Teluguwishesh అలా ఎలా ? అలా ఎలా ? Read Ala Ela telugu movie full review in teluguwishesh.com website Product #: 58531 2.75 stars, based on 1 reviews
  • చిత్రం  :

    అలా ఎలా

  • బ్యానర్  :

    అశోకా క్రియేషన్స్

  • దర్శకుడు  :

    అనీష్ క్రిష్ణ

  • నిర్మాత  :

    అశోక్ వర్ధన్

  • సంగీతం  :

    భీమ్స్ సిసిరోలియో

  • సినిమా రేటింగ్  :

    2.752.75  2.75

  • ఛాయాగ్రహణం  :

    సాయి శ్రీరామ్

  • ఎడిటర్  :

    సీతారామశాస్త్రి

  • నటినటులు  :

    రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిషోర్, ఖుషీ

Ala Ela Telugu Movie Review

విడుదల తేది :

2014-11-28

Cinema Story

పెళ్లచేసుకోమంటూ ఒత్తిడి తేవడంతో తాత కోరిక మేరకు సిద్ధమవుతాడు కార్తీక్(రాహుల్ రవీంద్రన్). కార్తీక్ తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని చూడటానికి తన ఇద్దరు ఫ్రెండ్స్ తో కలిసి రాజోలుకు వెళ్తారు. అయితే కార్తీక్ చేసుకోబోయే అమ్మాయి (దివ్య) కన్నా... ఆమె స్నేహితురాలు శృతి బాగా నచ్చుతుంది. అయితే శృతికి అప్పటికే పెళ్లి ఫిక్స్ అవుతుంది.

అయితే కార్తీక్ తన ఫ్రెండ్స్ సహాయంతో శృతిని లేపుకుపోవడానికి సిద్ధపడతాడు. అయితే ఇక్కడ చిన్న ట్విస్ట్ వుంటుంది. మరి కార్తీక్ శృతిని లేపుకెళ్లిపోయాడా? పెళ్లి చేసుకున్నాడా? మరి దివ్య పరిస్థితి ఏమయ్యింది? అసలు అక్కడ ఏం జరిగింది? అనే విషయాలు తెలియాలంటే వెండితెర మీదనే చూడాలి.

cinima-reviews
అలా ఎలా ?

‘అందాల రాక్షసి’ సినిమా తర్వాత నటుడు రాహుల్ రవీంద్రన్ చాలా కాలం గ్యాప్ తీసుకొని మళ్లీ ‘అలా ఎలా’ సినిమాతో మన ముందుకు వచ్చారు. మధ్యలో కొన్ని సినిమాలు చేసినప్పటికీ అవి అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. అయితే తాజాగా రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిషోర్ తదితరులు ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ఎలా వుందో ఒకసారి చూద్దామా.

Cinema Review

ప్లస్ పాయింట్స్:

కార్తీక్ పాత్రకు రాహుల్ రవీంద్రన్ సరైన న్యాయం చేసాడు. రాహుల్ రవీంద్రన్ కు ఈ చిత్రం మంచి బ్రేక్ అని చెప్పొచ్చు. ఇప్పటివరకు సీరియస్ పాత్రలు చేసిన రాహుల్... ఈ సినిమాతో తనలోని కామెడీ యాంగిల్ ను కూడా ప్రదర్శించాడని చెప్పుకోవచ్చు. భార్య భాదితుడి పాత్రలో వెన్నెల కిషోర్ బాగా నటించాడు. అలాగే హీరోయిన్ ఖుషి మరియు హెబ్బా పటేల్ తదితరులు వారి వారి పాత్రలకు సరైన న్యాయం చేసారు.

మైనస్ పాయింట్స్:

అక్కడక్కడా కొన్ని కామెడీ పంచ్’లు అంతగా వర్కౌట్ అవ్వలేదు. సీన్ టు సీన్ కనెక్టివిటీ అంతా బాగానే వుందిగానీ.. ఒకటీ రెండుచోట్లా లోపాలు కనిపిస్తాయి. ఇంకా చెప్పుకోదగ్గ మైనస్ పాయింట్స్ ఏమీలేవు.

సాంకేతికవర్గ పనితీరు:

దర్శకుడు అనీష్ తాను అనుకున్న కథను అద్భుతంగా తెరకెక్కించాడు. సాయిశ్రీరాం సినిమాటోగ్రఫి అద్భుతం అని చెప్పుకోవచ్చు. పల్లె అందాలు, పచ్చని వాతావరణాలను చాలా అందంగా చూపించారు. భీమ్స్ సంగీతం సినిమాకు ఆకర్షణగా నిలిచింది. ఇక మాటలు, డైలాగ్స్ సినిమా కథకు సరిగ్గా సరిపోయాయి. స్టార్ కమెడియన్లు ఎవరూ లేకపోయినప్పటికీ... దర్శకుడు వున్న సన్నివేశాలనే చాలా చక్కగా, మాటలతోనే కామెడీని పండించారు.

చివరగా:

అలా ఎలా?.. ఎంటర్ టైన్మెంట్ సినిమా.

Movie TRAILERS

అలా ఎలా ?

play