Teluguwishesh పిల్లా నువ్వులేని జీవితం పిల్లా నువ్వులేని జీవితం Product #: 57975 3.5 stars, based on 1 reviews
  • చిత్రం  :

    పిల్లా నువ్వులేని జీవితం

  • బ్యానర్  :

    గీతా ఆర్ట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్

  • దర్శకుడు  :

    రవికుమార్ చౌదరి

  • నిర్మాత  :

    బన్నీ వాసు, హర్షిత్

  • సంగీతం  :

    అనూప్ రూబెన్స్

  • సినిమా రేటింగ్  :

    3.53.53.5  3.5

  • ఎడిటర్  :

    గౌతంరాజు

  • నటినటులు  :

    సాయి ధరమ్ తేజ్ (హీరో), రెజినా (హీరోయిన్), జగపతిబాబు, ప్రకాష్ రాజ్ తదితరులు

Pilla Nuvvu Leni Jeevitham Movie Review

విడుదల తేది :

2014-11-14

Cinema Story

ప్రభాకర్ (ప్రకాష్ రాజ్), గంగ ప్రసాద్ (షియాజి షిండే) ఇద్దరూ సీఎం కుర్చీ కోసం పోటిపడే రాజకీయ నేతలు. షఫి (షఫీ) అనే జర్నలిస్టుకు వీరిద్దరికి సంబంధించి కొన్ని విషయాలు తెలుస్తాయి. ఇది తెలిసిన రాజకీయ నేతలు ఇద్దరూ షఫీని చంపమని రౌడీ (మైసమ్మ)కు సుపారీ ఇస్తారు. ఇంతలో పాలకొల్లు నుంచి వచ్చిన శ్రీను (సాయి ధరమ్ తేజ్) మైసమ్మ దగ్గరకు వెళ్ళి తను చంపేయమని కోరుతాడు. ఇదేమి అర్థం కాని మైసమ్మ సైలెంట్ అవుతాడు. మైసమ్మకు తన ప్రేమ కధ గురించి చెప్తాడు. శైలు (రెజినా)ను ఎలా ప్రేమించింది, ఆ తర్వాత ఏం జరిగింది వివరించటంతో పాటు ఒక ట్విస్టు చెప్తాడు. ఆ ట్విస్టు ఏమిటి.., షఫీకి తెలిసిన నిజాలు ఏమిటి?  మైసమ్మ ఇద్దరిలో ఎవరిని చంపుతాడు ఇలా మిగతా కధ అంతా ధియేటర్ కు వెళ్ళి చూడండి.

cinima-reviews
పిల్లా నువ్వులేని జీవితం

సాయి ధరమ్ తేజ్ తాజా చిత్రం ‘పిల్లా నువ్వులేని జీవితం’ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సాయి ధరమ్ నటించిన తొలి సినిమా ‘రేయ్’ అయినా., అది విడుదల కాలేదు, దీంతో ‘పిల్లా నువ్వులేని జీవితం’నే తొలి సినిమాగా చెప్పవచ్చు. ఈ మూవీని రవికుమార్ డైరెక్ట్ చేయగా.., గీతా ఆర్ట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో బన్నీ వాసు, హర్షిత్ కలిసి ఈ సినిమాను నిర్మించారు. రెజినా హీరోయిన్ గా నటించింది. విడుదలకు ముందే ట్రైలర్లు, ఫొటోలు, పాటలకు మంచి స్పందన వచ్చింది. మాస్ లుక్ తో పాటు స్టైల్ ను చూపిస్తూ రెండు వర్గాల నుంచి పాజిటివట్ టాక్ అందుకున్నాడు. ఇలా మెగా ఫ్యాన్స్ భారీ అంచనాల మద్య వచ్చిన ‘పిల్లా నువ్వులేని జీవితం’ ఎలా ఉందో రివ్యూ మీకోసం అందిస్తున్నాం.

 

 

Cinema Review

మెగా ఫ్యాన్స్ అంచనాలు, హీరో స్టార్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని డైరెక్టర్ రవి కుమార్ కధ సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తానేంటో నిరూపించుకోవాలనే కసి ఇందులో కన్పించింది. కధ, కధనం బాగుంది అయితే ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుని ఉంటే చాలా బాగుండేది. అనూప్ రూబెన్స్ సంగీతం కూడా బాగుంది. ముఖ్యంగా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా వచ్చింది. ఇక సినిమాటోగ్రపీ శివ చాలా కష్టపడ్డాడు. ప్రతి యాంగిల్ ఫ్రేం మిస్ కాకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. సన్నివేశాలు, సాంగ్స్ లో విజువల్ క్లారిటి బాగుంది. ఎడిటింగ్ పరంగా గౌతం రాజు కూడా బాగా వర్క్ చేశాడు... కాని ఇంకొంచెం తన పనితనం చూపించవచ్చు కూడా. ఇక రెండు సంస్థలు కలిసి అందించిన నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.

ప్లస్ పాయింట్లు :

సాయి ధరమ్ తేజ్ కు ఈ సినిమా మంచి ఎంట్రీ అని చెప్పవచ్చు. తొలి సినిమాలో నటన చాలా బాగుంది. మాస్, క్లాస్ నటనతో అదరగొట్టాడు. ఇక డాన్సులు, ఫైటింగ్ అయితే బ్లడ్ పవర్ చూపించాడు. సినిమాకు హీరోతో పాటు విలన్ జగపతి బాబు కూడా అస్సెట్. విలనిజం స్పష్టంగా చూపించటంతో పాటు క్యారెక్టర్ లోని కామెడిని కూడా అద్బుతంగా ప్రదర్శించాడు. విలన్ క్యారెక్టర్లు చేస్తున్న జగపతి బాబు దివంగత నటుడు శ్రీహరిని తలపిస్తున్నాడు. ఇక హీరోయిన్ రెజీనా గ్లామర్ తో ఆకట్టుకుంది. ఇప్పటికే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన రెజినాకు కెరీర్ పరంగా ఇదో ప్లస్ పాయింట్ అవుతుంది. మిగతా నటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు.

మైనస్ పాయింట్లు :
సినిమా మొత్తం చూస్తే సెకండ్ ఆఫ్ కంటే ఫస్ట్ ఆఫ్ కాస్త నిదానంగా సాగినట్లు అన్పిస్తుంది. అయితే ఎక్కడా ప్రేక్షకులను నిరాశపర్చలేదు. కథలో ట్విస్టులు చాలా పెట్టడంతో వాటిలో కొన్ని ప్రేక్షకులకు తెలిసినవి ఉన్నాయి. ఇవి వచ్చే సమయంలో ప్రేక్షకులు ముందే ఊహించేయవచ్చు. ఇంతకుమించి మరీ ఎక్కువగా మైనస్ పాయింట్లు ఏమి చెప్పలేము.

 

చివరగా :

ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అన్పించుకున్నాడు.

 

 

కార్తిక్

Movie TRAILERS

పిల్లా నువ్వులేని జీవితం

play