Padesave | Chuniya | Padesave Review | Nithya Shetty

Teluguwishesh పడేసావే పడేసావే Get The Complete Details of Padesave Telugu Movie Review. The Latest Telugu Movie Padesave featuring Karthik Raju, Nithya Shetty & Sam among others. directed by Chuniya. produced by Ayan Creations banner. music by Anup Runbens. For More Details Visit Cinewishesh.com Product #: 72674 2 stars, based on 1 reviews
  • చిత్రం  :

    పడేసావే

  • బ్యానర్  :

    అయాన్ క్రియేష‌న్స్

  • దర్శకుడు  :

    చునియా

  • నిర్మాత  :

    సబీహా సుల్తానా

  • సంగీతం  :

    అనూప్ రూబెన్స్

  • సినిమా రేటింగ్  :

    22  2

  • ఛాయాగ్రహణం  :

    కన్నా కునపరెడ్డి

  • ఎడిటర్  :

    ధర్మేంద్ర.కె

  • నటినటులు  :

    కార్తీక్ రాజు, నిత్యాశెట్టి, శామ్ తదితరులు

Padesave Movie Review

విడుదల తేది :

2016-02-26

Cinema Story

కార్తీక్(కార్తీక్), నిహారిక(నిత్యాశెట్టి) చిన్ననాటి స్నేహితులు. కార్తీక్ ను నిహారిక లవ్ చేస్తుంటుంది. వీరి కథ నడుస్తుండగానే నిహారిక స్నేహితురాలు స్వాతి(సాన్) ఎంట్రీ ఇస్తుంది. స్వాతితో కార్తీక్ ప్రేమలో పడతాడు. కానీ అప్పటికే స్వాతికి రాహుల్(కిరణ్)తో నిశ్చితార్థం అయ్యి వుంటుంది. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ఆ తర్వాత ఏం జరిగింది? ఎవరు ప్రేమలో గెలిచారు? ఎవరి ప్రేమ ఎవరికి సొంతం అయ్యింది? కార్తీక్ ఎవరి సొంతం అయ్యాడు? నిహారిక, స్వాతిలలో ఎవరు త్యాగం చేసారు? అనే విషయాలను వెండితెర మీద చూసి తెలుసుకోవాల్సిందే.

cinima-reviews
పడేసావే

అక్కినేని నాగార్జున ప్రోత్సాహంతో అయాన్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై చునియా ద‌ర్శక‌త్వంలో కార్తీక్ రాజు, నిత్యాశెట్టి, శామ్ హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘ప‌డేసావే’. సెన్సార్ సహా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ చిత్రం ఈ ఫిబ్రవరి 26న విడుదలవుతుంది. అనూప్ రూబెన్స్ అందించిన పాటలు ఇటీవలే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వస్తోంది. యూత్ ఫుల్, లవ్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రం నేడు(ఫిబ్రవరి 26) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దర్శకురాలిగా చునియాకు ఇదే తొలిచిత్రం. మరి ఈ సినిమాతో చునియా ఎలాంటి విజయం సాధించనుందో చూడాలి.

ప్లస్ పాయింట్స్:
హీరోగా కార్తీ నటన పర్వాలేదు. కానీ హావభావాల విషయంలో మరింత మెరుగుపరుచుకుంటే బాగుండేది. ఇక హీరోయిన్ నిత్యాశెట్టి యాక్టింగ్ బాగుంది. క్యూట్ స్మైల్ తో ఆకట్టుకుంది. తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. ఇక మరో హీరోయిన్ జహీద శ్యాం తన పాత్రకు పర్వాలేదనిపించింది. ఎమోషన్ సీన్లలో బాగా చేసింది. రాశి రెండు, మూడు సీన్లతో ఆకట్టుకుంది. నరేష్, అనిత చౌదరిలు కాసేపు నవ్వించే ప్రయత్నం చేసారు. విశ్వ-కార్తీక్ ల సీన్లు బాగున్నాయి.

మైనస్ పాయింట్స్:
ఇలాంటి స్టోరీలతో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయి. కథ, కథనం విషయంలో ఎలాంటి కొత్తదనం లేదు. ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనగానే దాదాపు సినిమా స్టోరీ ఏంటో సామాన్య ప్రేక్షకుడు సైతం ఊహించేయగలడు. కానీ ఊహించనిరీతిలో కొత్తదనంతో కూడిన ట్విస్టులేమి లేవు. దీంతో ప్రేక్షకులకు చాలా బోర్ కలుగుతుంది. హీరోహీరోయిన్ల పర్ఫార్మెన్స్ కూడా అంతగా కనెక్ట్ అవ్వలేదు. వీటికి తోడు సినిమా మొదటి నుంచి చివరి వరకు చాలా స్లోగా సాగుతుంది. ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా, బోర్ కొట్టినప్పటికీ.. సెకండ్ హాఫ్ మరింత స్లోగా కొనసాగుతుంది. కామెడీ సన్నివేశాలను కావాలనే ఇరికించి పెట్టినట్లుగా అనిపిస్తుంది. మొత్తానికి సినిమా అంతా బోర్ అనిపిస్తుంది.

సాంకేతికవర్గం పనితీరు:
కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం విభాగాలను డీల్ చేసిన చునియా... నిరాశ పరిచిందనే చెప్పుకోవాలి. కథలో ఎలాంటి కొత్తదనం లేదు. కనీసం స్ర్కీన్ ప్లే విషయంలోనైనా సరైన జాగ్రత్తలు తీసుకుని వుంటే బాగుండేది. నటీనటుల నుంచి సరైన ప్రతిభను రాబట్టడంలో కూడా ఫెయిల్ అయ్యిందని చెప్పుకోవచ్చు. కన్నా అందించిన సినిమాటోగ్రఫి సూపర్బ్. విజువల్స్ పరంగా బాగున్నాయి. అనూప్ సంగీతం సినిమాకు హెల్ప్ అయ్యింది. పాటలు పర్వాలేదనిపించినా... బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగా సెట్ అయ్యింది. ఎడిటింగ్ బాలేదు. డైలాగ్స్ పర్వాలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. సినిమా చాలా గ్రాండ్ గా తెరకెక్కించారు.

చివరగా:
‘పడేసావే’: ఆకట్టుకొని రొటీన్ లవ్ స్టోరీ.