Teluguwishesh చంద్రకళ చంద్రకళ chandrakala telugu movie review : check out hansika and roy laxmi lead chandrakala movie latest updats chandrakala movie songs trailers and teasers Product #: 59148 2.25 stars, based on 1 reviews
  • చిత్రం  :

    చంద్రకళ

  • బ్యానర్  :

    శ్రీ శుభశ్వేత ఫిలింస్

  • దర్శకుడు  :

    సుందర్ .సి

  • నిర్మాత  :

    శ్వేతలానా, వరుణ్ తేజ, సి.వి.రావు

  • సంగీతం  :

    కార్తిక్ రాజా

  • సినిమా రేటింగ్  :

    2.252.25  2.25

  • ఛాయాగ్రహణం  :

    సెంథిల్ కుమార్

  • నటినటులు  :

    సుందర్ సి., వినయ్, ఆండ్రియా, హన్సిక, రాయ్ లక్ష్మి, సంతానం, కోవై సరళ, కోట శ్రీనివాసరావు తదితరులు

Chandrakala Movie Review

విడుదల తేది :

19-12-2014

Cinema Story

మురళీ(వినయ్), భార్య మాధవి (ఆండ్రియా) సహా కుటుంబమంతా చాలా కాలం క్రితం మూసివేయబడ్డ ఓ భవనంలో ఉండటానికి వస్తారు. అప్పటికే ఇంట్లో తిష్ట వేసిన దెయ్యం వినయ్ కుటుంబ సభ్యుల్లో ఒక్కొక్కర్నీ చంపేస్తుంటుంది. అలాంటి సమయంలో బూత్ బంగ్లాకు వచ్చిన మాధవి అన్నయ్య సుందర్ దెయ్యం గురించి తెలుసుకోవటానికి ప్రయత్నిస్తాడు. ఆ క్రమంలోనే కొన్ని భయంకర విషయాలు తెలుస్తాయి. సుందర్ కు తెలిసిన భయంకర విషయాలేమిటి..? ఇంట్లో దెయ్యం ఎవరు...? దెయ్యం ఉందని తెలిసి ఏం చేశారు అనే కథంతా తెరపై చూడండి.

cinima-reviews
చంద్రకళ

ఇప్పటివరకు గ్లామర్ పాత్రలతో ఆకట్టుకున్న హన్సిక చేసిన తొలి థ్రిల్లర్ సినిమా ‘చంద్రకళ’. సుందర్, వినయ్, లక్ష్మి రాయ్ ప్రధాన పాత్రలుగా రూపొందిన ఈ సినిమా డిసెంబర్ 19న విడుదల అయింది. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘అరన్మణి’ని తెలుగులో ‘చంద్రకళ’ పేరుతో విడుదల చేస్తున్నారు. హర్రర్ అండ్ కామెడి ఎంటర్ టైనర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ చూద్దాం.

ప్లస్ పాయింట్స్ :

సినిమాకు మొదటి ప్లస్ పాయింట్ సుందర్ అయితే రెండవ ప్లస్ పాయింట్ ఆండ్రియా. దెయ్యంను కనిపెట్టే పాత్రలో సుందర్ అద్బుతంగా నటించాడు. ఇక ఆండ్రియా కూడా తన పాత్రకు వంద శాతం న్యాయం చేసింది. లక్ష్మిరాయ్, వినయ్ కూడా బాగా నటించారు. కీ రోల్ పోషించిన హన్సిక కూడా ఉత్తమ నటన కనబర్చింది. ఇక మిగతా పాత్రధారులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

మైనస్ పాయింట్స్ :

పాత కథను తీసుకుని సినిమా తీయటమే పెద్ద మైనస్. ఇప్పటికే ఈ తరహాలో తెలుగులో చాలా కథలు వచ్చాయి. ఇలాంటి సినిమాలు చూసిన తెలుగు ప్రజలు ‘చంద్రకళ’ చూస్తుంటే తర్వాతి సీన్ ఏమిటో ముందే చెప్పేస్తున్నారు. కామెడి ట్రాక్ దెబ్బతింది. నటన పరంగా న్యాయం చేసినా.., వారి క్యారెక్టర్లను డిజైన్ చేయటంలో విఫలం అయ్యారు. బలవంతంగా కామెడిని పెట్టినట్లుగా ఉంది.

Cinema Review

కళాకారుల పనితీరు :

డైరెక్టర్ పనితీరు బాగుంది కానీ.., కథ మాత్రం పాతదే. హర్రర్ సినిమాలకు కీ పాయింట్ అయిన సినిమాటోగ్రఫీ బాగుంది. ఇక సంగీతం కూడా చాలా బాగుంది. పాటలతో పాటు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ హైలైట్. ఎడిటర్ అయినా పాత కథ అని తెలిసి అనవసర సీన్లు కట్ చేస్తే బాగుండేది. శుభశ్వేత సంస్థ నిర్మాణ విలువలు పర్వాలేదు.

చివరగా : చంద్రకళలో కొత్తకళ, కథ లేదు.