Teluguwishesh భమ్ బోలేనాథ్ భమ్ బోలేనాథ్ Get information about Bham Bolenath Telugu Movie Review, Bham Bolenath Movie Review, Naveen chandra Bham Bolenath Movie Review, Bham Bolenath Movie Review And Rating, Bham Bolenath Telugu Movie Talk, Bham Bolenath Telugu Movie Teaser, Bham Bolenath Telugu Movie Trailer, Bham Bolenath Telugu Movie Gallery and more only on TeluguWishesh.com Product #: 61312 2.5 stars, based on 1 reviews
  • చిత్రం  :

    భమ్ బోలేనాథ్

  • బ్యానర్  :

    ఆర్.సి.సి.ఎంటర్ టైన్మెంట్స్

  • దర్శకుడు  :

    కార్తీక్ వర్మ దండు

  • నిర్మాత  :

    సిరువూరి రాజేష్ వర్మ

  • సంగీతం  :

    సాయి కార్తీక్

  • సినిమా రేటింగ్  :

    2.52.5  2.5

  • ఛాయాగ్రహణం  :

    భరణి.కె.ధరన్

  • ఎడిటర్  :

    ప్రవీణ్ పూడి

  • నటినటులు  :

    నవదీప్, ప్రదీప్, నవీన్ చంద్ర, ప్రాచీ, శ్రేయ, పోసాని కృష్ణమురళి తదితరులు

Bham Bolenath Movie Telugu Review

విడుదల తేది :

2015-02-27

Cinema Story

వివేక్ (నవదీప్) అనే అబ్బాయి ఉద్యోగం కోసం, తాను ప్రేమించిన అమ్మాయి ప్రేమను గెలిపించుకోవడం కోసం వసూల్ రాజా దగ్గర అప్పు చేస్తాడు. అయితే అనుకోకుండా ఆ డబ్బు పోవడంతో చేసేదేమీలేక ఏటియం చోరి చేద్దామనే ఆలోచనలో పడతాడు. అదే సమయంలో అనుకోకుండా అతనికి ఓ డాలర్స్ సంచి ఒకటి దొరుకుతుంది.

కట్ చేస్తే.. మరోవైపు చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ, వాటిని అమ్మేస్తూ వుండే వ్యక్తి కృష్ణ(నవీన్ చంద్ర). అనుకోకుండా వీరిద్దరు కలుస్తారు. వీరితో పాటు మరో ఇద్దరు కూడా కలుస్తారు. అసలు వీరందరూ ఎందుకు, ఎలా కలిసారు? వీరు కలిసి ఏం చేసారు? డబ్బు ఎలా సంపాదించారు? చివరకు ఏం జరిగింది? అనే విషయాలు తెలియాలంటే వెండితెర మీద చూడాల్సిందే.

cinima-reviews
భమ్ బోలేనాథ్

నవదీప్, ప్రదీప్, నవీన్ చంద్ర ప్రధాన పాత్రలలో నటించిన తాజా చిత్రం ‘భమ్ బోలేనాథ్’. ఆర్.సి.సి.ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్లో నిర్మాత శిరువూరి రాజేష్ వర్మ నిర్మించిన ఈ చిత్రానికి కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించారు. పూజ కథానాయిక. మూడు కథల సమూహారంగా, ముగ్గురు వ్యక్తుల భిన్న జీవితాలతో ఒకే లక్ష్యం కోసం వారు చేసే పోరాటం కథాంశంతో రూపొందిన ఈ చిత్రం 27-02-2015వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ఎలా వుందో ఒకసారి చూద్దామా!

Cinema Review

నవదీప్ లవర్ బాయ్ పాత్రలో బాగున్నాడు. నిరుద్యోగ వ్యక్తిగా చక్కగా నటించాడు. నవీన్ చంద్ర మాస్ పాత్రలో బాగున్నాడు. రఫ్ క్యారెక్టర్ లో అతను బాగా ఒదిగిపోయాడు. ఇక హైటెక్ యూత్ పాత్రలో ప్రదీప్ నటన బాగుంది. పోసాని కృష్ణమురళి అద్భుతమైన నటనతో సినిమాకు హైప్ తెచ్చారు. ఇక హీరోయిన్ పూజా గ్లామర్ పర్వాలేదు. ఇక మిగతా నటీనటులు వారి వారి పరిధి మేరకు పర్వాలేదనిపించారు.

ప్లస్ పాయింట్స్:

కథ, కథనం బాగుంది. కొన్ని కొన్ని సన్నీవేశాలు చాలా బాగున్నాయి. నవదీప్, నవీన్, చంద్రలు సినిమాకు చాలా ప్లస్ అయ్యారు. ప్రదీప్ నటన సూపర్బ్. ఈ చిత్రంలో డైలాగ్స్ బాగానే పేలాయి. ప్రవీణ్, నవీన్ లు, పోసాని, ఫిష్ వెంకట్ ల కామెడీ ఎపిసోడ్స్ ప్రేక్షకులను బాగానే నవ్విస్తాయి.

మైనస్ పాయింట్స్:

ఫస్ట్ హాఫ్ మొదటి 15 నిమిషాలు కాస్త బోర్ గా అనిపిస్తుంది. కథనంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. సెకండ్ హాఫ్ లో డాన్ పాత్ర వద్ద కొన్ని కొన్ని సన్నివేశాలు బోర్ కలిగిస్తూ వుంటాయి.

సాంకేతిక వర్గ పనితీరు:

సాయి కార్తీక్ అందించిన సంగీతం పర్వాలేదు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగా ప్లస్ అయ్యింది. భరణి సినిమాటోగ్రఫి చాలా బాగుంది. డైలాగ్స్ బాగున్నాయి. కామెడీ పంచ్ డైలాగ్ బాగా పేలాయి. ఎడిటర్ మరింత శ్రద్ధ తీసుకొని వుంటే బాగుండేది. కార్తీక్ వర్మ మొదటి సినిమాతో విజయం సాధించాడని చెప్పుకోవచ్చు. కానీ కథనంలో మరింత జాగ్రత్త తీసుకొని వుంటే బాగుండేది. ఇక నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరగా:
భమ్ బోలేనాథ్: ప్రేక్షకులను కవ్వింతలు పెట్టించే క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్