Kalyana Vaibhogame | Naga shaurya | Kalyana Vaibhogame Review | Malavika Nair

Teluguwishesh కళ్యాణ వైభోగమే కళ్యాణ వైభోగమే Get The Complete Details of Kalyana Vaibhogame Telugu Movie Review. The Latest Telugu Movie Kalyana Vaibhogame featuring Naga Shourya and Malavika Nair exclusively on Madhura Audio. Music composed by Kalyan Koduri. Directed by BV Nandini Reddy and produced by KL Damoodar Reddy. For More Details Visit Teluguwishesh.com Product #: 72851 3.25 stars, based on 1 reviews
  • చిత్రం  :

    కళ్యాణ వైభోగమే

  • బ్యానర్  :

    శ్రీరంజిత్ మూవీస్

  • దర్శకుడు  :

    బి.వి.నందిని రెడ్డి

  • నిర్మాత  :

    కె.ఎల్.దామోదర్ ప్రసాద్

  • సంగీతం  :

    కళ్యాణ్ కోడూరి

  • సినిమా రేటింగ్  :

    3.253.253.25  3.25

  • ఛాయాగ్రహణం  :

    జి.వి.ఎస్. రాజు

  • ఎడిటర్  :

    జునైద్ సిద్దిక్

  • నటినటులు  :

    నాగ శౌర్య, మాళవిక నాయర్, రాశి, ఐశ్వర్య, ఆనంద్, రాజ్ మదిరాజ్, తాగుబోతు రమేష్, ధనరాజ్, 'మిర్చి' హేమంత్, స్నిగ్ధ తదితరులు.

Kalyana Vaibhogame Review

విడుదల తేది :

2016-03-04

Cinema Story

హ్యాపీగా లైఫ్ ను ఎంజాయ్ చేస్తూ వుండే కుర్రాడు శౌర్య(నాగశౌర్య). USA వెళ్లాలనే ఆలోచనలో వుంటాడు. ఇక మెడికో టాపర్, డాక్టర్ దివ్య(మాళవిక నాయర్). రాశి, ఆనంద్ ల ముద్దుల కూతురు. శౌర్య, దివ్యలకు త్వరగా పెళ్లి చేసుకోవాలని కాకుండా.. లైఫ్ ను ఎంజాయ్ చేస్తూ, తమ ఆశయాలను నెరవేర్చుకోవాలని అనుకుంటారు. కానీ ఇరు కుటుంబాల వలన వీరిద్దరికి పెళ్లి జరుగుతుంది. ఎలాగో పెళ్లి అయ్యింది కాబట్టి ఒకే ఫ్లాట్ లో కాపురం పెడతారు. అసలే పెళ్లంటే ఇష్టంలేని వీరిద్దరూ ఇరుకుటుంబ పెద్దలకు తెలియకుండా సీక్రెట్ గా విడాకులకు అప్లై చేస్తారు. ఒకే ఫ్లాట్ లో వుంటున్న వీరిద్దరూ మంచి స్నేహితులుగా మారి.. ఆ తర్వాత వీరి స్నేహం ప్రేమగా మారుతుంది. దీంతో విడాకులను క్యాన్సిల్ చేసుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఈ కథ అంతా కూడా ఎలా జరిగింది అనే కథాంశాన్ని వెండితెర మీద చూస్తే బాగుంటుంది.

cinima-reviews
కళ్యాణ వైభోగమే

నాగ శౌర్య , మాళవిక నాయర్ జంటగా నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘కళ్యాణ వైభోగమే’. శ్రీరంజిత్ మూవీస్ బ్యానర్ పై కె.ఎల్.దామోదర్ ప్రసాద్ నిర్మించారు. కళ్యాణ్ కోడూరి సంగీతం అందించిన పాటలు ఇప్పటికే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. అలాగే ట్రైలర్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘అలా మొదలైంది’, ‘జబర్దస్త్’ చిత్రాల తర్వాత నందిని రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ ‘కళ్యాణ వైభోగమే’ చిత్రంపై ఇప్పటికే పాజిటివ్ టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా నేడు(మార్చి 4) ప్రపంచ వ్యాప్తంగా, గ్రాండ్ గా విడుదలయ్యింది. మరి ఈ సినిమా ఎలా వుందో, నందినిరెడ్డికి ఎలాంటి విజయం అందించనుందో ఒకసారి చూద్దామా!

ప్లస్ పాయింట్స్:
శౌర్య పాత్రలో నాగశౌర్య చాలా చక్కగా నటించాడు. ఇప్పుడున్న యూత్ నిర్ణయాలు, ఆలోచనలు, ఎంజాయ్ చేసే మనస్తత్వం వంటి అంశాలను నాగశౌర్య చాలా చక్కగా కనబరిచాడు. ఇక పెళ్లంటే ఇష్టంలేని అమ్మాయిగా మాళవిక చక్కని ప్రతిభ చూపింది. తన హవాభావాలు, అమాయకత్వం, డైలాగ్ డెలివరీ చాలా బాగున్నాయి. తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. నాగశౌర్య-మాళవికల మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా వర్కౌట్ అయ్యింది. వీరిద్దరి మధ్య వచ్చే సీన్లు చాలా బాగున్నాయి. సినిమా మొత్తం వీరిద్దరే నడిపించేసారు.

ఇక చాలా కాలం గ్యాప్ తర్వాత మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రాశి, అలాగే ఐశ్వర్య, ఆనంద్, రాజ్ తల్లితండ్రులుగా వారి పాత్రలలో చక్కగా నటించారు. ఇక మాళవిక-రాశిల మధ్య సీన్లు బాగున్నాయి. తాగుబోతు రమేష్, ధనరాజ్, 'మిర్చి' హేమంత్, స్నిగ్ధ తదితరులు వారి వారి పాత్రల మేరకు న్యాయం చేసారు.

ఇక సినిమా విషయానికొస్తే.... ఈ సినిమా స్టోరీలైన్ దర్శకురాలు నందినిరెడ్డి ముందుగానే చెప్పేసింది. పెళ్లంటే ఇష్టంలేని ఇద్దరు వ్యక్తులకు పెళ్లయితే... పెళ్లయ్యాక ప్రేమలో పడితే ఎలా వుంటుంది? తర్వాత ఏం జరుగుతుంది అనే కథాంశంతోనే రూపొందింది ‘కళ్యాణ వైభోగమే’. ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా సరదాగా, ఎంటర్ టైన్మెంట్ తో పెళ్లి సందడితో సాగుతుంది. ఇప్పుడు అసలే పెళ్లిళ్ల సీజన్ కాబట్టి... ఇక చూసే ప్రేక్షకులు సైతం ఇందులోని పెళ్లి సందడి, సరదాలను బాగా ఎంజాయ్ చేస్తుంటారు. సెకండ్ హాఫ్ లో స్నేహం, అర్థం చేసుకోవడం, లవ్, రొమాంటిక్, కేరింగ్ వంటి పలు అంశాలను చూపించారు. కాకపోతే సెకండ్ హాఫ్ లో కాస్త కామెడీ తగ్గినట్లుగా అనిపిస్తుంది. నటీనటులపరంగా సినిమాకు అందరూ ప్లస్ అయ్యారు. స్టోరీ లైన్ కాస్త సింపుల్ గానే అనిపించినా... స్ర్కీన్ ప్లే బాగుంది. మొత్తానికి ‘కళ్యాణ వైభోగమే’ చిత్రం ఇప్పుడున్నా యూత్ అందరూ చూడాల్సిన చిత్రం. అలాగే పెళ్లి అంటే కుటుంబ సభ్యులు కూడా వుంటారు కాబట్టి... కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం ‘కళ్యాణ వైభోగమే’.

మైనస్ పాయింట్స్:
‘కళ్యాణ వైభోగమే’ చిత్రంలో చెప్పుకోవడానికి పెద్దగా మైనస్ పాయింట్స్ అంటూ ఏమి లేవు. అయితే స్టోరిలైన్ సింపుల్ గా అనిపిస్తుంది. కథలో ఎక్కడా కూడా అంతగా ట్విస్టులు లేవు. ఎలాంటి ట్విస్టులు లేకుండా సింపుల్ గా కొనసాగుతుంది. ఇక హీరో శౌర్య తనకు పెళ్లి ఎందుకు వద్దని అంటున్నాడో బలమైన కారణం చూపించలేకపోయారు. సెకండ్ హాఫ్ లో తాగుబోతు రమేష్ పాత్ర ‘అలా మొదలైంది’ సినిమా కంటిన్యూటి కోసం ఇందులో కూడా తీసుకున్నట్లుగా అనిపిస్తుంది. దాదాపు ఓ 15 నిమిషాలు ఎడిటింగ్ చేసి వుంటే,.. సినిమా రన్ టైం పెరిగి వుండేది.

సాంకేతికవర్గం పనితీరు:
‘కళ్యాణ వైభోగమే’ చిత్రానికి నటీనటులు ఎంత పర్ఫెక్ట్ గా కుదిరారో.. సాంకేతికనిపుణులు కూడా అంతే అద్భుతంగా సెట్ అయ్యారు. ముందుగా సినిమాటోగ్రఫి నుంచి చెప్పుకుందాం. సత్యనారాయణ రాజు అందించిన సినిమాటోగ్రఫి చాలా బాగుంది. విజువల్స్ పరంగా సినిమాను చాలా గ్రాండియర్ గా చూపించారు. కొన్ని కొన్ని సీన్లలో సినిమాటోగ్రఫి అద్భుతంగా వుంది. కళ్యాణ్ కోడూరి సంగీతం సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. పాటలు విజువల్స్ పరంగా చాలా బాగున్నాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు బాగా హెల్ప్ అయ్యింది. ఈ సినిమాకు లక్ష్మీ భూపాల్ పాటలు, మాటలను అందించారు. సాహిత్యం పరంగా పాటలకు ఇప్పటికే భారీ ప్రశంసలు వచ్చాయి. చాలా రోజుల తర్వాత మంచి సాహిత్యం వున్న పాటలను ‘కళ్యాణ వైభోగమే’ చిత్రంలో చూడవచ్చు. అలాగే మాటలు చాలా బాగున్నాయి. ఏదో పంచ్ డైలాగులు, ప్రాసలు అనే విధంగా కాకుండా... నిజజీవితంలో మాట్లాడుకునే మాటలు, సంభాషణల మాదిరిగానే చాలా బాగున్నాయి. ఎడిటింగ్ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుని వుంటే బాగుండేది. సెకండ్ హాఫ్ లో కాస్త ఎడిటింగ్ చేసి వుంటే బాగుండేది.

‘అలా మొదలైంది’ తర్వాత మళ్లీ తాను అనుకున్న కథతో ముందుకొచ్చిన దర్శకురాలు నందినిరెడ్డి... ‘కళ్యాణ వైభోగమే’ చిత్రంతో హిట్టుకొట్టిందని చెప్పుకోవచ్చు. సింపుల్ స్టోరీలైన్ ను ఎంపిక చేసుకున్నప్పటికీ.. స్ర్కీన్ ప్లే పరంగా చాలా బాగా ప్రజెంట్ చేయగలిగారు. లవ్, ఎమోషన్స్, ఫీలింగ్స్, రొమాంటిక్, యూత్ ఎంజాయ్ వంటి పలు సీన్లను చక్కగా ప్రజెంట్ చేసింది. నటీనటులు, సాంకేతికనిపుణుల నుంచి మంచి ఔట్ పుట్ ను రాబట్టుకుంది. తాను అనుకున్న కథను స్ర్కీన్ పైన చూపించడంలో సక్సెస్ అయ్యింది. కానీ కొన్ని కొన్ని అనవసరపు సీన్లను కట్ చేసి వుంటే బాగుండేది. కె.ఎల్.దామోదర్ ప్రసాద్ నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. సినిమాను చాలా గ్రాండ్ గా నిర్మించారు.

చివరగా:
‘కళ్యాణ వైభోగమే’: కుటుంబంతో కలిసి చూడదగ్గ చిత్రం.

- Sandy