The Full Telugu Review Of Allari Naresh James Bond Movie | Sakshi Chowdary | Telugu Movies

Teluguwishesh జేమ్స్ బాండ్ జేమ్స్ బాండ్ Allari Naresh James Bond Movie Review Sakshi Chowdary : The Full Telugu Review Of Allari Naresh James Bond Movie In Which Sakshi Chowdary Is Playing Title Role. Product #: 66457 2.75 stars, based on 1 reviews
  • చిత్రం  :

    జేమ్స్ బాండ్

  • బ్యానర్  :

    ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి.

  • దర్శకుడు  :

    సాయికిశోర్ మచ్చ

  • నిర్మాత  :

    రామబ్రహ్మం సుంకర

  • సంగీతం  :

    సాయి కార్తీక్

  • సినిమా రేటింగ్  :

    2.752.75  2.75

  • ఛాయాగ్రహణం  :

    దాము నర్రావు

  • ఎడిటర్  :

    ఎం.ఆర్.వర్మ

  • నటినటులు  :

    అల్లరి నరేష్, సాక్షి చౌదరి, ఆశిష్ విద్యార్థి, చంద్రమోహన్, జయప్రకాష్ రెడ్డి, రఘుబాబు, కృష్ణభగవాన్, పోసాని తదితరులు

Allari Naresh James Bond Movie Review Sakshi Chowdary

విడుదల తేది :

2015-07-24

Cinema Story

నాని అలియాస్ లక్ష్మీ ప్రసాద్(అల్లరి నరేష్) ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్. ఇతను గొడవలకి దూరంగా వుంటాడు. మరోవైపు బుల్లెట్ అలియాస్ పూజ (సాక్షి చౌదరి) దుబాయ్ లో పెద్ద డాన్. ఈమె డాన్ అన్న విషయం ఇండియాలో ఉండే ఆమె మదర్ కి తెలియదు. ఓ రోజు తన మదర్ కి కాన్సర్ ఫైనల్ స్టేజ్ లో ఉందని తెలుసుకున్న పూజ.. మదర్ చివరి రోజుల్లో ఆమెతో సంతోషంగా గడపాలని అనుకుంటుంది. అలా అనుకున్న ఆమె తన మాఫియా అడ్డాని దుబాయ్ నుంచి హైదరబాద్ కి షిఫ్ట్ చేసి, మదర్ కి తెలియకుండా మేనేజ్ చేస్తూ ఉంటుంది. ఓ రోజు తన తల్లి పెళ్లి చేసుకోమని కోరడంతో పూజా ఒక డూప్ పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేస్తుంది. ఈ సమయంలోనే  ఓ సందర్భంలో పూజని చూసిన నాని ప్రేమలో పడతాడు. అంతే తన బ్యాక్ గ్రౌండ్ గురించి తెలుసుకోకుండా పెళ్లి చేసుకుంటాడు. అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది.

పెళ్ళైన కొద్ది రోజులకి నానికి ఓ పెద్ద షాక్! అదేమిటంటే.. పూజ కత్తి లాంటి ఫిగర్ మాత్రమే కాదు, కత్తులను, గన్స్ ని చకచకా వాడేసి అవతలి వాడి ప్రాణాలు పైకి పంపేయగల సత్తా ఉన్న లేడీ మాఫియా డాన్ అని నానికి తెలుస్తుంది. అప్పట్నుంచి పూజ ఇంటినుంచి తప్పించుకొని పారిపోవాలని నాని తెగ ట్రై చేస్తుంటాడు. కానీ ప్రతి సారి ఫెయిల్ అవుతుంటాడు. అదే టైంలో పూజపై పగ తీర్చుకోవాలని దుబాయ్ లో వున్న మరో డాన్ (ఆశిష్ విద్యార్ధి) ట్రై చేస్తుంటాడు. ఇలా ఈ సినిమా గందరగోళంగా, కామెడీగా సాగుతుంటుంది. ఇంతకీ తాను పెళ్లి చేసుకున్న లేడీ మాఫియా డాన్ పూజ చేతి నుంచి తప్పించుకునేందుకు నాని వేసిన ప్లాన్ ఏంటి.? ఆ ప్లాన్ ఎలా, ఎవరెవరి వల్ల అమలైంది.? ఫైనల్ రిజల్ట్ ఏంటి.? అసలు మాఫియా డాన్ అయిన పూజ నాని ప్లాన్ గురించి తెలుకోగలిగిందా.? లేదా.? అలాగే బడా తన పగ తీర్చుకున్నాడా.? లేదా.? అనే ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే.. వెండితెరపై సినిమా చూడాల్సిందే!

cinima-reviews
జేమ్స్ బాండ్

అల్లరి నరేష్ నటించిన ‘జేమ్స్ బాండ్’ చిత్రం వాయిదా మీద వాయిదా పడుతూ వస్తోంది. ఈ చిత్రాన్ని గత నెల 26న విడుదల చేయాలని భావించారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేసారు. ఆ తర్వాత జులై 17న విడుదల చేయబోతున్నట్లు అల్లరి నరేష్ ప్రకటించాడు. కానీ ‘బాహుబలి’ సినిమా విడుదల కారణంగా ‘జేమ్స్ బాండ్’ చిత్రాన్ని జులై 24కు రిలీజ్ పోస్ట్ పోన్ చేశారు. కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో నరేష్ భార్యగా సాక్షి చౌదరి లేడీ మాఫియా డాన్ పాత్రలో నటించింది. గతకొన్నాళ్ల నుంచి సక్సెస్ లేకుండా సతమతమవుతున్న అల్లరి నరేష్ కి ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని అందించిందో తెలుసుకుందామా...

Cinema Review

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకి అల్లరి నరేష్ అల్లరే ప్లస్ పాయింట్. ఆడియన్స్ ఆశించినట్లుగా కామెడీ పండించేశాడు. ఈ సినిమా స్టార్టింగ్ చాలా బాగుంది. పాత్రలని పరిచయం చేసిన విధానం, కథలోకి వేగంగా వెళ్ళిన విధానం ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటుంది. ఫస్ట్ హాఫ్ లో చాలా సీన్స్ ఆడియన్స్ ని బాగా నవ్విస్తాయి. సెకండాఫ్ లో అల్లరి నరేష్ చేసే ప్లాన్స్ ఫెయిల్ అయ్యే సీన్స్ ఇంకా బాగా నవ్వు తెప్పిస్తాయి. ముఖ్యంగా లేడీ డాన్ కి అల్లరి నరేష్ ఫ్యామిలీకి మధ్య వచ్చే కొన్ని సీన్స్ ఆడియన్స్ ని కితకితలు పెడతాయి.

ఇక అల్లరి నరేష్ విషయానికి వస్తే.. ఈ సినిమాకి మెయిన్ పిల్లర్ అతడే! తన కామెడీ టైమింగ్ తో సినిమాను చాలా బాగా నడిపించాడు. హీరోయిన్ సాక్షి చౌదరి సీరియర్ రోల్ చేయడంతో కామెడీ బాధ్యత అంతా నరేష్ తీసుకొని చాలా బాగా నవ్వించాడు. సాక్షి చౌదరి ఈ సినిమాలో బాగా కష్టపడి రిస్కీ స్టంట్స్ చేసింది. ఇక పాటల్లో, సినిమాలో అల్ట్రా మోడ్రన్ లుక్ లో కనిపిస్తూ అందచందాలతో ఆకట్టుకుంది. అల్లరి నరేష్ తో మొదటి నుంచి ట్రావెల్ అవుతూ వచ్చిన ప్రవీణ్ చాలా బాగా నవ్వించాడు. సాఫ్ట్ వేర్ కంపెనీ ఎండిగా, పోసాని కృష్ణమురళి కాసేపు నవ్వించాడు. విలన్ గా ఆశిష్ విద్యార్ధి బాగా చేసాడు.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకి ఎంచుకున్న స్టొరీ లైన్ వినడానికి కొత్తగానే ఉన్నా, దాన్ని డెవలప్ చేసిన విధానం రొటీన్ అనిపిస్తుంది. ముఖ్యంగా సెకండాఫ్ ని ఎన్నో సూపర్ హిట్ సినిమాల రొటీన్ ఫార్మాట్ లోకి తీసుకువచ్చేసాడు. దాంతో కథ అంతా ఊహాజనితంగా సాగుతుంది. సెకండాఫ్ ని డైరెక్టర్ చాలా సూపర్ హిట్ సినిమాల ఫార్మాట్ లోనే డీల్ చేసాడు. అందుకే చాలా రెగ్యులర్ గా అనిపిస్తుంది. అలాగే ఎంటర్టైన్మెంట్ పరంగా ఫస్ట్ హాఫ్ బెటర్ గానూ సెకండాఫ్ కాస్త తక్కువగానూ అనిపిస్తుంది. ఈ సినిమాకి టైట్ స్క్రీన్ ప్లే రాలేకపోయింది. దాంతో అక్కడక్కడా కాస్త బోరింగ్ గా ఉంటుంది. అలాగే పాటలు కూడా సందర్భానుసారంగా కాకుండా సినిమాకి స్పీడ్ బ్రేకర్స్ లా మారాయి. జయప్రకాశ్ రెడ్డి – రఘుబాబులతో క్రియేట్ చేసిన ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ కామెడీ సినిమాలో పెద్దగా వర్క్ అవుట్ అవ్వలేదు.

సాంకేతిక విభాగం :

ఈ సినిమా స్టొరీ లైన్ వినడానికి బాగానే వున్నా.. అనుకున్న స్థాయిలో పూర్తి కథని డెవలప్ చేయలేదు. సాయి కిషోర్ నేరేషన్, స్క్రీన్ ప్లే పై ఇంకాస్త వర్క్ అవుట్ చెయ్యాల్సింది. కానీ డైరెక్టర్ గా మాత్రం మంచి పేరు తెచ్చుకున్నాడు. అందరి నుంచీ మంచి నటనని రాబట్టుకోవడమే కాకుండా చాలా ఫన్నీ ఎపిసోడ్స్ ని బాగా తీసాడు. సాయి కార్తీక్ అందించిన పాటల్లో ఒక రెండు బాగుంటే మిగతావి అన్నీ సోసోగా ఉన్నాయి. రీ రికార్డింగ్ మాత్రం ఈ మూవీకి బాగానే సూట్ అయ్యింది. దాము నర్రావు సినిమాటోగ్రఫీ చాలా ప్లెజంట్ అండ్ కలర్ఫుల్ గా ఉంది. ఎంఆర్ వర్మ ఎడిటింగ్ ఓకే, కానీ చెప్పాలంటే దీనికన్నా బాగా కూడా ఎడిట్ చేయచ్చు. శ్రీధర్ సీపాన డైలాగ్స్ లో పంచ్ లు ఎక్కువ అయిపోయాయి, అందుకే సగం పర్ఫెక్ట్ గా పేలితే సగం పర్ఫెక్ట్ గా పేలలేదు. విజయ్ యాక్షన్ ఎపిసోడ్స్ కొన్ని చోట్ల బాగా ఎక్కువ అనిపిస్తాయి, కొన్ని చోట్ల ఓకే డీసెంట్ అనే ఫీలింగ్ ని కలిగిస్తాయి. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పై రామబ్రహ్మం సుంకర నిర్మాణ విలువలు మాత్రం బాగా రిచ్ గా ఉన్నాయి.

తీర్పు :

‘జేమ్స్ బాండ్’ : రెగ్యులర్ కామెడీ ఎంటర్టైనర్స్ కోరుకునే వారికి నచ్చే సినిమా.