The Full Telugu Review Of Bhale Bhale Magadivoy Movie | Actor Nani Movies | Lavanya Tripathi Movies

Teluguwishesh భ‌లే భ‌లే మ‌గాడివోయ్ భ‌లే భ‌లే మ‌గాడివోయ్ Bhale Bhale Magadivoy Movie Telugu Review Nani Lavanya Tripathi : The Full Telugu Review Of Bhale Bhale Magadivoy Movie In Which Nani And Lavanya Tripathi Starring. This Movie Directed By Maruthi. Product #: 67810 3.5 stars, based on 1 reviews
  • చిత్రం  :

    భ‌లే భ‌లే మ‌గాడివోయ్

  • బ్యానర్  :

    UV Creations మ‌రియు GA2

  • దర్శకుడు  :

    మారుతి

  • నిర్మాత  :

    బ‌న్నివాసు

  • సంగీతం  :

    గోపిసుంద‌ర్

  • సినిమా రేటింగ్  :

    3.53.53.5  3.5

  • ఛాయాగ్రహణం  :

    నిజార్ ష‌ఫి

  • ఎడిటర్  :

    ఉద్దవ్‌.ఎస్‌.బి

  • నటినటులు  :

    నాని, లావ‌ణ్య త్రిపాఠి, ముర‌ళి శ‌ర్మ‌, న‌రేష్‌, సితార‌, స్వప్న మాధురి, శ్రీనివాస రెడ్డి, వెన్నెల కిషోర్‌, ప్రవీణ్, ష‌క‌ల‌క శంక‌ర్‌, బ‌ద్రమ్ మ‌రియు త‌దిత‌రులు

Bhale Bhale Magadivoy Movie Telugu Review Nani Lavanya Tripathi

విడుదల తేది :

2015-09-04

Cinema Story

మతిమరుపు గల వ్యక్తి లక్కీ(నాని). అనుకోకుండా నందన(లావణ్య త్రిపాఠీ)ను చూసి ప్రేమలో పడతాడు. నందన ఒక డాన్స్ టీచర్. తన మతిమరుపు విషయం గురించి చెప్పకుండా నందనను పెళ్లి చేసుకోవాలని లక్కీ నిర్ణయించుకుంటాడు. దీంతో లక్కీ చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అసలు ఏంటి ఆ సమస్యలు? ఎవరి వల్ల లక్కీకి సమస్యలు వచ్చాయి? ఆ సమస్యల నుంచి లక్కీ ఎలా తప్పించుకున్నాడు? చివరకు నందనను లక్కీ పెళ్లి చేసుకున్నాడా లేదా? అనే అంశాలను వెండితెర మీద చూసి ఆనందించాల్సిందే.

cinima-reviews
భ‌లే భ‌లే మ‌గాడివోయ్

నాని, లావణ్య త్రిపాఠీ జంటగా నటించిన తాజా చిత్రం ‘భలే భలే మగాడివోయ్’. ప్రముఖ దర్శకుడు మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అల్లు అర‌వింద్ సమ‌ర్పణ‌లో, UV Creations మ‌రియు GA2 (A Division of GeethaArts)సంయుక్తంగా ప్రోడ‌క్షన్ నెం. 1 గా యువ నిర్మాత బన్నీ వాసు నిర్మించారు.

పూర్తిస్థాయి లవ్, కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రానికి గోపిసుందర్ సంగీతం అందించాడు. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్లకు మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రాన్ని నేడు (సెప్టెంబర్ 4) ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేసారు. మరి ఈ సినిమా ఎలా వుందో, ఎలాంటి విజయం సాధించనుందో ఒకసారి చూద్దామా!

Cinema Review

ప్లస్ పాయింట్స్:

‘భలే భలే మగాడివోయ్’ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ నాని. ఇప్పటివరకు నాని చేసిన సినిమాలన్ని ఒకవైపు.. ఈ ఒక్క సినిమా ఒకవైపు అని చెప్పుకోవచ్చు. ఇందులో నాని యాక్టింగ్ సూపర్బ్. సినిమా మొత్తాన్ని నాని ఒక్కడే తన భుజాలపై మోసాడని చెప్పుకోవచ్చు. ఇక లక్కీ పాత్రలో నాని జీవించేసాడు. లక్కీ పాత్రకు వందశాతం న్యాయం చేసాడు. నాని తన ఎక్స్ ప్రెషన్స్, డైలాగ్స్ తో అదరగొట్టాడు. సినిమా మొత్తం కూడా మతిమరుపు వ్యక్తి పాత్రలో నటించి తెగ నవ్వించేసాడు.

మాములుగా నాని డైలాగ్ డెలివరీ, హవాభావాలు కాస్త కామెడీ సీన్లకు బాగా సెట్ అవుతాయి. కానీ తొలిసారిగా పూర్తిస్థాయిలో కామెడీ చేసి తెగ నవ్వించేసాడు. మొత్తానికి నాని ‘భలే భలే మగాడివోయ్’ టైటిల్ కు సరిగ్గా సరిపోయాడని చెప్పుకోవచ్చు. ఇక నందన పాత్రలో నటించిన లావణ్య త్రిపాఠీ చాలా బాగా నటించింది. తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. లుక్స్, గ్లామర్, ఎక్స్ ప్రెషన్స్ పరంగా తనదైన శైలిలో లావణ్య ఆకట్టుకుంది. నాని, లావణ్యల మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంది.

ఇక నందన తండ్రి పాత్రలో మురళి శర్మ యాక్టింగ్ బాగుంది. మురళి శర్మ డైలాగ్ డెలివరి బాగుంది. ఇక పోలీస్ ఆఫీసర్ పాత్రలో, అలాగే నందనను ప్రేమించే ఓ ప్రేమికుడి పాత్రలో అజయ్ నటన బాగా ఆకట్టుకుంది. ఇక మిగతా నటీనటులు వారి వారి పాత్రల మేరకు చాలా చక్కగా నటించారు.

మొత్తంగా చూస్తే... ‘భలే భలే మగాడివోయ్’ చిత్రం ప్రారంభం నుంచి చివరకు తెగ నవ్విస్తూ వినోదాన్ని అందించే ఓ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని చెప్పుకోవచ్చు.

మైనస్ పాయింట్స్:

ఈ సినిమాలో పెద్దగా చెప్పుకోవాల్సినంతగా మైనస్ పాయింట్స్ ఏమి లేవు. కాకపోతే సెకండ్ హాఫ్ లో కాస్త స్లో గా సాగుతున్నట్లుగా అనిపిస్తుంది. ఇక పాటలు మరింత బాగుంటే ఇంకా బాగా అలరించేది.

సాంకేతికవర్గ పనితీరు:

ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ మారుతి. ఇప్పటి వరకు మారుతి తనకున్న ‘అడాల్ట్’ ముద్రను ఈ సినిమాతో మొత్తం చెరిపేసుకున్నాడని చెప్పుకోవచ్చు. గతంలో మారుతి తీసిన దాదాపు అన్ని చిత్రాల్లో కూడా ద్వందార్థాలు, భారీ రొమాంటిక్ సన్నివేశాలు, డైలాగ్స్ వున్నాయి. కానీ ‘భలే భలే మగాడివోయ్’ సినిమాలో ఎలాంటి అసభ్యకర సన్నివేశాలు, డైలాగ్స్ లేకుండా క్లీన్ చిత్రంగా తీర్చిదిద్దారు.

ఇక మారుతి అనుకున్న మతిమరుపు పాయింట్ చాలా బాగా వర్కౌట్ అయ్యింది. మతిమరుపు వ్యక్తి జీవితాన్ని ఓ కామెడీ స్టయిల్లో చూపించి అదరగొట్టారు. మారుతి రాసుకున్న కథ, చూపించిన విధానం సూపర్బ్. అలాగే నటీనటుల నుంచి తనకు కావాల్సిన విధంగా నటనను రాబట్టుకుని, మరో హిట్టును తన ఖాతాలో వేసుకున్నాడు మారుతి.

సినిమాటోగ్రఫి చాలా బాగుంది. విజువల్స్ పరంగా చాలా అందంగా చూపించారు. అన్ని సీన్లు కూడా చాలా గ్రాండ్ గా చూపించారు. గోపి సుందర్ అందించిన పాటలు విజువల్స్ పరంగా చూస్తే చాలా బాగున్నాయి. అలాగే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు మరింత హెల్ప్ అయ్యింది. ఎడిటింగ్ బాగుంది. డైలాగ్స్ సూపర్బ్.

గీతా ఆర్ట్స్ బ్యానర్లో మరో హిట్ చిత్రంగా చెప్పుకోవచ్చు. ‘మగధీర’, ‘జల్సా’ వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరించడం విశేషం. అలాగే తన గీతా ఆర్ట్స్ బ్యానర్ ద్వారానే GA2 అనే నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి, ఈ సంస్థ ద్వారా బన్నీవాసును నిర్మాతగా పరిచయం చేయడం అభినందించదగ్గ విషయం. బన్నీవాసు కూడా ఈ బ్యానర్ పేరు నిలబెట్టే విధంగా ఖర్చుకు ఎక్కడ వెనుకాడకుండా సినిమాను చాలా అద్భుతంగా నిర్మించారు. అలాగే ఈ చిత్రానికి వరుస హిట్ చిత్రాల నిర్మాణ సంస్థ UV క్రియేషన్స్ కూడా భాగస్వామ్యం వహించడం విశేషం. ఇన్ని భారీ సంస్థల కలయికలో వచ్చిన ఈ చిత్రం క్వాలీటి పరంగా అద్భుతంగా వచ్చింది. సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్టవ్వడం ఖాయం.

చివరగా:
భలే భలే మగాడివోయ్: కుటుంబ సమేతంగా చూడదగ్గ కామెడీ ఎంటర్ టైనర్.