Teluguwishesh సాహెబా సుబ్రహ్మణ్యం సాహెబా సుబ్రహ్మణ్యం check out latest telugu movie saheba subramanyam movie review, saheba subramanyam movie ratings, saheba subramanyam tesers, trailers, dileep kumar, priyaal gor Product #: 58937 2.75 stars, based on 1 reviews
  • చిత్రం  :

    సాహెబా సుబ్రహ్మణ్యం

  • బ్యానర్  :

    ఇండో ఇంగ్లీష్ ప్రొడక్షన్స్

  • దర్శకుడు  :

    శశికిరణ్ నారాయణ

  • నిర్మాత  :

    కొల్లా నాగేశ్వర రావు

  • సంగీతం  :

    షాన్ రెహ్మాన్

  • సినిమా రేటింగ్  :

    2.752.75  2.75

  • ఛాయాగ్రహణం  :

    సాయి ప్రకాష్, ఉమ్మడిసింగు

  • ఎడిటర్  :

    ప్రవీణ్ పూడి

  • నటినటులు  :

    దిలీప్ కుమార్, ప్రియాల్ గోర్, రావు రమేష్, వంశీ కృష్ణ, తదితరులు

Saheba Subramanyam Movie Review

విడుదల తేది :

2014-12-12

Cinema Story

సుబ్రహ్మణ్య శాస్త్రి అలియాస్ సుబ్బు(దిలీప్ కుమార్) కాలేజ్ చదివే ఓ కుర్రాడు. ఓరోజు తన స్నేహితుడి పెళ్లికని వెళ్లిన ఇతగాడు.. అక్కడ అయేషా(ప్రియాల్ గోర్)ను మొదటి చూపులోనే చూసి ప్రేమలో పడతాడు. అయితే ఆ అమ్మాయి ముస్లిం. సుబ్బు ఆమెను తన ప్రేమలో పడేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తాడు.

అలా కొద్ది రోజుల తర్వాత అయేషా కూడా సుబ్బుని ప్రేమిస్తుంది. అయితే వేర్వేరు కులాలకు (హిందూ-ముస్లిం) కావడం వల్ల వీరి ప్రేమకు కొన్ని సమస్యలు వస్తాయి. ఆ సమస్యలేమిటి? వీరిద్దరూ ఎదుర్కొన్న ఇబ్బందులేంటి? చివరకు వీరి ప్రేమ ఫలించిందా లేదా? అనే విషయాలు తెలుసుకోవాలంటే వెండితెరపై చూడాల్సిందే!

cinima-reviews
సాహెబా సుబ్రహ్మణ్యం

ప్రముఖ నటుడు, కమెడియన్ ఎమ్మెస్ నారాయణ కూతురు శశికిరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘సాహెబా సుబ్రహ్మణ్యం’. దిలీప్ కుమార్, ప్రియాల్ గోర్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని ఇండో ఇంగ్లీష్ ప్రొడక్షన్స్ పతాకంపై డా.కొల్లా నాగేశ్వరరావు నిర్మించారు. షాన్ రెహ్మన్ సంగీతం అందించిన ఈ చిత్రానికి సంగీతం అందించారు. మలయాళ చిత్రం ‘తట్టత్తిన్ మరియత్తు’కి రీమేక్ అయిన ఈ చిత్రం శనివారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమాతో శశి తన దర్శకత్వ టాలెంట్’ను ఎలా నిరూపించుకుందో చూద్దాం..

Cinema Review

ప్లస్ పాయింట్స్:

కొత్తవారైన హీరో దిలీప్ కుమార్, హీరోయిన్ ప్రియాల్ గోర్ ఇద్దరూ తమ పాత్రలకు బాగానే న్యాయం చేశారు. ముఖ్యంగా ప్రియాల్ అద్భుతంగా నటించింది. ముస్లిం అమ్మాయి పాత్రలో బాగానే ఒదిగిపోయింది. కొన్ని కొన్ని సన్నివేశాలలో ప్రియాల్ తన అందం, అభినయం, హవాభావాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన రావు రమేష్ అద్భుతంగా నటించాడు. సీరియస్ గా కనబడుతూనే తన మాటలతో ఆడియన్స్ ను నవ్వించేసాడు. ఇక తాగుబోతు రమేష్ తన కామెడీ పంచ్’లను మరోసారి చింపేసాడు. నరేష్ తన పాత్రకు వంద శాతం న్యాయం చేసాడు. ఇక మిగత నటీనటులు వారి వారి పాత్రలకు తగ్గట్టు సరైన న్యాయం చేశారు.

మైనస్ పాయింట్స్:

ఈ సినిమాలో హీరోయిన్ అయేషా తన హావభావాలతో ప్రేక్షకులను కట్టిపడేస్తే.. హీరో ఫేస్ లో మాత్రం ఎలాంటి ఎక్స్ ప్రెషన్స్ కనిపించవు. హీరో దిలీప్ నటనపరంగా, హవాభావాల పరంగా మరింత జాగ్రత్తలు తీసుకొని నటించి వుంటే సినిమాకు మరింత ఊపునిచ్చేది. హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఇక ఫస్ట్ హాఫ్ మొత్తం ఎంటర్ టైన్మెంట్ తో సాగితే సెకండ్ హాఫ్ లో మాత్రం అలాకాకుండా కేవలం ఎమోషన్ సన్నీవేశాలతో సాగుతుంది. అయితే ఆయా ఎమోషనల్ సన్నీవేశాల్లో నటీనటుల నుంచి మాత్రం ఎలాంటి ఎమోషన్స్ రాకపోవడంతో ప్రేక్షకులు కనెక్ట్ అవ్వరు. ఇక ఈ సినిమాలో ఎలాంటి ట్విస్టులు లేకుండా చాలా సింపుల్ గా వెళ్లిపోతూ వుంటుంది.

సాంకేతిక వర్గపనితీరు:

సాయిప్రకాష్ అందించిన సినిమాటోగ్రఫి అద్భుతం. ప్రతి ఫ్రేం చాలా అందంగా చిత్రీకరించారు. ఇక షాన్ రెహ్మన్ అందించిన పాటలు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్రాణం పోసాయి. ముఖ్యంగా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ లో వచ్చే ‘సాహెబా సాహెబా’ అనే బిడ్ సౌండ్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది. ఇక ప్రవీణ్ పూడి ఎడిటింగ్ బాగుంది కానీ, సెకండ్ హాఫ్ కోసం తన కత్తెరకు మరింత పని చెప్పుంటే బాగుండేది. ఇక ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయమైన శశికిరణ్ నారాయణ ఈ సినిమాతో సక్సెస్ అయ్యిందని చెప్పుకోవచ్చు. కానీ సెకండ్ హాఫ్ లో మరింత శ్రద్ధ తీసుకొని వుంటే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరగా:

కామెడీ విత్ బ్యూటీఫుల్ లవ్ స్టోరీ.