Rey Movie | Sai Dharam Tej | YVS Choudhury | Shraddha Das

Teluguwishesh రేయ్ రేయ్ Get information about Rey Telugu Movie Review, Rey Movie Review, YVS Chowdary Rey Movie Review, Rey Movie Review And Rating, Rey Telugu Movie Talk, Rey Telugu Movie Teaser, Rey Telugu Movie Trailer, Rey Telugu Movie Gallery and more Product #: 62214 2.5 stars, based on 1 reviews
  • చిత్రం  :

    రేయ్

  • బ్యానర్  :

    బొమ్మరిల్లు

  • దర్శకుడు  :

    వైవియస్ చౌదరి

  • నిర్మాత  :

    వైవియస్ చౌదరి

  • సంగీతం  :

    చక్రి

  • సినిమా రేటింగ్  :

    2.52.5  2.5

  • ఛాయాగ్రహణం  :

    గుణశేఖరన్

  • ఎడిటర్  :

    కోటగిరి వెంకటేశ్వర రావు

  • నటినటులు  :

    సాయిధరమ్ తేజ, శ్రద్ధాదాస్, సయామీ ఖేర్, ఆలీ తదితరులు

Rey Movie Telugu Review

విడుదల తేది :

2015-03-27

Cinema Story

రెండుసార్లు ‘బెస్ట్ ఆఫ్ ది వరల్డ్’ టైటిల్ గెలుచుకున్న మెక్సికన్ పాప్ సింగర్ జెన్న(శ్రద్ధాదాస్).. మూడోసారి ఆ టైటిల్ పొందాలని ప్రయత్నాలు చేస్తుంది. ఇదే సమయంలో అమృత(సయామీ ఖేర్) కూడా ఇండియా నుంచి ఎలాగైనా ‘బెస్ట్ ఆఫ్ వరల్డ్’ కాంపిటీషన్ లో పాల్గొని టైటిల్ గెలుచుకోవాలనే కోరికతో.. జమైకాలోని బాబ్ మార్లీ కాలేజ్ లో చేరుతుంది. అక్కడే రాకెట్ అలియాస్ రాక్(సాయిధరమ్ తేజ్) చదువుతుంటాడు. కెరీర్ గురించి పట్టించుకోకుండా అమ్మాయిల వెంట పడుతూవుండే రాక్... తొలిచూపులోనే అమృతతో ప్రేమలో పడిపోతాడు.

కానీ అనుకోని కొన్ని సంఘటనల వలన రాక్ తో కలిసి ‘బెస్ట్ ఆఫ్ వరల్డ్’ కాంపిటీషన్ లో అమృత పాల్గొంటుంది. ఇక అక్కడి నుంచి రాక్ గ్రూప్ ను అడ్డుకోవడానికి జెన్న తెగ ప్రయత్నాలు చేస్తూ వుంటుంది. మరి జెన్న వాళ్లను అడ్డుకుంటుందా..? అసలు జెన్న ఎందుకు అడ్డుకోవాలని అనుకుంది? జెన్న ప్రయత్నాలను రాక్ ఎలా ఎటాక్ చేసాడు? చివరకు ‘బెస్ట్ ఆఫ్ వరల్డ్’ ఎవరు అయ్యారు? అనే విషయాలు తెలియాలంటే ‘రేయ్’ సినిమాను వెండితెరపై చూడాల్సిందే!

cinima-reviews
రేయ్

ప్రముఖ దర్శకుడు వైవియస్ చౌదరి స్వీయ దర్శకనిర్మాణంలో తెరకెక్కిన చిత్రం ‘రేయ్’. సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన మొదటి చిత్రమిది. సయామీ ఖేర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో శ్రద్ధాదాస్ నెగెటివ్ హాట్ పాత్రలో నటించింది. చక్రి సంగీతం అందించిన పాటలకు మంచి స్పందన వచ్చింది. ఇటీవలే విడుదలైన ట్రైలర్ లకు మంచి స్పందన వస్తోంది. అలాగే పవనిజం పేరుతో ఓ పాటను స్పెషల్ గా రూపొందించారు. గతకొద్ది కాలంగా విడుదల కాకుండా వాయిదాలు పడుతూ, ఎన్నో అడ్డంకులను దాటుకొని చివరకు ప్రేక్షకుల ముందుకు ఈరోజు (ఈనెల 27)న వచ్చింది. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో, దర్శకుడికి, హీరోకి ఎలాంటి పేరు తెచ్చిపెట్టనుందో చూడాలి.

Cinema Review

ప్లస్ పాయింట్స్:

ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ సాయిధరమ్ తేజ డాన్సులు, ఫైట్లు, సయామీ, శ్రద్ధాల అందచందాలు. ఈ సినిమాలో సాయిధరమ్ నటన పర్వాలేదు. కానీ డాన్సులు, ఫైట్లు మాత్రం దుమ్మురేపేసాడు. కొన్ని కొన్ని సన్నీవేశాలలో ఇరగదీసేసాడు. ఇక హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సయామీ ఖేర్.. నటనతోపాటు తన గ్లామర్, అందచందాలతో అదరగొట్టింది.

అలాగే నెగెటివ్ పాత్రలో నటించిన శ్రద్ధాదాస్ నటిగా మంచి మార్కులే కొట్టేసింది. తన హాట్ హాట్ అందాలతో పిచ్చెక్కించేసింది. కానీ వైవియస్ ఓవర్ డోస్ వల్ల... పావలా యాక్టింగ్ కు రూపాయి యాక్టింగ్ చేయడంతో మరీ దారుణంగా అనిపించింది. డాన్ రోల్ చేసిన అర్పిత్ రాంఖా పర్వాలేదు. ఇక ఆలీ, వేణుమాధవ్ వంటి కొంతమంది కామెడీ బ్యాచ్ కామెడీ మరీ చిరాకు తెప్పిస్తాయి. ఇక సీనియర్ నరేష్, తనికెళ్ళ భరణి, హేమలతోపాటు తదితర నటీనటులు వారి వారి పాత్రలకు న్యాయం చేసారు.

మైనస్ పాయింట్స్:

ఈ సినిమాలో సాయిధరమ్ తేజ యాక్టింగ్ మరీ దారుణం. ఎలాంటి ఎక్స్ ప్రెషన్స్ లేకుండా అన్నిటికి ఒకే హవాభావాలు పలికేసాడు. అతను చేసిన డాన్సులు, ఫైట్లు తప్ప మిగతాదంతా అతనిలో మైనస్ అనే చెప్పుకోవచ్చు. ఇక హీరోయిన్ సయామీ ఖేర్ గ్లామర్ పరంగా తప్ప మరో ప్లస్ పాయింట్ లేదు. ఈ సినిమాలో సయామీ పాత్ర హీరోయిన్ లా కాకుండా మగరాయుడిలాగే కనిపిస్తూ వుంటుంది.

సాంకేతిక వర్గం:

ఈ సినిమాకు సినిమాటోగ్రఫి, కొరియోగ్రఫిలను ప్లస్ పాయింట్స్ గా చెప్పుకోవచ్చు. గుణశేఖరన్ అందించిన సినిమాటోగ్రఫి చాలా బాగుంది. ప్రతి ఫ్రేం చాలా గ్రాండ్ గా వున్నాయి. ఇక రాజు సుందరం, ప్రేమ్ రక్షిత్, జానీ, భానుల కొరియోగ్రఫీ సూపర్బ్. ఇక నిర్మాణ విలువలు కూడా చాలా రిచ్ గా వున్నాయి.

ఇక కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం మూడు భారీ మైనస్. వైవియస్ చౌదరి తాను చెప్పాలనుకున్న కథను సినిమా ప్రారంభమైన 15నిమిషాల్లోనే చెప్పేయడంతో.. ఆ తర్వాత ఏం జరుగనుందో ప్రేక్షకులు ఈజీగా చెప్పేయగలరు. పావలా నటనకు ఓవర్ డోస్ జోడించడంతో... సినిమా బాగా బోర్ కొట్టేస్తుంది. ఏ ఒక్క పాత్రకు కూడా లాజిక్ లేదు. ఇక కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ మరీ దారుణం. 2 గంటల సినిమాను మరీ సాగదీసేసారు. ఎడిటింగ్ లో చాలా జాగ్రత్తగా వుండుంటే సినిమా మరింత బాగుండేది. ఇక చక్రి సంగీతం పర్వాలేదు.

చివరగా:
రేయ్: డోస్ వుంది కానీ.. లాజిక్ లేదు!