The Full Telugu Review Of Cinema Chupistha Maava Movie | Avika Gor | Raj Tarun | Telugu Movies

Teluguwishesh సినిమా చూపిస్త మావ సినిమా చూపిస్త మావ Cinema Chupistha Maava telugu movie review avika gor raj tarun : The Full Telugu Review Of Cinema Chupistha Maava Movie. In This Movie Raj Tarun And Avika Gor Playing In Lead Roles. Product #: 67177 2.75 stars, based on 1 reviews
  • చిత్రం  :

    సినిమా చూపిస్త మావ

  • బ్యానర్  :

    ఆర్యత్‌ సినీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, లక్కీ మీడియా

  • దర్శకుడు  :

    త్రినాథ రావు

  • నిర్మాత  :

    బోగాది అంజిరెడ్డి-బెక్కెం వేణుగోపాల్‌ (గోపి)-రూపేష్‌ డి.గోహిల్‌-జి.సునీత

  • సంగీతం  :

    శేఖర్ చంద్ర

  • సినిమా రేటింగ్  :

    2.752.75  2.75

  • ఛాయాగ్రహణం  :

    సాయి శ్రీరామ్

  • ఎడిటర్  :

    కార్తీక్ శ్రీనివాస్

  • నటినటులు  :

    రాజ్ తరుణ్, అవికా గోర్, రావు రమేష్ తదితరులు

Cinema Chupistha Maava Telugu Movie Review Avika Gor Raj Tarun

విడుదల తేది :

2015-08-14

Cinema Story

ఇంటర్మీడియట్ రెండు సార్లు తప్పి ఎప్పుడూ తన తండ్రి చేత తిట్టించుకుంటూ, ఆవారాగా తన ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేసే వ్యక్తి కత్తి (రాజ్ తరుణ్). ప్రతి విషయంలోని క్వాలిటీ వుండాలని కోరుకునే సోమనాథ్ చటర్జీ (రావు రమేష్). ఈయన గవర్నమెంట్ హెల్త్ డిపార్ట్ మెంట్ లో మెడికల్ కౌన్సిల్ సెక్రటరీగా పనిచేస్తుంటారు. ఈయన కూతురు పరిణీత(అవిక గోర్). చదువుల సరస్వతి. పరిణీతను చూసి కత్తి ప్రేమలో పడతాడు. ఇక అప్పటి నుంచి పరిణీత వెంటపడి అల్లరిచేస్తూ చివరకు పరిణీతను కూడా ప్రేమలో పడేట్లుగా చేసుకుంటాడు. ఇక ఇద్దరి లవ్ స్టోరీ మొదలవుతుంది.

సీన్ కట్ చేస్తే... వీరి ప్రేమ విషయం సోమనాథ్ చటర్జీకి తెలుస్తుంది. అల్లరి చిల్లరిగా తిరిగే కత్తి అంటే సోమనాథ్ కు అస్సలు ఇష్టం లేకపోయినా.. తన కూతురు ఇష్టపడుతుందన్న ఒకే ఒక్క కారణంతో... కత్తికి సోమనాథ్ ఓ ఛాలెంజ్ ఇస్తాడు. నెల రోజుల్లో తాను ఇచ్చిన ఛాలెంజ్ లో గెలిస్తే తన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని సోమనాథ్ మాటిస్తాడు. దీనికి కత్తి కూడా ఓకే అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది కథాంశం. కత్తికి సోమనాథ్ ఇచ్చిన చాలెంజ్ ఏంటి? ఆ ఛాలెంజ్ లో గెలవడానికి కత్తి ఏం చేసాడు? చివరకు కత్తి ఆ ఛాలెంజ్ లో గెలిచాడా లేదా? అనే పలు ఆసక్తికర అంశాలను వెండితెర మీద చూసి తెల్సుకోవాల్సిందే.

cinima-reviews
సినిమా చూపిస్త మావ

‘ఉయ్యాల జంపాలా’ తర్వాత రాజ్ తరుణ్, అవికా గోర్ హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘సినిమా చూపిస్త మావ’. అంజిరెడ్డి ప్రొడక్షన్స్‌-ఆర్‌.డి.జి ప్రొడక్షన్స్‌ ప్రై॥లి॥ సంయుక్త సమర్పణలో ఆర్యత్‌ సినీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి లక్కీ మీడియా పతాకంపై బోగాది అంజిరెడ్డి-బెక్కెం వేణుగోపాల్‌ (గోపి)-రూపేష్‌ డి.గోహిల్‌-జి.సునీత సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి త్రినాథ రావు దర్శకత్వం వహించారు. శేఖర్ చంద్ర సంగీతం అందించిన పాటలు ఇప్పటికే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. అలాగే ట్రైలర్ కు కూడా భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్ర నైజాం డిస్ట్రిబ్యూషన్ హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకున్నారు. అలాగే శాటిలైట్ హక్కులను మాటీవి వారు దక్కించుకున్నారు. ఈ చిత్రాన్ని ఆగష్టు 14న భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో మరికొద్ది రోజుల్లో తెలియనుంది.

Cinema Review

ప్లస్ పాయింట్స్:

‘సినిమా చూపిస్త మావ’ అంటూ పెట్టిన ఈ చిత్ర టైటిల్ కు రాజ్ తరుణ్ సరైన న్యాయం చేసాడు. కత్తి పాత్రలో రాజ్ తరుణ్ చాలా బాగా నటించాడు. మాస్ కుర్రోడి పాత్రలో అదరగొట్టాడు. తనదైన డైలాగ్ డెలివరితో అదరగొట్టాడు. అంతే కాకుండా ఎమోషన్స్, కామెడీ సన్నివేశాలలో బాగా చేసాడు. ఇక అవిక గోర్ తన పాత్రకు తగిన న్యాయం చేసింది. క్యూట్ లుక్స్, ఎక్స్ ప్రెషన్స్ తో చాలా చక్కగా నటించింది. వీరిద్దరి కెమిస్ట్రీ మరోసారి అదరగొట్టింది. ఇక మాస్ పాటలో అవిక వేసిన మాస్ స్టెప్పులు కూడా చాలా బాగున్నాయి.

ఇక సోమనాథ్ ఛటర్జీ పాత్రలో రావు రమేష్ అద్భుతంగా నటించాడు. ఈ సినిమాకు రావు రమేష్ వంద శాతం న్యాయం చేసాడని చెప్పుకోవచ్చు. తన యాక్టింగ్ తో అదరగొట్టాడు. ముఖ్యంగా రావు రమేష్- రాజ్ తరుణ్ కాంబినేషన్లో వచ్చే పలు సన్నీవేశాలు బాగున్నాయి. ఇక పోసాని కృష్ణమురళి, ప్రవీణ్, చలాకీ చంటి తదితరులు వారి వారి పాత్రల్లో నటించి బాగా నవ్వించారు.

ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ మొత్తం బాగా నవ్వించి, సెకండ్ హాఫ్ లో కామెడీతో పాటు కాస్త ఎమోషన్, ఛాలెంజింగ్ సీన్స్ తో అదరగొట్టేసారు. మొత్తానికి కామెడీ ఎంటర్ టైనర్ గా చాలా బాగుంది.

మైనస్ పాయింట్స్:

‘సినిమా చూపిస్త మావ’కు మేజర్ మైనస్ పాయింట్స్ అంటూ పెద్దగా ఏమి లేవు కానీ... ఇలాంటి కథతో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయి. ఇక కథను బాగా సాగదీసినట్లుగా అనిపిస్తుంది. కథనం విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. సినిమాల్లో తర్వాత వచ్చే సన్నివేశం చూసే ప్రేక్షకులు ముందుగానే ఊహించేవచ్చు. ఇక పలు కామెడీ సీన్స్ బలవంతంగా పెట్టినట్లుగా అనిపిస్తుంది. కొన్ని కొన్ని కామెడీ సీన్లు వర్కౌట్ అవలేదు. క్లైమాక్స్ ను మరింత బెటర్ గా రాసుకుంటే బాగుండేది.

సాంకేతికవర్గ పనితీరు:

ఈ సినిమాకు శేఖర్ చంద్ర చాలా మంచి సంగీతాన్ని అందించాడు. అన్ని పాటలు బాగున్నాయి. రీ రికార్డింగ్ కూడా చాలా బాగుంది. సాయిశ్రీరామ్ అందించిన సినిమాటోగ్రఫి చాలా బాగుంది. ప్రతి ఫ్రేంను చాలా అందంగా చూపించారు. డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఎడిటింగ్ పర్వాలేదు. కానీ ఎడిటింగ్ విషయంలో మరింత కేర్ తీసుకుంటే బాగుండేది.

ఇక కథ, స్ర్కీన్ ప్లే దర్శకత్వం విషయానికొస్తే... దర్శకుడిగా త్రినాథరావు పాతకథనే కొత్తగా చూపించాలని ప్రయత్నించాడు. కొన్ని కొన్ని కామెడీ సన్నివేశాలను జతచేసి తెరకెక్కించాడు. కానీ దర్శకుడిగా త్రినాధరావు విజయం సాధించాడని చెప్పుకోవచ్చు. పాత స్టోరీ లైన్ కు కామెడీని జతచేసి చాలా చక్కగా చూపించాడు. కానీ కథ, స్ర్కీన్ ప్లే విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకొని వుంటే బాగుండేది. ఇక నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

చివరగా:
సినిమా చూపిస్త మావ: కామెడీ ఎంటర్ టైనర్