Teluguwishesh మన కుర్రాళ్ళే మన కుర్రాళ్ళే Get Mana Kurralle Movie Review, Mana Kurralle Telugu Movie Review, Mana Kurralle Movie Ratings, Arvind Krishna Mana Kurralle Movie Review, Mana Kurralle Movie Review. Know Mana Kurralle Movie Updates. Product #: 59511 1.75 stars, based on 1 reviews
  • చిత్రం  :

    మన కుర్రాళ్ళే

  • బ్యానర్  :

    వీర శంకర్ సిల్వర్ స్ర్కీన్స్

  • దర్శకుడు  :

    వీర శంకర్

  • నిర్మాత  :

    బీవీఎస్ శ్రీనివాస్

  • సంగీతం  :

    రాజ్

  • సినిమా రేటింగ్  :

    1.75  1.75

  • ఛాయాగ్రహణం  :

    ముజీర్ మాలిక్

  • ఎడిటర్  :

    బస్వ పైడి రెడ్డి

  • నటినటులు  :

    అర్వింద్ కృష్ణ, రాజ్ కళ్యాణ్, రచనా మల్హోత్రా, శృతిరాజ్, రావు రమేష్, కృష్ణుడు తదితరులు

Mana Kurralle Movie Review

విడుదల తేది :

2015-01-01

Cinema Story

పల్లెటూరి నుంచి హైదరాబాద్ కు వచ్చిన సూరి (రాజ్ కళ్యాణ్), యువరాజ్ సాఫ్ట్ వేర్ రంగంలో సెటిల్ అవుతారు. దొంగసుబ్బి (కృష్ణుడు) రియల్ ఎస్టేట్, అప్పు (వెంకట్) షేర్ మార్కెట్ రంగంలో బిజీగా ఉంటాడు. అంతా బాగా సంపాదిస్తూ వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తుంటారు. వీరి స్నేహితుడు లచ్చు (అరవింద్ కృష్ణ) సెక్యురిటీ ఆఫీసర్ గా పనిచేస్తుంటాడు. అందరిలా సాఫ్ట్ వేర్ ఉద్యోగం లేదని లచ్చు అవమానాలు ఎదుర్కంటాడు. ఇదే సమయంలో ఆర్ధికమాంద్యంతో సాఫ్ట్ వేర్, రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్ రంగాలు కుదేలవుతాయి. ఆ సమయంలోనే వీరి గ్రామాన్ని ప్రభుత్వం సెజ్ గా ప్రకటిస్తుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని గ్రామ సర్పంచ్ అయిన సూరి అన్నయ్య రామరాజు (రావు రమేష్) వ్యతిరేకిస్తాడు. పలు కారణాలతో రామరాజు చనిపోతాడు. రామరాజు మరణానికి గల కారణాలమిటి.., ఆయన తర్వాత లచ్చు, సూరి, అప్పు ఎలా పోరాడారు..? ప్రపంచీకరణ వల్ల కలుగుతున్న నష్టాలేమిటో తెలుసుకోవాలంటే థియేటర్ లో సినిమా చూడండి.

cinima-reviews
మన కుర్రాళ్ళే

వీరశంకర్ డైరెక్షన్ లో రూపొందిన ‘మన కుర్రాళ్లే’ సినిమా విడుదల అయింది. ఎనమిది మంది సంగీత దర్శకులు ఈ మూవీ కోసం పని చేశారు. డిఫరెంటు కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా సిల్వర్ స్ర్కీన్స్ బ్యానర్ పై బీవీఎస్ శ్రీనివాస్, హెచ్.ఎస్ అరూన్ ఈ మూవీని నిర్మించారు. నూతన సంవత్సర కానుకగా విడుదల అయిన ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

ప్లస్ పాయింట్స్ :

నటులు అరవింద్ కృష్ణ, వెంకట్, కృష్ణుడు, రావు రమేష్ సహా ఇతరుల నటన బాగుంది. రావు రమేష్ సర్పంచ్ గా బాగా నటించాడు. చాలాకాలం తర్వాత వెండితెరపై కన్పించిన కమెడియన్ వేణు మాధవ్ రెండు సీన్లలోనే ఉన్నా ఎంటర్ టైన్ చేశాడు.

మైనస్ పాయింట్స్ :

సినిమాను ఎక్కువ సేపు సస్పెన్స్ చూపించలేకపోయారు. తొలి అరగట తర్వాత పూర్తి సినిమా ఏమిటనేది ప్రేక్షకులు ఊహించేయగలరు. గతంలో చాలా సినిమాలు ఆర్ధికమాంద్యంకు వ్యతిరేకంగా వచ్చాయి. ఇది కూడా వాటిలాగే ఉంది తప్ప కొత్తదనం లేదు. ప్రతి సీన్ ను డైలాగులతో సహా ఊహించేయగలరు.

Cinema Review

కథ, స్ర్కీన్ ప్లే, మాటలు, డైరెక్టర్ గా నాలుగు స్థంభాలను మోసిన వీర శంకర్,  ఏ ఒక్కదాంట్లో కూడ ప్రతభ చూపలేకపోయాడు. డైలాగులు బాలేవు, స్ర్కీన్ ప్లే లో కొత్తదనం లేదు, డైరెక్షన్ లో కూడా అంతగా ఏమిలేదు. ముజీర్ మాలిక్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎనమిది సంగీత దర్శకులు ఎందుకు పనిచేశారో అర్థం కావటం లేదు. ఒక్క పాట కూడా బాగా లేదు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతంతమాత్రంగానే ఉంది. అంతమంది నటుల సీన్లను ఒక ఆర్ఢర్ లో పెట్టడానికి ఎడిటర్ పడిన కష్టాన్ని మెచ్చుకోవాలి. నిర్మాణ విలువలు అంతగా లేవు.

చివరగా : బెస్ట్ యాక్టర్స్, వరస్ట్ డైరెక్టర్.

Movie TRAILERS

మన కుర్రాళ్ళే

play