Teluguwishesh ఎర్రబస్సు ఎర్రబస్సు manchu vishnu errabassu movie review : manchu vishnu and dasari narayanarao combination latest movie errabassu releases on 14th november world wide. manchu vishnu lead role played and own banner movie releases on 14th november and reviews ratings are as fallows Product #: 58008 1.5 stars, based on 1 reviews
  • చిత్రం  :

    ఎర్రబస్సు

  • బ్యానర్  :

    24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరి

  • దర్శకుడు  :

    దాసరి నారాయణ రావు

  • నిర్మాత  :

    దాసరి నారాయణ రావు

  • సంగీతం  :

    చక్రి

  • సినిమా రేటింగ్  :

    1.5  1.5

  • ఎడిటర్  :

    కోటగిరి వెంకటేశ్వర రావు

  • నటినటులు  :

    మంచు విష్ణు(హీరో), కేథరిన్ (హీరోయిన్), దాసరి నారాయణ రావు, బ్రహ్మానందం, కృష్ణుడు, రఘుబాబు తదితరులు

Errabus Movie Review

విడుదల తేది :

2014-11-24

Cinema Story

పల్లెటూరిలో ఉండే రాజేష్(మంచు విష్ణు)కు తాతయ్య నారాయణ రావు (దాసరి నారాయణ రావు) లోకం. ఆయన సంరక్షణలోనే పెరిగి పెద్దవుతాడు. ఇక రాజేష్ కు అమెరికాకు వెళ్లి బాగా డబ్బు సంపాదించాలని ఆశ. ఇందుకోసం చాలా కష్టపడతాడు. ఈ క్రమంలోనే రజ్జి(కేథరిన్)ను చూసి ప్రేమలో పడతాడు. చివరకు ఎలాగోలా అమెరికా వెళ్లే అవకాశం పొందుతాడు. విదేశీయానంకు మూడు నెలలు సమయం ఉందనగా.., ఈ ఖాళీని తాతయ్యతో గడపాలని కోరుకుని ఆయన్ను ఊరినుంచి సిటీకి తీసుకొస్తాడు. అలా నగరానికి వచ్చిన నారాయణ రావు ఏం చేశాడు... తాతయ్య వల్ల రాజేష్ ఎలా ఇబ్బందులు పడ్డాడు, అమెరికా పర్యటన ఏమయింది అనేది తెరపై చూడండి.

cinima-reviews
ఎర్రబస్సు

దాసరి నారాయణ రావు చాలా కాలం తర్వాత మేకప్ వేసుకుని కన్పించిన సినిమా ‘ఎర్రబస్సు’ మంచు విష్ణు, కేథరిన్ హీరో హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. దాసరి సినిమా అమెరికాలో విడుదల కావటం ఇదే తొలిసారి. ఈ మూవీని దాసరి స్వయంగా డైరెక్ట్ చేసి, నిర్మాతగా వ్యవహరించాడు. చక్రి అందించిన సంగీతంకు మంచి స్పందన వచ్చింది. కోలీవుడ్ పాత సినిమాకు రీమేక్ గా వచ్చిన ‘ఎర్రబస్సు’ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

Cinema Review

పాత తమిళ కధను ప్రస్తుతం తెలుగులో తీసి దాసరి చేతులు కాల్చుకున్నాడని చెప్పాలి. ఈ మాట ఎందుకు అంటున్నామంటే స్వయంగా ఆయన డైరెక్ట్ చేయటంతో పాటు నిర్మాతగా కూడ వ్యవహరించాడు కాబట్టి. ఏదేదే ఊహించుకుని రాసుకుని దాన్ని చూపించటంలో దెబ్బతిన్నాడు. ఇక డైలాగులు కూడా సరిగా లేవు, కాకపోతే కొన్ని సందర్బాల్లో పర్వాలేదు అని చెప్పవచ్చు. ఇక సంగీతం పరంగా చక్రి న్యాయం చేశాడు. పాటలు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. గ్రామీణ వాతావరణంతో పాటు సిటీ లైఫ్ తేడాలను స్పష్టంగా కవర్ చేశారు. ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వర రావు.., రష్ పై సరిగా దృష్టి పెట్టలేదు. అవసరం లేని సీన్లు పెట్టి ప్రేక్షకులక విసుగు తెప్పించారు. ఇక తారకప్రభు ఫిలింస్ వారి నిర్మాణ విలువలు బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్ :

సినిమాలో దాసరి నటన బాగుంది. ఆయనలోని టాలెంట్ మరోసారి బయటకు వచ్చింది. యంగ్ హీరోతో కలిసి దాసరి ఈ మూవీతో ఓ సాహసం చేశారు అని చెప్పవచ్చు. ప్రస్తుత యువత జీవనం, ఆలోచనా విధానంను సినిమాలో చూపించారు.

మైనస్ పాయింట్లు :

సినిమాలో దాసరి మాత్రమే చాలా బాగా చేశారు. ఎందుకంటే ఆయన డైరెక్ట్ చేశారు కాబట్టి.., తనను తాను చాలా బాగా డైరెక్ట్ చేసుకున్నారు. కాని మిగతావారిని చేయలేకపోయారు. దాసరి కధను డామినేట్ చేయటంతో హీరో మంచు విష్ణుకు పూర్తిగా నటించే చాన్స్ లేకపోయింది. ఇక హీరోయిన్ కూడా ఏదో ఉందా అంటే ఉంది అని చెప్పాలి. అంతేకంటే ఎక్కువగా చెప్పలేము. రఘుబాబు సహా మిగతా పాత్రలను సరిగా ఉపయోగించుకోలేదు. సినిమాలో క్యారెక్టర్లను సెలక్ట్ చేయటంపై ఉన్న శ్రద్ధ వారిని వాడుకోవటంలో చూపించలేదు అని తెలుస్తోంది.

ఇక కథ పరంగా చూస్తే.., చాలా డల్ స్టోరి అని చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ అంతా క్యారెక్టర్లను పరిచయం చేసేందుకు సరిపోయింది. ఇక సినిమా సెకండ్ ఆఫ్ దాసరి సిటీలో ఏం చేశాడు అని చూపించారు. పాత కధను రీమేక్ చేస్తున్నాము అని మర్చిపోయి అప్పటి స్టోరీనే యధావిధిగా ఇప్పుడు సినిమాగా తీయటంతో ప్రేక్షకులు ఇబ్బంది పడతారు. కధ బాగా లేకపోవటంతో పాటు డైలాగులు కూడా బాగాలేవు. ఎక్కడో చూసి రాసినట్లుగా అన్ని తెలిసిన పదాలు, వాడుకలో ఉన్న డైలాగులను సినిమాలో ఉపయోగించటంతో నవ్వుకునే సందర్బాలు చాలా తక్కువ ఉన్నాయి. ఇక ఎమోషనల్ కథ అయినా ఓవర్ ఎక్స్ ప్రెషన్ తో ఇక చాలు అన్పిస్తుంది. ప్రేక్షకులు ఎమోషనల్ ఫీల్ అయ్యే చాన్స్ లేదు.

 

చివరగా :
ఎర్రబస్సు.. ఎవరూ ఎక్కని బస్సు


కార్తిక్

Movie TRAILERS

ఎర్రబస్సు

play