Teluguwishesh పూజ పూజ vishal latest movie pooja review : hero vishal latest movie pooja with sruti hassan released on 22october in different languages all saying that this movie is a masala entertainer and will attract tamil audience as well as other languages people Product #: 57280 2.75 stars, based on 1 reviews
  • చిత్రం  :

    పూజ

  • బ్యానర్  :

    విశాల్ ఫిలిం ఫ్యాక్టరి

  • దర్శకుడు  :

    హరి

  • నిర్మాత  :

    విశాల్

  • సంగీతం  :

    యువన్ శంకర్ రాజా

  • సినిమా రేటింగ్  :

    2.752.75  2.75

  • ఛాయాగ్రహణం  :

    ప్రియన్

  • ఎడిటర్  :

    వి.టి. విజయన్

  • నటినటులు  :

    విశాల్ (హీరో), శృతి హాసన్ (హీరోయిన్), సత్యరాజ్, రాధికా శరత్ కుమార్, ముకేష్ తివారి తదితరులు

Pooja Movie Review

విడుదల తేది :

2014-10-22

Cinema Story

బొబ్బిలిలో ఓ మార్కెట్ లో వాసు (విశాల్) వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు. ఈ క్రమంలోనే అనుకోకుండా కలిసిన దివ్య (శృతి హాసన్)తో ప్రేమలో పడతాడు. అటు చిన్నప్పడే బొబ్బిలినుంచి పారిపోయిన సింగన్న పాత్రుడు (ముఖేష్ అద్వానీ) తిరిగి బొబ్బిలికి వచ్చి ఫైనాన్స్ కంపనీ పెట్టి.., దాని ముసుగులో కాంట్రాక్టు మర్డర్లు చేస్తుంటాడు. ఇదిలా ఉండగా ఎస్పీ శివారం నాయక్ (సత్యరాజ్)ని సింగన్న చంపాలని ప్లాన్ చేయగా... అనుకోకుండా ఘటనాస్థలంలో ఉన్న వాసు కాపాడుతాడు. అటు మరో కారణంతో జీకే గ్రూప్స్ కంపనీ (రాధిక)ను సింగన్న టార్గెట్ చేస్తాడు. ఇది వాసు ఫ్యామిలి కాని బయటకు చెప్పుకోవటానికి ఇష్టపడడు. అయినా సరే తన ఫ్యామిలి ఆపదలో ఉందని తెలిసి కాపాడటానికివెళ్తాడు. ఇందులో సింగన్నఎందుకు బీహార్ పారిపోయాడు తిరిగి ఎందుకు వచ్చాడు, ఆయనకు శివరాంకు ఉన్న శత్రుత్వం ఏమిటి.., అలాగే వాసు ఫ్యామిలి గురించి ఎందుకు బయటకు చెప్పడు. చివరికి దివ్య విషయం ఏమవుతుంది అనేది మీరు వెండితెరపై చూసి తెలుసుకోవాలి.

cinima-reviews
పూజ

హీరో విశాల్ తాజా సినిామ ‘పూజ’ బుధవారం విడుదల అయింది. తమిళంలో యాక్షన్ సినిమా హిట్లకు మారుపేరుగా ఉన్న హరి ఈ మాస్ మూవీని తెరకెక్కించారు. విశాల్- హరి కాంబినేషన్ లో గతంలో వచ్చిన ‘భరణి’ సినిమా పెద్ హిట్ అయింది. ఇప్పుడిదే కాంబినేషన్ మరోసారి హిట్ అవుతుందని ఆశిస్తున్నారు. తెలుగువాడైనా తమిళంలో ఎక్కవ సినిమాలు చేసి అభిమానులను పొందిన విశాల్.., తెలుగు, తమిళ ప్రేక్షకులకు దీపావళి కానుకగా పండగకు ఒక రోజు ముందు సినిమాను విడుదల చేశారు. విశాల్ కానుకగా వచ్చిన ‘పూజ’ మూవీ ఎలా ఉందో ఇప్పుడోసారి చూద్దాం.

ప్లస్ పాయింట్స్

ఈ సినిమాలో ముఖ్యంగా ఉన్న ప్లస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే హరి-విశాల్ కాంబినేషన్ మూవి ఒక ప్లస్ పాయింట్. ఆ తర్వాత చెప్పాలంటే హీరో విశాల్ యాక్షన్ మరో ప్లస్ పాయింట్. ఆ తర్వాత శృతిహాసన్ గ్లామర్ ముఖ్యమైన అంశంగా చెప్పాలి. తక్కువ సమయం కన్పించినా.., అందంతో ప్రేక్షకులను శృతి తన వైపు తిప్పుకుంది. అక్కడక్కడా ఉన్న కామెడి సీన్లు ప్రేక్షకులను నవ్విస్తాయి. ఇంటర్వల్ బ్లాక్, యాక్షన్ సీన్లు బాగా వచ్చాయి. మొత్తంగా చెప్పాలంటే మాస్ ప్రేక్షకులకు ఈ సినిమా బాగా నచ్చుతుంది.

మైనస్ పాయింట్లు

ప్రధానమైన మైనస్ పాయింట్ అంటే సినిమా అంతా ఫైట్.., యాక్షన్లతో నిండింది. ఇప్పటితరం సగటు ప్రేక్షకులు కోరుకునే కామెడి తక్కువగా ఉంది. ఇక ఫస్ట్ ఆఫ్ స్లోగా మొదలవుతుంది. అందర్నీ పరిచయం చేసేందుకు సమయం అయిపోయింది అనుకుంటే సెకండ్ ఆఫ్ ఇంకా సాగదీశారు. ఒక్క ముక్కలో చెప్పాల్సిన విషయాన్ని గంటసేపు లాగేశారు. పోని కొత్తగా చూపించారా అంటే అదీ లేదు. అవే పాత యాంగిల్ అన్నట్లుగా అంతా ఊహించినట్లే సినిమాను చూపించారు. ఓన్లీ విశాల్ హీరోయిజంను చూపించారు తప్ప ఆయనకు ధీటుగా పోటి ఇచ్చే విలన్ పాత్రను సరిగా రాయలేదు. అటు పోలిస్ పాత్రకు సత్యరాజ్ న్యాయం చేసినా.., ఆయన్ను వినియోగించువటంలో.., సరైన ప్రాధాన్యత కల్పించటంలో విఫలం అయ్యారు. ఇలా ఇలా సినిమా అంతా విశాల్ వన్ మెన్ షో అని చెప్పవచ్చు.

కళాకారుల పనితీరు

యాక్షన్ సినిమాలు చేయటంలో దిట్ట అన్పించకున్న హరి చేసిన గొప్ప తప్పు ఈ సినిమాగా చెప్పవచ్చు. రివేంజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా చెప్తున్న ఈ సినిమాలో హరి చాలా తప్పులు చేశారు. చిన్న కథకు పెద్ద స్టార్లను పెట్టారు. వారుసరిగానే చేసినా ఉపయోగించుకోవటంలో విఫలం అయ్యార. హీరోను చూపించే ప్రయత్నంలో అందర్నీ పక్కనపెట్టేసి ఘోరమైన తప్పిదం చేశారు. చిన్న కధ కావటంతో సాగతీసే క్రమంలో స్క్రీన్ ప్లే దెబ్బకొట్టింది. ఇక ఇతర విభాగాలను చూస్తే.. నటులు అంతా బాగా చేశారు అని చెప్పాలి.. కాని వారికి సరైన ప్రాధాన్యత లభించలేదు. సినిమాటోగ్రఫిని కొత్త  యాంగిల్స్ లో చూపించారు. అయితే ఈ ప్రయోగాలు కొన్నిచోట్ల ప్రేక్షకులను ఇబ్బందిపెట్టాయి. యువన్ సంగీతం కూడా మైనస్ అని చెప్పాలి. కేవలం సత్యరాజ్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ విషయంలో మాత్రమే సంగీతంకు న్యాయం చేశాడు. ఎడిటింగ్ కూడా పెద్దగా ఏమి చెప్పుదగ్గట్లుగా లేదు. విశాల్ సంస్థ నిర్మాణం బాగానే ఉంది కాని ఇదంతా వృధా ప్రయాస అని చెప్పాలి.

చివరగా..

‘పూజ’ సినిమా కేవలం మాస్ ప్రేక్షకులకు పూజ చేసే ప్రయత్నం.  


కార్తిక్