగే లోకల్ రాజు( నారా రోహిత్) ను కిశోర్ బ్యాచ్ పట్టుకుంటారు. రాజు తండ్రి ఆనందరావు (కాశీ విశ్వనాథ్) బిఎస్ఎన్ఎల్ ఆఫీస్లో పని చేస్తుంటాడు. దీంతో తమకు కావాల్సిన రాజు ఇతనే అని ఫిక్స్ అయిన కిశోర్ అండ్ గ్యాంగ్ రాజుతో డీల్ మాట్లాడతారు. నెల నెల జీతంలో పాటు తన బాక్సింగ్ ప్రాక్టీస్కు కావాల్సిన ఖర్చులన్ని తామే బరిస్తామని రాజును ఒప్పిస్తారు. అదే సమయంలో సిరి (లతా హెగ్డే)తో ప్రేమలో పడతాడు రాజు. బాక్సింగ్ ప్రాక్టీస్ చేయకుండా సిరి వెంట పడుతూ ఆమె ప్రేమను గెలుచుకుంటాడు.

 

బాక్సింగ్ ప్రాక్టీస్ సమయంలో కిశోర్ బ్యాచ్కు పెద్ద షాక్ తలుగుతుంది. ఇప్పటికే  చాలా సార్లు చాంపియన్ షిప్ సాధించిన టాప్ బాక్సర్ పేరు కూడా రాజు(కబీర్ దుహన్ సింగ్) అని, అతని తండ్రి పేరు కూడా ఆనందరావు అని, అతను కూడా బిఎస్ఎన్ఎల్లోనే ఉద్యోగం చేస్తున్నాడని తెలుస్తుంది. దీంతో ఈ సారి టోర్నమెంట్లో గెలవబోయేది ఆ రాజేనేమో అన్న అనుమానం కలుగుతుంది. మరి చివరకు టోర్నమెంట్లో ఏ రాజు గెలిచాడు..? లోకల్ రాజు బాక్సర్ కాదని తెలిసిన సిరి అతడి ప్రేమను అంగీకరించిందా..? అసలు కిశోర్ ఫ్రెండ్స్కు తెలిసిన భవిష్యత్తు నిజమేనా..? అన్నది తెర మీద చూసి తెలుసుకోవాల్సిందే.

cinima-reviews
తుంటరి

టాలీవుడ్ లో అందరి కన్నా స్పీడుగా దూసుకెళుతున్న హీరో నారా రోహిత్. ప్రస్తుతం ఏ హీరో కూడా నారా రోహిత్ అన్ని సినిమాలను ఒప్పుకొని ఉండరు. తనకంటూ ప్రత్యేక స్థానాన్ని, గుర్తింపును తెచ్చుకున్న నారా రోహిత్ కు తుంటరి సినిమా ఎంతో కీలకమైంది. కాగా తుంటరి అనే రీమేక్ సినిమాతో ప్రేక్షకుల ముందు వచ్చాడు నారా రోహిత్. గుండెల్లో గోదారి, జోరు లాంటి సినిమాలతో ఆకట్టుకున్నా, సక్సెస్ సాధించలేకపోయిన దర్శకుడు కుమార్ నాగేంద్ర ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ సాధించాలని భావిస్తున్నాడు. తమిళంలో స్టార్ డైరెక్టర్ మురుగదాస్ కథతో మాన్ కరాటే పేరుతో తెరకెక్కి ఘనవిజయం సాధించిన సినిమాకు రీమేక్గా సినిమాను తెరకెక్కించారు. తుంటరిగా ఆడియన్స్ ముందుకు వచ్చిన నారా రోహిత్ కమర్షియల్ హీరోగా ప్రూవ్ చేసుకున్నాడా..? కుమార్ నాగేంద్ర తుంటరితో సక్సెస్ సాధించాడా...? చూడండి.

నటీనటులు :
ఇప్పటి వరకు డీసెంట్ పాత్రల్లోనే మెప్పించిన నారా రోహిత్ తొలిసారిగా లోకల్ రాజు పాత్రలో మాస్ క్యారెక్టర్ను ట్రై చేశాడు. ముఖ్యంగా కామెడీ టైమింగ్తో ఆకట్టుకున్న రోహిత్, తనకు బాగా పట్టున్న ఎమోషనల్ సీన్స్లోనూ మెప్పించాడు. డ్రెస్సింగ్, బాడీ లాంగ్వేజ్ విషయంలోనూ స్పెషల్ కేర్ తీసుకొని కొత్తగా కనిపించే ప్రయత్నం చేశాడు. హీరోయిన్గా పరిచయం అయిన లతా హెగ్డే ఉన్నంతలో మెప్పించింది. గ్లామర్తో పాటు క్లైమాక్స్లో వచ్చే ఎమోషనల్ సీన్స్లోనూ మంచి నటన కనబరిచింది. రాజును ఎలాగైనా బాక్సింగ్ మ్యాచ్ గెలిపించాలని ఫిక్స్ అయిన ఫ్రెండ్స్గా వెన్నెల కిశోర్, ఆనంద్, సుదర్శన్, కల్కి, పూజితాలు తమ పరిది మేరకు ఆకట్టుకున్నారు. కబీర్ దుహన్ సింగ్ విలన్ పాత్రకు పర్ఫెక్ట్గా సూట్ అయ్యాడు. హీరో ఫ్రెండ్గా షకలక శంకర్ కామెడీ బాగుంది. బాక్సింగ్ రిఫరీగా ఆలీ కామెడీ బాగుంది. ఇక సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. పర్ ఫెక్ట్ స్టోరీ స్ర్కీన్ ప్లేతో సాగిన నారా రోహిత్ కామెడి టైమింగ్ బాగుంది.

మైనస్ పాయింట్స్
నారా రోహిత్ క్యారెక్టర్ పరంగా లావుగా ఉండాల్సి ఉన్నా కానీ రొమాన్స్ చేసే టైంలో మాత్రం చాలా లావుగా అనిపించాడు. నారా రోహిత్ యాక్టింగ్ బాగున్నా కానీ సూట్ కాని డైలాగులు ప్రేక్షకులకు పెద్దగా నచ్చడం లేదు.

సాంకేతిక నిపుణులు :
తమిళ సినిమాకు రీమేక్ అయినా.. ఎక్కడా ఆ ఛాయలు లేకుండా జాగ్రత్త పడ్డాడు దర్శకుడు కుమార్ నాగేంద్ర. ముఖ్యంగా క్రీడా నేపథ్యం ఉన్న కథ కావటంతో నేటివిటి సమస్య పెద్దగా కనిపించలేదు. హీరో క్యారెక్టరైజేషన్లో కొత్తదనంతో ఆకట్టుకున్నాడు. రోహిత్లోని కామెడీ యాంగిల్ను ఆడియన్స్కు పరిచయం చేయటంలో మంచి విజయం సాధించాడు. ఒరిజినల్ సినిమాలా రెండున్నర గంటల పాటు సినిమాను సాగదీయకుండా, రెండు గంటలకు తగ్గించి దర్శకుడు మంచి నిర్ణయం తీసుకున్నాడు.  సాయి కార్తీక్ సంగీతం బాగుంది. పాటలతో పర్వాలేదనిపించిన కార్తీక్ నేపథ్య సంగీతంతో ఆకట్టుకున్నాడు. ప్రతీసీన్ను తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్తో మరింత ఎలివేట్ చేశాడు. పలనీ కుమార్ సినిమాటోగ్రఫి, మధు ఎడిటింగ్ బాగున్నాయి.

చివరగా... నారా రోహిత్ తుంటరి