Teluguwishesh బందిపోటు బందిపోటు Bandipotu Movie Review Rating and Public Talk,Bandipotu Movie Review and Rating,Bandipotu Movie Review,Bandipotu Movie Review rating,Bandipotu Review rating, Bandipotu movie rating, Bandipotu rating, Bandipotu movie public talk, Bandipotu overall talk Product #: 61023 2 stars, based on 1 reviews
  • చిత్రం  :

    బందిపోటు

  • బ్యానర్  :

    ఇవివి సినిమా

  • దర్శకుడు  :

    మోహన కృష్ణ ఇంద్రగంటి

  • నిర్మాత  :

    రాజేష్ ఈదర

  • సంగీతం  :

    కళ్యాణ్ కోడూరి

  • సినిమా రేటింగ్  :

    22  2

  • ఛాయాగ్రహణం  :

    పిజి విందా

  • ఎడిటర్  :

    శ్రావణ్ కటికినేని

  • నటినటులు  :

    అల్లరి నరేష్, ఈషా, సప్తగిరి, సంపూర్ణేష్ బాబు, పోసాని కృష్ణమురళి తదితరులు

Bandipotu Movie Review Rating And Public Talk

విడుదల తేది :

2015-02-20

Cinema Story

విశ్వ(అల్లరి నరేష్) అనే అబ్బాయి చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ కాలం గడిపేస్తుంటారు. ఈ క్రమంలోనే అతనికి జాహ్నవి(ఈషా) అనే అమ్మాయితో అనుకోకుండా పరిచయం ఏర్పడుతుంది. అది కాస్త ప్రేమగా మారుతుంది. అయితే జాహ్నవి మాత్రం తన తండ్రిని మోసం చేసిన ముగ్గురిపై(తనికెళ్లభరణి, రావు రమేష్, పోసాని) ప్రతీకారం తీర్చుకోవాలని కసి పెంచుకుటుంది. అందుకు విశ్వ సహాకారం తీసుకునేందుకు ప్రయత్నిస్తుంది.

ఆ తర్వాత విశ్వ జీవితంలో కొన్ని అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. దీంతో అక్కడి నుంచి సీన్ పల్లెటూరికి మారుతుంది. మరి విశ్వ తన ప్రేయసి ప్రతీకారం తీర్చడంలో సహకారం అందిస్తాడా..? దొంగతనాలు చేసే విశ్వకు ఎటువంటి సమస్యలు ఎదురయ్యాయి. అసలు అతనికి జాహ్నవితో ఎలా పరిచయం ఏర్పడింది. జాహ్నవి ప్రేమను విశ్వ ఎలా దక్కించుకున్నాడు? అసలు పల్లెటూరికి వెళ్లాల్సిన అవసరం ఏముంది? ఇలాంటి అంశాలను తెలుసుకోవాలంటే వెండితెరపై ‘బందిపోటు’ సినిమా చూడాల్సిందే.

cinima-reviews
బందిపోటు

ఇవివి సినిమా బ్యానర్ పై అల్లరి నరేష్, ఈషా హీరో హీరోయిన్లుగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బందిపోటు’.. ఫిబ్రవరి 20వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చింది. ‘దొంగల్ని దోచుకో’ అనేది కాప్షన్. రాజేష్ ఈదర నిర్మించిన ఈ చిత్రానికి కల్యాణ్ కోడూరి సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదలై మంచి సక్సెస్ అయింది. ట్రైలర్ కి కూడా మంచి స్పందన వచ్చింది. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని U/A సర్టిఫికెట్ ను దక్కించుకుంది. గతకొంతకాలం నుంచి ఒక్క హిట్టు దక్కగా సతమతమవుతున్న నరేష్.. ఈ మూవీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.  మరి ఈ సినిమా అతనికి ఎలాంటి ఫలితాన్ని అందించనుందో చూద్దామా!

 

Cinema Review

ఈ సినిమాలో అల్లరి నరేష్ చాలా స్టైలిష్ గా కనిపించాడు. గత చిత్రాలతో పోల్చుకుంటే ఇందులో కాస్త కొత్తగా కనిపిస్తున్నాడు. ఇక నటన, కామెడీ టైమింగ్ లో నరేష్ చాలా మెరుగుపరుచుకున్నాడు. హీరోయిన్ ఈషా నటన చాలా బాగుంది. ఈషా చాలా అందంగా కనిపించడమే కాకుండా నటన పరంగా చాలా బాగా చేసింది. ఇక సంపూర్ణేష్ బాబు, సప్తగిరిల కామెడీ బాగుంది.

మకరందం(తనికెళ్లభరణి), శేషగిరి రావు(రావు రమేష్), బాలేబాబు(పోసాని)లు అదరగొట్టారు. తనికెళ్లభరణి తన నటనతోనే కాకుండా డైలాగ్స్ తో కూడా అదరగొట్టాడు. తనికెళ్లభరణి సహాయకుడిగా అవసరాల శ్రీనివాస్ నటన పర్వాలేదనిపించింది. వ్యాపారవేత్తగా రావురమేష్ ఎంట్రీ బాగుంది. బాలెబాబు పాత్రలో పోసాని నటన బాగుంది. శ్రద్దాదాస్ ఐటెం సాంగ్ పర్వాలేదు. మిగతా నటీనటులు వారి వారి పాత్రల మేరకు పర్వాలేదనిపించారు.

ప్లస్ పాయింట్స్:

ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అల్లరి నరేష్. మొత్తం సినిమాను తన భుజాలపై వేసుకొని నడిపించేసాడు. హీరోయిన్ ఈషా గ్లామర్ కూడా తోడయ్యింది. వీరిద్దరి కెమిస్ట్రీ కూడా స్క్రీన్ మీద చాలా బాగుంది. ఇక ఈ సినిమాకు డైలాగ్స్ చాలా బాగా పేలాయి. ముఖ్యంగా భరణి, నరేష్ ల డైలాగ్స్ చాలా బాగున్నాయి. పోసాని మరోసారి తన నటనతో అదరగొట్టాడు. విజువల్స్ పరంగా కొన్ని సన్నివేశాలు బాగున్నాయి. కథ పాతదే అయినప్పటికీ... కథనాన్ని కొంచెం కొత్తగా డిజైన్ చేసారు.

మైనస్ పాయింట్స్:

ఈ సినిమాకు పెద్ద మైనస్ పాయింట్ స్టోరీ, స్క్రీన్ ప్లే. కొన్ని కొన్ని సన్నివేశాలలో తరువాత వచ్చే సీన్ల గురించి ప్రేక్షకులు ముందుగానే చెప్పేయవచ్చు. సంపూర్ణేష్ బాబు, సప్తగిరిలను పూర్తిగా వాడుకోలేదు. కొన్ని కొన్ని సీన్లలో లాజిక్ లేకుండా మ్యాజిక్ చేసేసాడు. జనాలకు అర్ధం కాకుండా కేవలం హీరోయిజంతో కొన్ని కొన్ని సన్నీవేశాలను నడిపించేసాడు. ఫస్టాఫ్ ఎలాగోలా నడిచిపోతే.. సెకండ్ హాఫ్ మరీ సాగదీసినట్లుగా వుంటుంది.

సాంకేతిక వర్గ పనితీరు:

పిజి విందా సినిమాటోగ్రఫి బాగుంది. విజువల్స్ అన్ని గ్రాండ్ గా వున్నాయి. కళ్యాణి కోడూరి అందించిన పాటలు విజువల్స్ పరంగా పర్వాలేదనిపించాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఎడిటింగ్ లో మరింత జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. ఇక దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ కథను చాలా చక్కగా తెరకెక్కించాడు. కథ మాములే అయినా... కథనంలో చాలా జాగ్రత్తలు తీసుకొని, మరింత బాగా చేసి వుంటే బాగుండేది.

చివరగా:
బందిపోటు: డిఫరెంట్ ఎంటర్టైనర్ తో అల్లరోడు ఫర్వాలేదనిపించాడు.

Movie TRAILERS

బందిపోటు

play