Teluguwishesh జోరు జోరు sundeep kishan joru telugu movie review : sundeep kishan latest movie joru releases on november 7th with more theaters that of his previous movies. sundeep kishan acted with three heroines in joru movie, here is review online Product #: 57753 2.25 stars, based on 1 reviews
  • చిత్రం  :

    జోరు

  • బ్యానర్  :

    శ్రీ కీర్తి ఫిలిమ్స్

  • దర్శకుడు  :

    కుమార్ నాగేంద్ర

  • నిర్మాత  :

    అశోక్

  • సంగీతం  :

    భీమ్స్

  • సినిమా రేటింగ్  :

    2.252.25  2.25

  • ఛాయాగ్రహణం  :

    ఎం.ఆర్. ఫలనికుమార్

  • ఎడిటర్  :

    శేఖర్

  • నటినటులు  :

    సందీప్ కిషన్ (హీరో), రాశి ఖన్నా (హీరోయిన్), ప్రియాబెనర్జీ, సుష్మ, బ్రహ్మానందం, షియాజి షిండే, అజయ్, సప్తగిరి తదితరులు

Joru Movie Review

విడుదల తేది :

2014-11-07

Cinema Story

సందీప్ (సందీప్ కిషన్) సరదాగా ఉండే కుర్రాడు. అమెరికా నుంచి తండ్రి సదాశివం (షియాజి షిండే) చూసేందుకు వచ్చిన అను ( రాశి ఖన్నా) ను అనుకోకుండా కలుసుకుంటాడు. ఇదిలా ఉండగానే ఇండియాకు వచ్చిన అనుపై భవాని (అజయ్) చాలాసార్ల దాడి చేస్తాడు. ఈ సమయంలో సందీప్ వచ్చి కాపాడుతాడు. ఆ తర్వాత తన తండ్రి గురించి అను నిజం తెలుసుకుంటుంది. ఇంతకీ ఏమిటా నిజం.. ఎందుకు భవాని చంపాలనుకుంటున్నాడు. సందీప్ - అను ప్రేమకధ సంగతి ఏమిటి అనే విషయాలు వెండి తెరపై చూసి తెలుసుకొండి.

cinima-reviews
జోరు

వరుసగా సినిమాలు చేసుకుంటూ చిన్న హీరోల్లో పెద్దగా పేరున్న సందీప్ కిషన్ తాజా చిత్రం ‘జోరు’ నవంబర్ 7న విడుదల అయింది. చిన్న సినిమాలే అయినా హిట్ అవుతుండటంతో జోరుమీదున్న సందీప్ ఈ మూవీలో ముగ్గురు హీరోయిన్లతో ఒకే పాటలో డాన్స్ చేశాడు. కుమార్ నాగేంద్ర సినిమాను తెరకెక్కించగా.., అశోక్ నిర్మాతగా వ్యవహరించాడు. భీమ్స్ అందించిన సంగీతం విడుదలకు ముందే మంచి స్పందన వచ్చింది. సందీప్-రాశీఖన్నా హీరో హీరోయిన్లుగా వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం

‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’, ‘రారా కృష్ణయ్య’ వంటి వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్న హీరో సందీప్ కిషన్. సందీప్ కిషన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘జోరు’. సందీప్ కిషన్ సరసన రాశీఖన్నా, సుష్మ, ప్రియా బెనర్జీలు హీరోయిన్లుగా నటించారు. ‘గుండెల్లో గోదారి’ ఫేమ్ కుమార్ నాగేంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు భీమ్స్ సంగీతం అందించాడు. ఇటీవలే విడుదలైన పాటలు, ట్రైలర్లకు మంచి స్పందన వచ్చింది. అయితే ఈరోజు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా సందీప్ కు హ్యట్రిక్ విజయాన్ని అందించేలా వుందో లేదో చూద్దామా!

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకు ఇద్దరూ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ గా నిలిచారు. సందీప్ కిషన్, రాశిఖన్నా. సందీప్ కిషన్ తన పాత్రకు వందశాతం న్యాయం చేసాడు. ఇందులో చాలా స్టైలిష్ లుక్ లో కనిపించాడు. అలాగే డాన్సులు, డైలాగులు ఇరగదీసాడు. ఇక హీరోయిన్ రాశి ఖన్నా తన అందచందాలతో ప్రేక్షకులను కట్టిపరేసింది. అందం, అభినయంతో ఆకట్టుకుంది. వీరిద్దరూ కూడా మంచి మార్కులు కొట్టేసారు.

ఇక బ్రహ్మానందం, సప్తగిరిల కామెడీ పర్వాలేదనిపించింది. మరో హీరోయిన్లుగా నటించిన సుష్మ, ప్రియా బెనర్జీల పాత్రలు పెద్దగా లేకపోయినా కూడా బాగా అందాలను ఆరబోసి ఆకట్టుకున్నారు. ఇక మిగతా నటీనటులు వారి వారి పాత్రల మేరకు నటించారు.

మైనస్ పాయింట్స్ :

సినిమాకు మేజర్ మైనస్ పాయింట్ ‘జోరు’. ఈ సినిమాలో చెప్పుకోవడానికి అక్కడక్కడ నటీనటుల నటన ప్లస్ పాయింట్స్ వున్నాయి తప్ప... కథ, కథనం వంటి అంశాలు మైనస్ పాయింట్స్ గా చెప్పుకోవచ్చు. చూస్తున్నంత సేపు చాలా బోర్ గా ఫీలవ్వడం జరుగుతోంది. దర్శకుడు రాసుకున్న కామెడీ స్కిట్స్ ఎక్కడా కూడా జనాలకు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఇక సప్తగిరి, బ్రహ్మానందంల కామెడీ కొంత వరకే బాగుంది. ఆ తర్వాత విసుగొచ్చేస్తుంది. మొత్తానికి పేరులో వున్న జోరు సినిమాలో కనిపించలేదు.

- See more at: http://www.cinewishesh.com/movie-film-reviews/200-movie-film-reviews/52824-joru-movie-review.html#sthash.IvAJ1jMq.dpuf

Cinema Review

ఇక సాంకేతిక విభాగంలో చెప్పుకోదగ్గ అంశాలు రెండు మాత్రమే వున్నాయి. సినిమాటోగ్రఫి, సంగీతం. ఎంఆర్ పళని కుమార్ సినిమాటోగ్రఫి అదిరిపోయింది. ప్రతీ లొకేషన్ను చాలా అద్భుతంగా, అందంగా చూపించాడు. విజువల్స్ చాలా గ్రాండ్ గా వున్నాయి. ఇక భీమ్స్ సంగీతం సినిమాకు చాలా ప్లస్ అయ్యింది. ఎడిటర్ ఎస్ఆర్ శేఖర్ ఎడిటింగ్ లో మరింత కేర్ తీసుకుంటే బాగుండేది.

ఇక దర్శకుడు కుమార్ నాగేంద్ర పాత కథ, కథనంనే నమ్ముకొని ‘జోరు’ తయారుచేసినట్లుగా అనిపిస్తుంది. కథ, కథనంలో కొత్తదనం వుంటే సినిమా అద్భుతంగా వచ్చేది. ఇక చివరగా... అశోక్, నాగార్జున్ ల నిర్మాణ విలువలు చాలా రిచ్, గ్రాండ్ గా వున్నాయి.

చివరగా : జోరు బేజారు

Movie TRAILERS

జోరు

play