The Full telugu review of kerintha movie | producer dilraju | tollywood | sri divya

Teluguwishesh కేరింత కేరింత kerintha movie review producer dilraju sridivya : The Full telugu review of kerintha movie which is produced by top producer dilraju. In this movie youth actors acted. Product #: 65124 2.5 stars, based on 1 reviews
  • చిత్రం  :

    కేరింత

  • బ్యానర్  :

    శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్

  • దర్శకుడు  :

    సాయికిరణ్ అడవి

  • నిర్మాత  :

    దిల్ రాజు

  • సంగీతం  :

    మిక్కీ జే మేయర్

  • సినిమా రేటింగ్  :

    2.52.5  2.5

  • నటినటులు  :

    సుమంత్ అశ్విన్, శ్రీదివ్య, తేజస్వీ తదితరులు

Kerintha Movie Review Producer Dilraju Sridivya

విడుదల తేది :

2015-06-12

Cinema Story

జై (సుమంత్ అశ్విన్) అనే యువకుడు తాను సంతోషంగా ఉంటూ అందరినీ సంతోషంగా ఉంచాలనుకునే వ్యక్తిత్వం కలవాడు. సిద్ధు (విశ్వనాథ్), నూకరాజు (పార్వతీశం), ప్రియ (తేజస్విని), భావన (సుకృతి) అతని బెస్ట్ ఫ్రెండ్స్. సాధారణంగా సాగిపోయే వారి జీవితాల్లో ప్రేమ అనే ఫీలింగ్ ఓ అందమైన కేరింతకు జీవం పోస్తుంది. జై, తొలిచూపులోనే మనస్వి (శ్రీ దివ్య)ని ప్రేమిస్తాడు. ప్రతీ పనినీ భయపడుతూ బతికే సిద్దూ.. అలాంటి పరిస్థితుల్లోనే ప్రియను ప్రేమిస్తాడు. తన గమ్యమేంటో తెలియని నూకరాజు, భావన ద్వారా తన గమ్యాన్ని తెలుసుకుంటాడు. ఆ తర్వాత భావనపై తనకున్నది ప్రేమ అని తెలుసుకుంటాడు. ఈ విధంగా ఒకరిమీద మరొకరికి పుట్టే ఈ ప్రేమకథలన్నీ చివరికి ఎక్కడికి చేరాయి? వారి ప్రేమ నిజంగానే కేరింతలు కొట్టిందా? చివరికీ ఏమవుతుంది..? అన్నది సినిమా కథ.

cinima-reviews
కేరింత

ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన చిన్న బడ్జెట్ చిత్రం ‘కేరింత’. అందరూ కొత్త వాళ్లతో యూత్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రానికి సాయికిరణ్ అడవి దర్శకత్వం వహించారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో ఇటీవలే విడుదలై మంచి స్పందనను సొంతం చేసుకుంది. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో సుమంత్ అశ్విన్, శ్రీదివ్య, తేజస్వీలతో పాటు మరో ముగ్గురు కొత్తవాళ్లు ప్రధాన పాత్రలలో నటించారు. జూన్ 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం.. యూత్ ని ఏ విధంగా ‘కేరింత’ పెట్టించిందో చూద్దామా..

Cinema Review

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్.. ‘ప్రేమకథల్లోని ఎమోషన్‌’! వాటిని సినిమాటిగ్గా కాకుండా చాలా సహజంగా తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. ఒకరితో ఒకరికి సంబంధమున్న ఆరుగురి జీవితాల్లో వచ్చే మార్పే ఓ సినిమా కథగా ప్రేక్షకుడికి కనెక్ట్ చేయడంలో స్క్రీన్‌ప్లేలోని కొన్ని అంశాలు ప్లస్‌పాయింట్స్‌గా నిలుస్తాయి.

ఇక నటీనటుల విషయానికొస్తే.. సుమంత్ అశ్విన్, శ్రీ దివ్య, తేజస్విని, సుకృతి, విశ్వనాథ్, పార్వతీశం ఇలా అందరూ తమతమ పాత్రల్లో బాగానే ఒదిగిపోయారు. ఒక్కో పాత్రకూ ఒక్కో మూడ్ ఉండడం, ఆ మూడ్‌ను ఎవ్వరికి వారుగా సరిగ్గా పట్టుకోవడంతో సినిమా చూస్తున్నంతసేపు ఆ పాత్రలే కనిపిస్తాయి. సుమంత్, శ్రీదివ్య, తేజస్విని మినహా మిగతా ముగ్గురూ కొత్తవారైన చాలా బాగా చేశారు.

సినిమా పరంగా చూస్తే.. ఫస్టాఫ్‌లో పాత్రల పరిచయం, వారి జీవితాల్లో ప్రేమ అనే ఫీలింగ్ కలగడం, ప్రేమను వ్యక్తపరిచే లోపు విడిపోవడం ఇలా రకరకాల ఎమోషన్స్‌తో హాయిగా సాగిపోతుంది. సెకండాఫ్‌లో కొంత బరువైన సన్నివేశాలతో సినిమా ఎమోషనల్‌గా సాగిపోతుంది. ఓవరాల్‌గా ఫస్టాఫ్ మేజర్ ప్లస్‌పాయింట్ అని చెప్పవచ్చు.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మేజర్ మైనస్ పాయింట్.. ఫన్ చాలా తక్కువగా వుండటం! ప్రతి విషయాన్నీ ప్రాక్టికల్‌గా చెప్పాలనే ప్రయత్నంలో ఫన్‌ను వదిలేసినట్టు కనిపిస్తుంది. ఎమోషనల్‌గా సాగే ఇలాంటి సినిమాను బలమైన సన్నివేశాలతో పాటు కొంత ఫన్‌ను జతకలిపి వుంటే బాగుండేది. ఈ కథలో చెప్పుకోడానికి చాలా అంశాలే ఉన్నా, స్క్రీన్‌ప్లేలో వాటన్నింటినీ ఆసక్తికరంగా కాకుండా సాదాసీదాగా నడిపించేశారు. సెకండాఫ్‌ మొదలైన తర్వాత ఇరవై నిమిషాల పాటు సినిమా వేగం మందగించడం మరో మైనస్ పాయింట్. సెకండాఫ్‌లో వచ్చే బరువైన ఎమోషనల్ సన్నివేశాలను మరీ ప్రాక్టికల్‌గా చెప్పడం ఫార్ములా సినిమాలను ఇష్టపడే వారికి పెద్దగా రుచించదు.


సాంకేతిక విభాగం :

ముందుగా దర్శకుడు సాయికిరణ్ అడవి గురించి చెప్పుకుంటే.. సినిమాలోని ఎమోషన్‌ను మిస్ చేయకుండా చూశారు. సాధారణ కథను, అంతే సాధారణమైన స్క్రీన్‌ప్లేతో తెరకెక్కించారు. ముందే తెలిసిన కథను, ముందే అర్థం చేసుకోగల సన్నివేశాలను తాను చెప్పాలనుకున్న కోణంలో చెప్పడంలో దర్శకుడిగా ఆయన నూటికి నూరు శాతం విజయం సాధించారు.

మిక్కీ జే మేయర్ అందించిన సంగీతం సినిమాకు మంచి మూడ్‌ను తెచ్చిపెట్టింది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మిక్కీ స్టైల్లో సాగిపోతుంది. విజయ్ చక్రవర్తి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సినిమాలోని బేసిక్ ఎమోషన్‌ను సినిమాటోగ్రాఫర్ సరిగ్గా క్యాప్చర్ చేయగలిగారు. ఎడిటింగ్ ఫర్వాలేదనిపించేలా ఉంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ చాలా బాగున్నాయి.

చివరగా :

కేరింత : యూత్ ని ఆకర్షించే ‘ప్రేమకథ’ల చిత్రం!