Teluguwishesh పడ్డానండి ప్రేమలో మరి పడ్డానండి ప్రేమలో మరి Check Out Latest Varun Sandesh Telugu Paddanandi Premalo Mari Review and Ratings Directed by Mahesh Upputuri. Watch Latest Telugu Paddanandi Premalo Mari Trailers and Teasers, Paddanandi Premalo Mari Songs and Wallpapers. Starring Vithika and Music by Khuddur ar. Product #: 60848 1.5 stars, based on 1 reviews
  • చిత్రం  :

    పడ్డానండి ప్రేమలో మరి

  • బ్యానర్  :

    పంచజన్య మీడియా

  • దర్శకుడు  :

    మహేష్ ఉప్పుటూరి

  • నిర్మాత  :

    నల్లపాటి రామాచంద్ర ప్రసాద్

  • సంగీతం  :

    ఖుద్దూర్ ఎఆర్

  • సినిమా రేటింగ్  :

    1.5  1.5

  • ఛాయాగ్రహణం  :

    భరణి.కె.ధరణ్

  • ఎడిటర్  :

    ప్రవీణ్ పూడి

  • నటినటులు  :

    వరుణ్ సందేశ్, వితిక తదితరులు

Paddanandi Premalo Mari Movie Review

విడుదల తేది :

2015-02-14

Cinema Story

ఓ కాలేజ్ స్టూడెంట్ రామ్(వరుణ్ సందేశ్), శ్రావణి(వితికా)తో ప్రేమలో పడతాడు. కొన్ని రోజుల తర్వాత రామ్ ప్రేమను శ్రావణి అంగీకరిస్తుంది. కొంతకాలం ఇద్దరూ బాగానే వుంటారు కానీ..  తర్వాత కొన్ని మనస్పర్థల కారణంగా ఇద్దరూ విడిపోతారు.

అయితే వీరు విడిపోయిన తర్వాత లంకపతి(అరవింద్) అనే రౌడీ శ్రావణిపై కన్నేస్తాడు. ఆమెను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని, నిత్యం శ్రావణినే ఫాలో అవుతాడు. ఈ క్రమంలోనే శ్రావణిని లంకపతి కిడ్నాప్ చేస్తాడు. ఇక రామ్ ఈ లంకపతి నుంచి శ్రావణిని ఎలా కాపాడాడు? అసలు రామ్, శ్రావణిల మధ్య మనస్పర్థలు ఎలా వచ్చాయి? మరి చివరకు వీరిద్దరి ప్రేమ ఏమయ్యింది? అనే అంశాలు వెండితెర మీద చూడాల్సిందే.

cinima-reviews
పడ్డానండి ప్రేమలో మరి

వరుణ్ సందేశ్, వితికా జంటగా నటించిన తాజా చిత్రం ‘పడ్డానండి ప్రేమలో మరి’. మహేష్‌ ఉప్పుటూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నల్లపాటి రామచంద్ర ప్రసాద్‌ నిర్మించారు. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి సినిమా వరుణ్ కు ఎలాంటి విజయం అందించనుందో చూద్దామా!

Cinema Review

ప్లస్ పాయింట్స్:
రామ్ పాత్రలో వరుణ్ సందేశ్ బాగా నటించాడు. సినిమా అంతా తన భుజాలపై నడిపించాడు. నటన, డాన్స్, హవాభావాలు బాగా ఇంప్రూవ్ చేసాడు. తన పాత్రకు సరైన న్యాయం చేసాడు. వితికా తన పాత్రకు న్యాయం చేసింది. వరుణ్, వితికాల కెమిస్ట్రీ బాగుంది. లంకపతి పాత్రలో అరవింద్ నటన బాగుంది. తాగుబోతు రమేష్, వేణుల కామెడీ బాగుంది. పోసాని తన పాత్రకు సరైన న్యాయం చేసాడు.

మైనస్ పాయింట్స్:
ఈ సినిమాకు మేజర్ మైనస్ పాయింట్ కామెడి. సినిమాలో చాలా వరకు కామెడీ తగ్గింది. ఏదో అక్కడక్కడ కాస్త కామెడీగా అనిపించినప్పటికీ... కథలో కామెడీ సన్నివేశాలు ఉపయోగించుకునే అవకాశం వున్నా కూడా అలాగే తీసేసారు. ఇక పృధ్వీ నటన కొంచెం ఎక్కువయ్యింది. పాటలు అంతగా ఆకట్టుకోలేదు.

సాంకేతికవర్గ పనితీరు:
సినిమాటోగ్రఫి చాలా బాగుంది. విజువల్స్ పరంగా చాలా బాగా చూపించారు. సంగీతం పర్వాలేదు. పాటలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. స్ర్కీన్ ప్లే సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. సినిమాలో ట్విస్టులను బాగా రాసుకున్నారు. దర్శకుడు తాను అనుకున్న కథను స్ర్కీన్ ప్లే పరంగా బాగా చూపించాడు. ఎడిటింగ్ లో మరింత జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది.

చివరగా:
వరుణ్ ప్రేమలోపడ్డాడు కానీ.. ఫెయిల్ అయ్యాడు!