Nannaku Prematho | Jr NTR | Nannaku Prematho Review | Rakul Preet Singh

Teluguwishesh నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో Get The Complete Details of Nannaku Prematho Telugu Movie Review. The Latest Telugu Movie Nannaku Prematho featuring Jr NTR, Rakul Preet Singh, Rajendra Prasad and Jagapati Babu directed by Sukumar. For More Details Visit Teluguwishesh.com Product #: 71779 3 stars, based on 1 reviews
  • చిత్రం  :

    నాన్నకు ప్రేమతో

  • బ్యానర్  :

    శ్రీవెంకటేశ్వర సినీచిత్ర

  • దర్శకుడు  :

    సుకుమార్

  • నిర్మాత  :

    బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్

  • సంగీతం  :

    దేవిశ్రీప్రసాద్

  • సినిమా రేటింగ్  :

    333  3

  • ఛాయాగ్రహణం  :

    విజయ్‌ చక్రవర్తి

  • ఎడిటర్  :

    నవీన్‌ నూలి

  • నటినటులు  :

    ఎన్టీఆర్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, రాజీవ్‌ కనకాల, అవసరాల శ్రీనివాస్‌ తదితరులు

Nannaku Prematho Movie Review

విడుదల తేది :

2016-01-13

Cinema Story

స్పెయిన్ లో జాబ్ చేసుకుంటున్న అభిరామ్(ఎన్టీఆర్)కు ఓరోజు తన తండ్రి రమేష్ చంద్రప్రసాద్ అలియాస్ సుబ్రమణ్యం (రాజేంద్ర ప్రసాద్) ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్లో చేరాడనే వార్త తెలియడంతో వెంటనే ఇండియాకు వస్తాడు. తన తండ్రికి ఇలాంటి పరిస్థితి ఏర్పడటానికి గల కారణం లండన్ లో వున్న పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కృష్ణమూర్తి(జగపతిబాబు) చీట్ చేయడం వల్లనే అని తెలుసుకుంటాడు అభిరామ్. కృష్ణమూర్తిపై ఎలాగైనా పగతీర్చుకోవాలన్నదే తన కోరికని కొడుకుకు చెబుతాడు సుబ్రమణ్యం. దీంతో తండ్రి కోరిక నేరవేర్చేందుకు లండన్ వెళ్లిన అభిరామ్ కు కృష్ణమూర్తి కూతురు దివ్య పరిచయమవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు కృష్ణమూర్తి వల్ల సుబ్రమణ్యానికి ఏం నష్టం వచ్చింది? కృష్ణమూర్తిపై అభిరామ్ పగ ఎలా తీర్చుకున్నాడు? అనే ఆసక్తికర అంశాలను వెండితెరపై చూడాల్సిందే.

cinima-reviews
నాన్నకు ప్రేమతో

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘నాన్నకు ప్రేమతో..’. రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీచిత్ర బ్యానర్ పై నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్లు, వీడియోలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఎన్టీఆర్‌ సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటించింది. ఇందులో జగపతి బాబు, రాజేంద్రప్రసాద్ లు ముఖ్య పాత్రలలో నటించారు. స్టైలిష్ విలన్ గా జగపతి బాబు తన నటనతో అదరగొట్టనున్నాడు. కమర్షియల్ ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని జనవరి 13న సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలయ్యింది. మరి ఈ సినిమా ఎలా వుందో, ఎలాంటి విజయం సాధించనుందో ఒకసారి చూద్దామా!

ప్లస్ పాయింట్స్:
ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు జగపతిబాబు. వీరిద్దరి నటన సినిమాకు ప్రాణం పోసిందని చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్ ఈ సినిమాలో చాలా స్టైలిష్ గా కనిపించాడు. తన గత చిత్రాల కంటే నటనలో చాలా మెచ్యురిటీ కనబరిచాడు. సినిమా మొత్తానికి కూడా తన భుజాలపై నడిపించాడు. యాక్టింగ్, డాన్స్, ఎమోషన్స్, లవ్, రివేంజ్ సీన్లలో అదరగొట్టాడు. తండ్రి కోరికను తీర్చే కొడుకు పాత్రలో ఎన్టీఆర్ పూర్తిగా లీనమై నటించాడు. ముఖ్యంగా ఎమోషన్ సీన్లలో తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసాడు.

ఇక స్టైలిష్ క్రూయల్ విలన్ గా జగపతిబాబు యాక్టింగ్ సూపర్బ్. ఈ పాత్రలో జగపతిని తప్ప మరెవరూ నటించిన కూడా బాగుండదు అనిపించే విధంగా జగ్గుబాయ్ అద్భుతంగా నటించాడు. స్టైలిష్ గా వ్యవహరిస్తూనే, క్రూయల్ మైండెడ్ విలన్ గా అదరగొట్టాడు. ముఖ్యంగా ఎన్టీఆర్-జగపతిబాబుల యాక్టింగ్, మైండ్ గేమ్స్ సూపర్బ్. ఇక ఎన్టీఆర్ తండ్రి పాత్రలో నటించిన రాజేంద్రప్రసాద్ పాత్ర కాసేపే అయినప్పటికీ... చాలా ఎమోషనల్ గా సాగుతుంది. తన పాత్ర మేరకు బాగానే నటించాడు. ఇక హీరోయిన్ గా నటించిన రకూల్ ప్రీత్ సింగ్ యాక్టింగ్ బాగుంది. గ్లామరస్ లుక్స్ తో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక రాజీవ్ కనకాల, అవసరాల శ్రీనివాస్, సితార, తాగుబోతు రమేష్ తదితరులు వారి వారి పాత్రలకు పూర్తి న్యాయం చేసారు.

‘నాన్నకు ప్రేమతో’ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా తండ్రీ కొడుకుల మధ్య సాగే ఎమోషనల్ సీన్లు, హీరోయిన్ ను ప్రేమలో దించే సీన్స్, ఇంట్రెస్టింగ్ ఇంటర్వెల్ బ్యాంగ్ తో అసలు స్టోరీ రివీల్ చేసి అదరగొట్టేసింది. సెకండ్ హాఫ్ లో కృష్ణమూర్తిని నాశనం చేసేందుకు అభిరామ్ ఆడే మైండ్ గేమ్, ట్విస్టులు చాలా బాగున్నాయి. అలాగే ఎమోషనల్ సెంటిమెంట్ సీన్లతో ఆకట్టుకుంది.

మైనస్ పాయింట్స్:
‘నాన్నకు ప్రేమతో’ సినిమాకు ఎమోషనల్ సీన్లే కాస్త మైనస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. స్లో నెరేషన్ తో ప్రేక్షకులకు కాస్త బోర్ గా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా తండ్రీ కొడుకుల మధ్య ఎమోషన్ సీన్లు, సెకండ్ హాఫ్ లో కూడా చాలా వరకు ఎమోషనల్ సీన్లతో చంపేసాడు. ఫ్యామిలీ ఆడియెన్స్ బాగా కనెక్ట్ అవుతారు కానీ.. మాస్, ఎంటర్ టైన్మెంట్ కోరుకునే ప్రేక్షకులు మాత్రం బోర్ ఫీలవుతారు. ఇక ఫస్ట్ హాఫ్ మొదలైన కొద్దిసేపటికే సినిమా స్టోరీ ఎలా వుండబోతుందో అర్థమవుతోంది. సెకండ్ హాఫ్ లో ట్విస్టులతో నడిపించినప్పటికీ.. కాస్త సాగదీసినట్లుగా అనిపిస్తుంది.

సాంకేతికవర్గం పనితీరు:
‘నాన్నకు ప్రేమతో’ టెక్నికల్ టీం చాలా హెల్ప్ అయ్యిందని చెప్పుకోవచ్చు. ముందుగా ‘నాన్నకు ప్రేమతో’ చిత్రానికి విజయ్ సి.చక్రవర్తి సినిమాటోగ్రఫి సూపర్బ్. ప్రతి సీన్ కూడా విజువల్ వండర్ లా చూపించారు. విజువల్స్ పరంగా ప్రతి సీన్ ను చాలా అద్భుతంగా చూపించారు. ఇక దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన పాటలు బాగున్నాయి. విజువల్స్ పరంగా ఇంకా చాలా బాగున్నాయి. అలాగే తన తండ్రికి అంకితం ఇస్తూ దేవి ఇందులో పొందుపరిచిన మరో పాట చాలా ఎమోషనల్ ఫీల్ ను కలిగిస్తుంది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ఎడిటింగ్ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది.

ఇక దర్శకుడిగా సుకుమార్ అదరగొట్టేసాడు. కథ పాతదే అయినప్పటికీ.. స్ర్కీన్ ప్లే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. సినిమాను తను అనుకున్న విధంగా ప్రజెంట్ చేసి, ఆ ఎమోషన్ ను సినిమా పూర్తయ్యే వరకు కంటిన్యూ చేయించాడు. సినిమాను ఎమోషనల్ గా చూపించడమే కాకుండా నటీనటులను చాలా స్టైలిష్ గా చూపించడం, వారి దగ్గరనుంచి తనకు కావలసిన యాక్టింగ్ ను రాబట్టుకోవడంలో సుకుమార్ ఫుల్ సక్సెస్ అయ్యాడు. ఇక నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణ విలువలు చాలా రిచ్ గా వున్నాయి. సినిమా అంతా కూడా చాలా గ్రాండ్ గా వుంది.

చివరగా:
‘నాన్నకు ప్రేమతో’: ఎమోషనల్ రివేంజ్ డ్రామా