Dongaata Movie Review | Manchu Lakshmi Updates

Teluguwishesh దొంగాట దొంగాట Get information about Dongaata Telugu Movie Review, Dongaata Movie Review, Manchu Lakshmi Dongaata Movie Review, Dongaata Movie Review And Rating, Dongaata Telugu Movie Talk, Dongaata Telugu Movie Trailer, Lakshmi Manchu Dongaata Review, Dongaata Telugu Movie Gallery and more Product #: 63537 2.75 stars, based on 1 reviews
  • చిత్రం  :

    దొంగాట

  • బ్యానర్  :

    మంచు ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లిమిటెడ్

  • దర్శకుడు  :

    వంశీకృష్ణ

  • నిర్మాత  :

    మంచు లక్ష్మీ

  • సంగీతం  :

    సాయి కార్తీక్, సత్య మహవీర్, రఘు కుంచె

  • సినిమా రేటింగ్  :

    2.752.75  2.75

  • నటినటులు  :

    మంచు లక్ష్మీ, అడవి శేష్, మధు, ప్రభాకర్, బ్రహ్మానందం తదితరులు

Dongaata Movie Review
Cinema Story

‘దొంగాట’ థియేటర్ ట్రైలర్ లోనే ఈ మూవీ కథ ఎలా వుండబోతుందో చెప్పేసారు. ముగ్గురు వ్యక్తులు (అడవి శేష్, మధు, ప్రభాకర్) కలిసి ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి, డబ్బు సంపాదించాలనుకుంటారు. ఈ క్రమంలోనే వాళ్లు ముగ్గురు శృతి(మంచులక్ష్మీ) అనే హీరోయిన్ ను కిడ్నాప్ చేస్తారు. కిడ్నాప్ తర్వాత తమకు 10 కోట్లు కావాలంటూ శృతి తల్లికి ఫోన్ చేసి బెదిరిస్తారు. ఇక అక్కడ నుంచి ఏం జరిగింది? అనేదే కథ. ఆ తర్వాత స్టోరీ కావాలంటే థియేటర్లో సినిమా చూడాల్సిందే!

cinima-reviews
దొంగాట

మంచు లక్ష్మీ, అడవి శేష్, మధు, ప్రభాకర్ ప్రధాన పాత్రలలో నటించిన తాజా చిత్రం ‘దొంగాట’. వంశీకృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని విద్యానిర్వాణ సమర్పణలో మంచు ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లిమిటెడ్ పతాకంపై మంచులక్ష్మీ స్వయంగా నిర్మించారు. ప్రపంచ వ్యాప్తంగా మే 8వ తేదీన ఘనంగా విడుదల అయిన ఈ చిత్రం.. ఎలా వుందో ఒకసారి చూద్దామా!

Cinema Review

ప్లస్ పాయింట్స్:

ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ మంచులక్ష్మీ. ఆమె ఇప్పటివరకు చేయని పాత్రను ఇందులో చేసింది. చాలా డీసెంట్ పర్ఫార్మెన్స్ తో తన పాత్రకు సరైన న్యాయం చేసింది. ఇంట్రడక్షన్ లో చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ లో మంచు లక్ష్మీ చాలా హాట్ గా కనిపించింది. సరదాగా సాగిపోయే ఈ కామెడీ ఎంటర్ టైనర్ చిత్రంలో మంచులక్ష్మీ తన నటనతో ‘దొంగాట’కు పూర్తి న్యాయం చేసిందనే చెప్పుకోవచ్చు.

ఇక కిడ్నాపర్లుగా నటించిన అడవి శేష్, మధు, ప్రభాకర్ లు వారి వారి పాత్రలకు పూర్తి న్యాయం చేసారు. వారి కామెడీ టైమింగ్ బాగుంది. ఇక బ్రహ్మానందం వచ్చాక సినిమాకు మరింత ఊపొస్తుంది. ‘దొంగాట’ సినిమాలో ట్విస్టులు బాగా వర్కౌట్ అయ్యేలా వుంది. క్లైమాక్స్ చివరి 20 నిమిషాలు ఇంకా బాగుంది. పూర్తి వినోదాత్మక చిత్రంగా ‘దొంగాట’ అదరగొట్టేసింది.

మైనస్ పాయింట్స్:

ఫస్ట్ హాఫ్ లో కొన్ని సన్నీవేశాలు బోర్ కొడతాయి. అలాగే అక్కడక్కడ లాజిక్ లేని కొన్ని కామెడీ సీన్లు చిరాకు తెప్పిస్తాయి. ఫస్ట్ హాఫ్ లో మరింత ఎడిటింగ్ చేసుంటే బాగుండేది. భారీగా చెప్పుకోనంతగా మైనస్ పాయింట్స్ ఏం లేవు.

సాంకేతికవర్గ పనితీరు:

సాంకేతిక వర్గం గురించి చెప్పుకోవాలంటే.. తక్కువ బడ్జెట్ తోనే మంచు లక్ష్మీ చాలా క్వాలీటి చిత్రాన్ని నిర్మించింది. ఎక్కడ రాజీపడకుండా చాలా గ్రాండ్ గా నిర్మించారు. ఇక దర్శకుడిగా వంశీకృష్ణ పూర్తిగా సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. సింపుల్ అండ్ బ్యూటీఫుల్ కథ, కథనంతో తెరకెక్కించాడు. ఎక్కడెక్కడ ప్రేక్షకులను థ్రిల్ చేయాలో చాలా చక్కగా తీర్చిదిద్దాడు.

ఇక సినిమాటోగ్రఫి చాలా బాగుంది. ముఖ్యంగా పబ్ సాంగ్ చిత్రీకరణ సూపర్బ్. ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు అందించిన సంగీతం బాగున్నాయి. కానీ ఎడిటింగ్ డిపార్ట్ మెంట్ ఎడిటర్ మరింత కాస్త జాగ్రత్తలు తీసుకొని వుంటే ఇంకా బాగుండేది.

చివరగా:
దొంగాట: కామెడీ ఎంటర్ టైనర్ తో ఈ ఆట బాగానే అదరగొట్టేసింది.