The Full Telugu Review Of Puli Movie | Vijay | Sridevi | Shruti Haasan| Telugu Movies

Teluguwishesh పులి పులి Puli Movie Telugu Review : The Full Telugu Review Of Puli Movie Starring Vijay, Sridevi, Sudeep, Shurti Haasan and Hansika. Product #: 68690 2.75 stars, based on 1 reviews
  • చిత్రం  :

    పులి

  • బ్యానర్  :

    యస్.వి.ఆర్ మీడియా (ప్రై) లిమిటెడ్

  • దర్శకుడు  :

    చింబు దేవన్

  • నిర్మాత  :

    C. శోభ

  • సంగీతం  :

    దేవి శ్రీ ప్రసాద్

  • సినిమా రేటింగ్  :

    2.752.75  2.75

  • ఛాయాగ్రహణం  :

    నటరాజన్ సుబ్రమణ్యం

  • ఎడిటర్  :

    శ్రీకర్ ప్రసాద్

  • నటినటులు  :

    విజయ్, శ్రీదేవి, సుదీప్, శృతి హాసన్, హన్సికా మోత్వాని తదితరులు

Puli Move Review

విడుదల తేది :

2015-10-02

Cinema Story

అఘోరా ద్వీపం నుంచి వచ్చిన కొంతమంది భేతాళ జాతి వారు దక్షిణ భారతదేశాన్ని ఆక్రమించుకుని దానికి భేతాళ దేశంగా పేరు పెట్టి, వారి కింద వున్న 56 ఊర్లను పరిపాలిస్తూ వుంటారు. ఈ భేతాళ దేశాన్ని పరిపాలించే రాణి యవ్వనరాణి(శ్రీదేవి). ఆమెకు దళపతి అయినటువంటి జలంధరుడు(సుదీప్) ప్రజలను హింసలు పెడుతూ, వారిని బానిసలుగా చూస్తూ, వారి పంట, ధనాన్ని లాక్కుంటూ వుంటాడు.

 

సీన్ కట్ చేస్తే... ఆ భేతాళ దేశం కింద వుండే గ్రామాల్లో భైరవ కోన ఒకటి. ఆ కోనకు నాయకుడు నరసింగ నాయకుడు(ప్రభు). నరసింగకు అనుకోకుండా నదిలో కొట్టుకు వచ్చిన ఓ బిడ్డ దొరుకుతాడు. ఆ బిడ్డకు మనోహరుడు(విజయ్) అనే పేరు పెట్టి, పెంచుతాడు. మనోహరుడిని ఆ భేతాళ జాతిని అడ్డుకోగల వీరుడిలా తయారు చేస్తాడు నరసింగ. అదే కోనలో వుండే మందార మల్లి(శృతిహాసన్)తో ప్రేమలో పడతాడు మనోహరుడు. వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారు.

 

అయితే అదే సమయంలో భేతాళ జాతి వారు వచ్చి భైరవ కోనలోని ప్రజలను కొట్టి, మందారమల్లిని ఎత్తుకెళ్లిపోతారు. దీంతో మందారమల్లి కోసం భేతాళ దేశానికి బయలుదేరుతాడు మనోహరుడు. ఆ తర్వాత ఏం జరిగింది? అక్కడ మనోహరుడికి ఎలాంటి అడ్డంకులు ఏర్పడ్డాయి? మనోహరుడికి భేతాళ దేశంలో తెలిసిన విషయాలేంటి? మందార మల్లిని మనోహరుడు ఎలా కాపాడాడు? చివరకు ఏం జరిగింది? అనే ఆసక్తికర అంశాలు వెండితెర మీద చూసి తెలుసుకోవాల్సిందే.

cinima-reviews
పులి

‘తుపాకి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయిన తమిళ స్టార్ హీరో ఇలయథలపతి విజయ్ నటించిన తాజా చిత్రం ‘పులి’. సోషియో ఫాంటసీ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి చింబుదేవన్ దర్శకత్వం వహించాడు. ఎస్.కె.టి స్టూడియోస్ బ్యానర్ పై సిబు థమీన్స్, పి.టి.సెల్వకుమార్ నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగులో ఎస్.వి.ఆర్ మీడియా ప్రై.లి. బ్యానర్ పై సి.శోభ గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు.

తెలుగు, తమిళం, హిందీ భాషలలో ఏకకాలంలో రూపొందింది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో ఇటీవలే విడుదలై భారీ విజయం సాధించింది. అలాగే ఈ చిత్ర ట్రైలర్లకు కూడా భారీ రెస్పాన్స్ వస్తోంది. ఇందులో విజయ్ సరసన శృతిహాసన్, హన్సికలు హీరోయిన్లుగా నటించారు. శ్రీదేవి కపూర్, సుదీప్ లు ప్రధాన పాత్రలలో నటించారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ భాషలలో గ్రాండ్ గా విడుదల చేసారు. మరి ఈ సినిమా ఎలా వుందో ఒకసారి చూద్దామా!


Video Courtesy : Sony Music India

ప్లస్ పాయింట్స్:

‘పులి’ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ విజయ్. విజయ్ రెండు విభిన్న పాత్రల్లో అద్భుతంగా నటించాడు. సినిమా మొత్తాన్ని తన భుజాలపై నడిపించాడు. ముఖ్యంగా యాక్షన్, కామెడీ సన్నివేశాలలో విజయ్ అదరగొట్టేసాడు. నెగెటివ్ షేడ్స్ లో శ్రీదేవి, సుదీప్ లు చాలా చక్కగా నటించారు. అధినేతగా, క్వీన్ గా శ్రీదేవి నటన బాగుంది. సుదీప్ తనదైన శైలిలో మరోసారి నెగెటివ్ షేడ్స్ లో నటించి ఆకట్టుకున్నాడు. ఇక శృతిహాసన్, హన్సికలు తమ గ్లామర్ తో పిచ్చెక్కించారు. ఇద్దరు ఒకరికొకరు పోటీ పడి మరి అందాల ప్రదర్శన చేసారు. నటన పరంగా కూడా చాలా చక్కగా నటించారు. ఇక మిగతా నటీనటులు వారి వారి పాత్రల మేరకు చాలా చక్కగా నటించారు. విజువల్స్ పరంగా సినిమా చాలా బాగుంది. విజయ్ పై వచ్చే కొన్ని కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ సూపర్బ్. సెకండ్ హాఫ్ లో శ్రీదేవి, విజయ్, సుధీప్ ల మధ్య వచ్చే సన్నివేశాలు బాగున్నాయి.

మైనస్ పాయింట్స్:

ఈ సినిమాకు మేజర్ మైనస్ పాయింట్ కథ. తన ప్రేయసిని ఎత్తుకెళ్లిన వారితో ఫైట్ చేసి, తన ప్రేయసిని దక్కించుకునే కథాంశంతో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయి. తన ప్రేయసి కోసం వెళ్లిన ఆ ప్రియుడికి అనుకోకుండా కొన్ని నిజాలు తెలియడం. ఇలాంటి కథలతో ఇప్పటికే చాలా సినిమాలు చూసేసాం. కానీ ఇదే కథకు కాస్త విభిన్నంగా చూపించడానికి సోషియో ఫాంటసీని జతచేర్చారు.