Size Zero Telugu Movie Review | Size Zero Movie Rating | Anushka Size Zero Movie Review

Teluguwishesh సైజ్ జీరో సైజ్ జీరో Get information about Size Zero Telugu Movie Review, Anushka Size Zero Movie Review, Size Zero Movie Review and Rating, Size Zero Videos, Trailers and Story and many more on Teluguwishesh.com Product #: 70569 3.5 stars, based on 1 reviews
  • చిత్రం  :

    సైజ్ జీరో

  • బ్యానర్  :

    పివిపి

  • దర్శకుడు  :

    ప్రకాష్‌ కోవెలమూడి

  • నిర్మాత  :

    పరమ్‌ వి.పొట్లూరి

  • సంగీతం  :

    యం.యం.కీరవాణి

  • సినిమా రేటింగ్  :

    3.53.53.5  3.5

  • ఛాయాగ్రహణం  :

    నిరవ్‌షా

  • ఎడిటర్  :

    ప్రవీణ్‌ పూడి

  • నటినటులు  :

    అనుష్క, ఆర్య, ఊర్వశి, సోనాల్‌ చౌహాన్‌, ప్రకాష్‌ రాజ్‌, ఊర్వశి తదితరులు

Size Zero Movie Review

విడుదల తేది :

2015-11-27

Cinema Story

భారీ బరువు గల అమ్మాయి స్వీటీ(అనుష్క) ఓ రెస్టారెంట్ లో పనిచేస్తూ వుంటుంది. స్వీటీ కోసం తన తల్లి(ఊర్వశి) పెళ్లి సంబంధాలను తీసుకొస్తుంది. కానీ స్వీటీని పెళ్లి చేసుకోనని అందరూ రిజెక్ట్ చేస్తుంటారు. అనుకోకుండా స్వీటీని పెళ్లి చూపులు చూడటానికి అభి(ఆర్య) వస్తాడు. కానీ ప్రతిసారి అబ్బాయిలే రిజెక్ట్ చేస్తున్నారని, ఈసారి తానే అబ్బాయిలను రిజెక్ట్ చేస్తానని అభిని రిజెక్ట్ చేస్తుంది స్వీటి. ఆ తర్వాత స్వీటీ-అభిలు మంచి స్నేహితులుగా కొనసాగుతారు. సీన్ కట్ చేస్తే... స్వీటికి పెళ్లి సంబంధాలు రావట్లేదని, ఇందుకు తన బరువే కారణమని భావించి, స్వీటిని ‘సైజ్ జీరో’ వెయిట్ లాస్ సెంటర్ లో చేర్చుతుంది. ‘సైజ్ జీరో’ వెయిట్ లాస్ సెంటర్ లో చేరిన తర్వాత ఏం జరిగింది? స్వీటీ సన్నబడిందా లేదా? అసలు వెయిట్ లాస్ కోసం స్వీటీ ఏం చేసింది? సైజ్ జీరో సెంటర్ తో స్వీటీకి వచ్చిన విభేదాలు ఏంటి? చివరకు స్వీటీ-అభిలు పెళ్లి చేసుకున్నారా లేక స్నేహితులుగానే కొనసాగారా? ఇంతకీ సిమ్రాన్ ఎవరు? ఈ విషయాలన్నీ తెలియాలంటే వెండితెర మీద ‘సైజ్ జీరో’ సినిమా చూడాల్సిందే.

cinima-reviews
సైజ్ జీరో

‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల తర్వాత సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ అనుష్క నటించిన తాజా చిత్రం ‘సైజ్ జీరో’. ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ప్రముఖ నిర్మాణ సంస్థ పివిపి బ్యానర్ పై పరమ్‌ వి.పొట్లూరి నిర్మించారు. ఈ సినిమా కోసం ఏ స్టార్ హీరోయిన్ చేయని రిస్క్ అనుష్క చేసింది. ఈ సినిమాలోని పాత్రకోసం తన బరువును భారీగా పెంచేసుకుంది. ఇప్పటికే ఈ సినిమాపై పాజిటివ్ టాక్ వినిపిస్తుంది. ట్రైలర్లు, పాటలకు భారీ రెస్పాన్స్ వస్తోంది. అనుష్క, ఆర్య, ఊర్వశి, సోనాల్‌ చౌహాన్‌, ప్రకాష్‌ రాజ్‌, ఊర్వశి తదితరులు ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా ఈరోజు(నవంబర్ 27) ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళం భాషలలో విడుదలయ్యింది. మరి ఈ సినిమా ఎలా వుందో ఒకసారి చూద్దామా!

ప్లస్ పాయింట్స్:

‘సైజ్ జీరో’కు మేజర్ ప్లస్ పాయింట్ అనుష్క. ఈ పాత్రలో అనుష్కను తప్ప మరే ఇతర హీరోయిన్ ను ఊహించుకోలేము అని అనిపించే విధంగా అద్భుతంగా నటించింది. నటించింది అని అనడం కంటే ఆ పాత్రలో జీవించేసిందని చెప్పడం ఉత్తమం. గ్రాఫిక్స్ వర్క్, టెక్నాలజీ, మేకప్ ఆర్టిస్ట్... ఇలా చాలా విధాలుగా అభివృద్ధి చెందినప్పటికీ.. తన పాత్ర కోసం ఏ విధమైన టెక్నాలజీని వాడకుండా, స్వయంగా బరువు పెరిగిపోయింది. ముఖ్యంగా ఈ పాత్రకోసం అనుష్క తీసుకున్న కేర్ నిజంగా అభినందనీయం. ఇంతటి రిస్క్ తీసుకోవడం గ్రేట్.

ఇక అనుష్క తన పాత్రలో ఒదిగిపోయింది. సినిమా మొత్తాన్ని తన భుజాలపై వేసుకొని నడిపించేసింది. తుంటరితనం, భావోద్వేగాలు, డైటింగ్ కోసం పడే తిప్పలు... ఇలా అన్ని సన్నివేశాలలో కూడా అనుష్క తనదైన మార్కుతో అలరించింది. ఫస్ట్ హాఫ్ లో అంత సరదా సరదాగా కనిపించిన అనుష్క.. సెకండ్ హాఫ్ లో తన యాక్టింగ్ తో అదరగొట్టేసింది. కాస్త లావుగా వుండే ప్రతి ఒక్క అమ్మాయి, మరియు వారి తల్లులు ఈ సినిమాకు బాగా కనెక్ట్ అవుతారు. ముఖ్యంగా అనుష్క పాత్రలో అమ్మాయిలు మాత్రం తప్పకుండా తమని తాము చూసుకుంటారు. బొద్దుగా వున్న అనుష్క కూడా గ్లామర్ గా కనిపించింది. తన భారీ అందాలతో హాట్ హాట్ గా కనిపించి, ప్రేక్షకులకు పిచ్చెక్కించేసింది. ఇక సెకండ్ హాఫ్ లో ప్రేక్షకులను కథలో లీనమయ్యే విధంగా చేసేసింది. క్లైమాక్స్ లో అనుష్క యాక్టింగ్ అద్భుతం.

అనుష్కకు జోడిగా నటించిన ఆర్య.. అభి పాత్రలో ఒదిగిపోయాడు. స్టైలిష్ లుక్స్ తో ఆర్య తన పాత్రకు పూర్తి న్యాయం చేసాడు. అనుష్క - ఆర్యల మధ్య వచ్చే సన్నివేశాలు చాలా బాగున్నాయి. ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు. అలాగే సిమ్రాన్ పాత్రలో సోనాల్ చౌహన్ చాలా చక్కగా నటించింది. తన గ్లామర్ తో అదరగొట్టేసింది. హాట్ హాట్ అందాలతో పిచ్చెక్కించేసింది. ముఖ్యంగా అనుష్క-ఆర్య-సోనల్ చౌహన్ ల మధ్య వచ్చే పలు సీన్లు సరదాగా అనిపిస్తాయి.

ఇక అనుష్క తల్లి పాత్రలో నటించిన ఊర్వశి అద్భుతంగా నటించింది. ముఖ్యంగా అనుష్క-ఊర్వశిల మధ్య వచ్చే సన్నివేశాలు బాగున్నాయి. ఓ కూతురు పెళ్లి కోసం ఆరాటపడే తల్లి పాత్రలో ఊర్వశి నటన అద్భుతం. ‘సైజ్ జీరో’ సత్యానంద్ పాత్రలో ప్రకాశ్ రాజ్ తనదైన శైలిలో చక్కగా నటించాడు. ఇక మిగతా నటీనటులు వారి వారి పాత్రలో చాలా చక్కగా నటించారు.

‘సైజ్ జీరో’ సినిమాలో అనుష్క ఎంట్రీ ఇచ్చిన క్షణం నుంచి ప్రేక్షకులను సినిమాలో లీనమయ్యే విధంగా అద్భుతంగా తెరకెక్కించారు. ముఖ్యంగా ఈ సినిమాతో చెప్పాలనుకున్న పాయింట్ ను పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేసారు. ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా సరదా సరదాగా సాగిపోతే.. సెకండ్ హాఫ్ లో భావోద్వేగాలు, ఎమోషన్స్, సెంటిమెంట్ తో అద్భుతంగా తెరకెక్కించారు. భారీ యాక్షన్ సీన్లు, ఫైట్లు లేకుండా చాలా కాలం తర్వాత మళ్లీ కుటుంబసమేతంగా కలిసి వెళ్లి చూడదగ్గ చిత్రంగా ‘సైజ్ జీరో’ చిత్రం తెరకెక్కింది.

మైనస్ పాయింట్స్:

‘సైజ్ జీరో’ సినిమాలో చెప్పుకోదగ్గ మైనస్ పాయింట్స్ ఏమి లేవు. కాకపోతే సెకండ్ హాఫ్ ను ప్రేక్షకులు కాస్త బోర్ గా ఫీల్ అవుతారు. సెకండ్ హాఫ్ మధ్యలో వచ్చే ఓ 15 నిమిషాలు ఆడియెన్స్ బోర్ గా ఫీల్ అవుతారు. అలాగే మాస్ ఆడియన్స్ కోరుకునే యాక్షన్, డాన్సులు, కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమి లేకపోవడం మైనస్ గా చెప్పుకోవచ్చు.

సాంకేతికవర్గం పనితీరు:

ముందుగా ‘సైజ్ జీరో’ కథ నుంచి స్టార్ చేద్దాం. ఈ సినిమాకు కనిక అద్భుతమైన కథను అందించారు. ప్రతి అమ్మాయి జీవితంలో ఎదురయ్యే ఓ మేజర్ పాయింట్ ను తీసుకొని, చాలా చక్కటి కథగా తీర్చిదిద్దారు. కనిక రాసిన కథను సినిమాటోగ్రాఫర్ నిరవ్ షా అద్భుతంగా చూపించారు. ప్రతి ఫ్రేంను కూడా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా, ఆ ఫీల్ కనెక్ట్ చేసేట్లుగా నిరవ్ షా తన సినిమాటోగ్రాఫితో చక్కగా చూపించారు. విజువల్స్ పరంగా చాలా గ్రాండ్ గా చూపించారు. ‘సైజ్ జీరో’ సినిమాకు యం.యం.కీరవాణి అందించిన సంగీతం ప్రాణం పోసిందని చెప్పుకోవచ్చు. పాటలు విజువల్స్ పరంగా మరింత బాగున్నాయి. అలాగే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు చాలా బాగుంది. కొన్ని కొన్ని సన్నివేశాలలో రిరికార్డింగ్ సూపర్బ్. డైలాగ్స్ చాలా బాగున్నాయి. ‘‘అమ్మాయి లావుగా వుంటే రిజెక్ట్ చేస్తారా? అంటే పెళ్లయ్యిన తర్వాత లావయితే డివోర్స్ ఇస్తారా!’’ అనే పలు డైలాగ్స్ అద్భుతం. ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. ఎడిటింగ్ బాగుంది. సెకండ్ హాఫ్ లో మరింత ఎడిటింగ్ చేసి వుంటే, సినిమా వేగం పెరిగి మరింత బాగుండేది.

ఇక ‘అనగనగా ఓ ధీరుడు’ తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకొని మరోసారి దర్శకుడిగా తన సత్తా ఏంటో చూపిన ప్రకాశ్ కోవెలమూడి విజయం సాధించాడని చెప్పుకోవచ్చు. సినిమాలో నటించిన నటీనటుల నుంచి అద్భుతమైన నటనను రాబట్టారు. ఇక పివిపి సంస్థ నిర్మించిన ఈ సినిమా చాలా గ్రాండ్ గా వుంది. సినిమాలో ఆ రిచ్ నెస్ కనిపిస్తోంది.

చివరగా:

‘సైజ్ జీరో’: కుటుంబసమేతంగా చూడదగ్గ చిత్రం.

- Sandy