Kathakali | Vishal | Kathakali Review | Catherine Tresa

Teluguwishesh కథకళి కథకళి Get The Complete Details of Kathakali Telugu Movie Review. The Latest Telugu Movie Kathakali featuring Vishal and Catherine Tresa. Directed by Pandiraj and music composed by Hip Hop Tamizha. For More Details Visit Teluguwishesh.com Product #: 71979 2.5 stars, based on 1 reviews
  • చిత్రం  :

    కథకళి

  • బ్యానర్  :

    విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ

  • దర్శకుడు  :

    పాండ్యరాజ్

  • నిర్మాత  :

    విశాల్

  • సంగీతం  :

    హిప్ హప్ తమిళ

  • సినిమా రేటింగ్  :

    2.52.5  2.5

  • ఛాయాగ్రహణం  :

    బాలసుబ్రమణ్యం

  • నటినటులు  :

    విశాల్, కెథరిన్ థ్రెసా తదితరులు

Kathakali Telugu Review

విడుదల తేది :

2016-03-18

Cinema Story

అమెరికాలో ఉద్యోగం చేస్తూ ఉండే కమల్ (విశాల్), ప్రేమించిన అమ్మాయి మల్లీశ్వరి (క్యాథరిన్)ని పెళ్ళి చేసుకోవడం కోసం తన సొంత ఊరైన కాకినాడ వస్తాడు. అతడి పెళ్ళికి సంబంధించిన పనులు జరుగుతున్న కాలంలోనే, అదే ఊర్లో ఉండే సాంబ (మధుసూదన రావు) అనే జాలర్ల సంఘం అధ్యక్షుడు హత్యకు గురవుతాడు. కాకినాడలో తానే అన్ని దందాలూ చేయాలనుకునే సాంబకు, కమల్ కుటుంబానికి గతంలో ఓ గొడవ జరిగి ఉండడంతో సాంబ హత్య విషయమై పోలీసులు కమల్‌ని కూడా అనుమానిస్తారు. ఓ చిన్న సంఘటన ఈ అనుమానాన్ని బలపరుస్తుంది. ఇక అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. సాంబను హత్య ఎవరు చేసారు? కమల్ కు ఎదురైన సమస్యలేంటి? కమల్, సాంబ కుటుంబాలకు మధ్య జరిగిన గొడవ ఏంటి? కమల్ పెళ్లి జరిగిందా లేదా? అనే అంశాలను వెండితెర మీద చూడాల్సిందే.

cinima-reviews
కథకళి

తమిళ నటుడు విశాల్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కథకళి’. ప్రముఖ దర్శకుడు పాండ్యరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై విశాల్ స్వీయ నిర్మాణంలో రూపొందింది. ఇందులో విశాల్ సరసన కెథరిన్ థ్రెసా హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్లు, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదల చేస్తున్నారు. తెలుగులో మార్చి 18న విడుదల చేస్తున్నారు. మరి తెలుగులో ఎలాంటి విజయం సాధించనుందో చూడాలి.

ప్లస్ పాయింట్స్:
విశాల్, క్యాథెరిన నటన
విలన్ యాక్టింగ్
ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ట్విస్ట్
స్క్రీన్ ప్లే

మైనస్ పాయింట్స్:
కథ
హీరోహీరోయిన్ల లవ్ ట్రాక్
పాటలు

సాంకేతికవర్గం పనితీరు:
సింపుల్ స్టోరిని చాలా చక్కగా తీర్చిదిద్దారు పాండిరాజ్. స్ర్కీన్ ప్లే పరంగా చాలా జాగ్రత్తలు తీసుకొని, అద్భుతంగా తెరకెక్కించారు. కానీ లవ్ ట్రాక్, కొన్ని కొన్ని సీన్లలో మరింత కేర్ తీసుకొని వుంటే సినిమా అదిరిపోయేది. దర్శకుడిగా పాండిరాజ్ సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. ఇక హిపాప్ థమిజా పాటలు పర్వాలేదు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. బాలసుబ్రమణ్యం సినిమాటోగ్రఫి బాగుంది. రాత్రి ఎపిసోడ్ లలో సీన్లను బాగా చూపించారు. ఎడిటింగ్ పర్వాలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

చివరగా:
‘కథాకళి’: పర్వాలేదనిపించే థ్రిల్లర్.