Teluguwishesh రఘువరన్ బి.టెక్ రఘువరన్ బి.టెక్ Get Raghuvaran B Tech Movie Review, Raghuvaran B Tech Telugu Movie Review, Raghuvaran B Tech Movie Ratings, Dhanush Raghuvaran B Tech Movie Review, Amala Paul Raghuvaran B Tech Movie Review. Know Raghuvaran B Tech Movie Updates. Product #: 59512 3.5 stars, based on 1 reviews
  • చిత్రం  :

    రఘువరన్ బి.టెక్

  • బ్యానర్  :

    శ్రీ స్రవంతి మూవీస్

  • దర్శకుడు  :

    వేళ్ రాజ్

  • నిర్మాత  :

    స్రవంతి రవికిశోర్

  • సంగీతం  :

    అనిరుధ్ రవి చందర్

  • సినిమా రేటింగ్  :

    3.53.53.5  3.5

  • ఛాయాగ్రహణం  :

    వేళ్ రాజ్

  • ఎడిటర్  :

    ఎం.వి. రాజేష్ కుమార్

  • నటినటులు  :

    ధనుష్ (హీరో), అమలా పాల్ ( హీరోయిన్), సురభి, శరణ్య పొనవన్నన్, వివేక్ తదితరులు

Raghuvaran B Tech Movie Review

విడుదల తేది :

2015-01-01

Cinema Story

రఘువరన్ (ధనుష్) బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఖాళీగా ఉంటాడు. వేల రూపాయల జీతాలిచ్చే ఉద్యోగాల ఆఫర్లు వస్తున్నా చదివింది సివిల్ ఇంజనీరింగ్ కాబట్టి, అందుకు సంబంధించిన ఉద్యోగమే చేయాలనుకుంటాడు. తనకంటే చిన్నవాడైన తమ్ముడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా లక్షల రూపాయలు సంపాదిస్తుండగా అన్నయ్య ఖాళీగా ఉంటాడు. రఘు సమయం వృధా చేస్తున్నాడని తల్లితండ్రులు రోజూ తిడుతుంటారు. ఇవేవి పెద్దగా పట్టించుకోకుండా జాలీగా లైఫ్ ను లీడ్ చే్సుకుంటూ వస్తుంటాడు. పక్కింట్లో ఉండే శాలిని (అమలాపాల్) మొదట్లో రఘు పనికిరాని వాడుగా భావించినా.., అతడి గురించి తెలుసుకుని ప్రేమలో పడుతుంది.

ఇలా రోజూ ఇంట్లో తిట్లు, ఆఫీసుల చుట్టూ ఇంటర్వ్వూల కోసం తిరుగుతూ, అప్పుడప్పుడూ శాలినీతో సరదాగా గడిపే రఘువరన్ జీవితంలో తల్లి మరణం తీరన లోటును మిగులుస్తుంది. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఇంజనీర్ గా మారి, పెద్ద ప్రాజెక్టును చేపడుతాడు. అక్కడ కూడా చాలా ఇబ్బందులు వస్తాయి. అలా వచ్చిన ఇబ్చందులతో ప్రాజెక్టుకు ఏమవుతుంది.., ఎవరు సమస్యలు సృష్టిస్తారు. రఘువరన్ తల్లి ఎలా చనిపోతుందనే కథ తెలుసుకోవాలంటే థియేటర్ కు వెళ్ళి సినిమా చూడండి.

cinima-reviews
రఘువరన్ బి.టెక్

తమిళ హీరో ధనుష్ లేటెస్ట్ మూవీ ‘వేలై ఇళ్ళ పట్టదారి’ డబ్బింగ్ వర్షన్ తెలుగులో విడుదల అయింది. తమిళనాట సూపర్ హిట్ అయిన ఈ సినిమా, న్యూ ఇయర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘వై దిస్ కొలవరి’ పాటతో దేశ వ్యాప్తంగా క్రేజ్ పొందిన ధనుష్ కు తెలుగులో కూడా మంచి పేరుంది. తెలుగు సినిమాలు చేయకపోయినా.., ఆయనకు గుడ్ విల్ బాగుండటంతో పాటు, సినిమాకు మంచి టాక్ రావటంతో స్రవంతి రవికిశోర్ తెలుగులో విడుదల చేశారు. అమలాపాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ మీకోసం అందిస్తున్నాం.

ప్లస్ పాయింట్స్ :

ఈ మూవీకి పెద్ద ప్లస్ పాయింట్ ధనుష్.. మూవీలో హీరో నటన అద్బుతంగా ఉంది. సింపుల్ గా, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వ్యక్తిగా బాగా సూట్ అయ్యాడు. ధనుష్ కామెడి, ఫైట్స్, డైలాగ్ డెలివరీ, డాన్స్ అన్నీ సూపర్ గా ఉన్నాయి. యువత, తల్లితండ్రులు, బిజెనెస్ మెన్లు ఇలా అన్ని వర్గాల వారికి పంచ్ తో కూడిన సందేశం అందించాడు. హీరోయిన్ విషయానికి వస్తే తనకు ఇచ్చిన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. ధనుష్ తల్లిగా శరణ్య యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఒకే సమయంలో కొడుకుపై ప్రేమను, భర్త పట్ల గౌరవాన్ని చూపించే సీన్లలో చాలా బాగా నటించింది. విలన్ అమితాష్ సహా మిగతా క్యారెక్టర్లలో నటించిన వారు కూడా పాత్రలకు న్యాయం చేశారు.

ఇక మూవీ స్ర్కీన్ ప్లే కూడా ప్లస్ పాయింటే. సినిమా మొదలయినప్పటినుంచి చివరి వరకు ఎక్కడా  ప్రేక్షకులు బోర్ ఫీల్ అవ్వరు. నాన్ స్టాప్ కామెడి, పంచ్ డైలాగులతో మూవీ నింపేశారు. వాస్తవానికి దగ్గరగా ఉండే కధ కావటంతో ప్రతి ఒక్కరికీ త్వరగా కనెక్ట్ అవుతుంది. డైలాగుల కోసం వల్గారిటీని వాడుకోకపోవటంతో, ఫ్యామిలీ అంతా కలిసి చూసేందుకు అవకాశం ఏర్పడింది.

మైనస్ పాయింట్స్ :

హీరోను హైలైట్ చేయటం, మెసేజ్ ఇవ్వాలనే కాన్సెప్టుతో సినిమా ఉండటంతో హీరోయిన్ పాత్రకు తగిన న్యాయం జరగలేదు. ధనుష్, అమలాపాల్ ప్రేమను ఇంట్లో ఒప్పుకుంటారా లేదా అనేది చూపించలేదు. కామెడి కూడా ధనుష్ ఉన్న సీన్లలోనే సూపర్ గా ఉంది. విలన్ సహా మిగతా ఆర్టిస్టులను పూర్తిగా వాడుకోలేదు.

Cinema Review

మంచి ఉద్దేశ్యం కోసం అంతా చాలా బాగా కష్టపడ్డారని సినిమా చూస్తే తెలుస్తుంది. కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వ బాధ్యతలు చూసుకున్న వేల్ రాజ్ ఎక్కడా తేడా రాకుండా సినిమాను తెరకెక్కించాడు. తాను ఏం చూపాలనుకున్నాడో, ప్రేక్షకులు సినమా నుంచి ఏమి కోరుకుంటున్నారో క్లియర్ గా చూపించాడు. సినిమాటోగ్రాఫర్ కూడా వేల్ రాజ్ కావటంతో, తాను అనుకున్న, ఊహించిన సీన్లను చాలా నీట్ గా తీశాడు. సీన్లన్నీ న్యాచురాలిటీకి దగ్గరగా కన్పిస్తాయి. స్ర్కీన్ లుక్ డల్ గా ఉన్నా., లొకేషన్ వల్ల లోపం కన్పించలేదు. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ మంచి ట్యూన్లు అందించాడు. తెలుగులో పాటలు పర్వాలేదు, కానీ తమిళంలో మాత్రం సూపర్ హిట్ అయ్యాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ క్వాలిటీ చాలా బాగుంది. కిషోర్ డైలాగులు కూడా బాగున్నాయి. స్రవంతి రవికిషోర్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరగా : ఆల్ ఈజ్ వెల్, ఆల్ హ్యాస్ టు సీ.

Movie TRAILERS

రఘువరన్ బి.టెక్

play