Teluguwishesh రోమియో రోమియో sai ram shankar latest movie Romeo releases on 10th october : puri jagannath younger brother sai ram shankar latest movie romeo review Product #: 56797 2 stars, based on 1 reviews
  • చిత్రం  :

    రోమియో రివ్యూ

  • బ్యానర్  :

    టచ్ స్టోన్ ఫిల్మ్ ప్రొడక్షన్స్

  • దర్శకుడు  :

    గోపి గణేష్

  • నిర్మాత  :

    దొరై స్వామి

  • సంగీతం  :

    సునీల్ కశ్యప్

  • సినిమా రేటింగ్  :

    22  2

  • ఛాయాగ్రహణం  :

    పి.జి.విందా

  • ఎడిటర్  :

    నవీన్ నూలి

  • నటినటులు  :

    సాయిరాం శంకర్, అడోనిక, రవితేజ తదితరులు....

Romeo Telugu Movie Review

విడుదల తేది :

2014-10-10

Cinema Story

‘రోమియో’ కధ దాదాపుగా ఇటలీలో జరుగుతుంది. హీరో సాయి రామ్ శంకర్ క్యారెక్టర్ పేరు కిట్టు. ఇక హీరోయిన్ సమంత పేరు అడోనిక. హీరోయిన్ కు కొత్త ప్రదేశాలు చూడటం అంటే ఇష్టం. అలా ఇంట్లో ఒప్పించి ఇటలీ లోని రోమ్ నగరం చూసేందుకు వస్తుంది. అప్పటికే అక్కడ కిట్టు ఉంటాడు. ఓ సారి అడోనికను చూసిన కిట్టు అప్పటినుంచి ఆమె వెంటపడటం మొదలు పెడతాడు. అడోనికను వేధిస్తాడు.., పెళ్ళి చేసుకోమని అడుగుతాడు.., పాస్ పోర్ట్ తీసుకుని చాలా ఇబ్బంది పెడతాడు. ఇలా కిట్టు వేధింపులను భరించలేక ఓ రోజు అడోనిక నిలదీయటంతో అసలు విషయం చెప్తాడు. తాను గతంలో ప్రేమించిన పద్దు అనే అమ్మాయి (పద్దు) లా సమంత ఉందనీ.., అందువల్లే తన వెంట పడుతున్నట్లు చెప్తాడు. అయితే ఇదే సమయంలో సమంత సుబ్బరాజు (రాకేష్) అనే వ్యక్తిని ప్రేమిస్తున్నట్లు చెప్తుంది. పద్దును కిట్టు ఎందుకు వదలిలేస్తాడు.., అడోనిక ప్రేమించే సుబ్బరాజు పరిస్థితి ఏమిటి.. చివరికి ఏమవుతుందో తెలుసుకోవాలంటే థియేటర్ కు వెళ్ళి సినిమా చూడండి.

cinima-reviews
రోమియో

విశ్లేషణ

పూరీ జగన్నాధ్ సోదరుడుగా తెలుగు తెరకు సుపరిచితుడు అయిన సాయి రాం శంకర్ కొత్త సినిమా ‘రోమియో’ విడుదల అయింది. సాయి చాలాకాలం తర్వాత సినిమాను చేయటంతో ‘రోమియో’పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. మాస్ క్యారెక్టర్ తో పాటు కాస్త లవ్ కూడా చేయగలడు అనే పేరు తెచ్చుకున్న సాయి ఈ సినిమాలో పూర్తి లవర్ బాయ్ గా చేసినట్లు టైటిల్ చూస్తేనే తెలుస్తుంది. సమంత-సాయి కాంబినేషన్ లో వచ్చిన తొలి సినిమా ఇది. టచ్ స్టోన్ ఫిల్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వచ్చిన ఈ సినిమాను దొరైస్వామి నిర్మించారు. గోపి గణేష్ ‘రోమియో’ను డైరెక్ట్ చేయగా.., సాయి సోదరుడు, డైరెక్టర్ పూరి జగన్నాధ్ స్ర్కీన్ ప్లే సహాయం చేశాడు. ఇక ఈ సినిమాకు సునీల్ కశ్యప్ సంగీతం అందించాడు. ఇవాళ (10-10-2014) విడుదల అయిన ఈ సినమా రివ్యూ మీ కోసం అందిస్తున్నాము.


ప్లస్ పాయింట్స్

సినిమాలో సాయిరాం శంకర్ నటన బాగుంది. దీనికి తోడు గెస్ట్ అప్పియరెన్స్ గా వచ్చిన రవితేజ సీన్లు ప్రేక్షకులకు నచ్చుతాయి. అదే విధంగా సుబ్బరాజు కూడా బాగానే నటించారు. ఇక కామెడి పరంగా అలీ కూడా కన్పించిన చోట ప్రేక్షకులకు కాస్త వినోదం పంచారు. మరొక విశేషం ఏమిటంటే ఈ  సినిమాలో నాగబాబు, ప్రగతి కూడా తలుక్కుమని ప్రేక్షకులను అలరించారు. సినిమాకు కామెడి సహకరించిందనే చెప్పాలి.

మైనస్ పాయింట్స్

కధను పూరి అందించటంతో చాలా బాగుంటుంది అని అంతా అనుకుంటారు. కానీ థియేటర్ కు వెళ్లాక మాత్రం ఇబ్బంది పడక తప్పదు అన్పిస్తుంది. సినిమాను బాగా దెబ్బతీసింది కధే. సినిమాలో హీరో, హీరోయిన్ తప్ప మరొకటి లేదు. సినిమా మొదటి భాగం చాలా నిదానంగా ఉంటుంది. కధ కూడా అంతగా ఏమి బాగాలేదు. రెండు ముక్కల్లో చెప్పాల్సిన కధకు రెండున్నర గంటలు తీసుకున్నారు. దీంతో సాగతీసినట్లు కావటంతో పాటు ఎవరూ పెద్దగా కన్పించకపోవటంతో చూడటానికి బోర్ గా ఉంటుంది. ఇక సినిమా కధకు ఇటలికి సంబంధం లేకపోయినా.., ఎందుకో చాలా భాగం అక్కడే తీశారు. థియేటర్ కు వెళ్ళే ప్రేక్షకుడు ఇటలీలో ఉన్న లొకేషన్లు ఏమిటో తెలుసుకోవచ్చు.. అంతకు మించి ఏమి పెద్దగా లేదు అని చెప్పాలి. హీరో బాగానే నటించింనా డైలాగులు సరిగా లేకపోవటం వల్ల సీన్లు పండలేదు. ఇక హీరోయిన్ విషయానికి వస్తే.., మిగతా సినిమాల్లో గట్టిగా మాట్లాడటానికి కూడా ప్రయత్నించిన సమంత ఈ సినిమాలో మాత్రం చాలా అతిగా చేసిందని విన్పిస్తోంది.  ఎక్కువగా నటించింది. అవసరానికి మించి ఎక్కువగా ఎక్స్ పోజింగ్ చేసింది అని అటున్నారంతా. ఫస్ట్ ఆఫ్ అంతా చాలా స్లోగా సాగిపోతుండగా.. సెకండ్ ఆఫ్ అంతా తెలిసిపోయేలా సన్నివేశాలు ఉంటాయి. ప్రతి సీన్ ను ప్రేక్షకుడు ముందే ఊహించగలడు. అన్నట్లు అప్పటివరకు లవర్ బాయ్ గా ఉన్న సాయి ఇంటర్వెల్ సమయంకు సడన్ గా సైకోలా మారతాడు. ఇదే ఇందులో ట్విస్ట్ అట ఏమింటో మరి. కొత్తదనం లేదు ఇదే సమయంలో కొన్ని సినిమాలను కలిపేసి ఇది తీసినట్లుగా కన్పిస్తుంది.

కళాకారుల పనితీరు

ఏదో ఒక కధ రాయాలి అన్నట్లుగా పూరీ దీన్ని సిద్దం చేశాడు తప్ప... పెద్దగా ఆసక్తి చూపించలేదు అని సినిమా చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. ఈ సినిమాలో ఎక్కడా కధ లేదు. ఇటలీని చూపించటానికే కధను వాడుకున్నారు. కధకు తోడు డైరెక్టర్ కూడా ‘రోమియో’ విషయంలో విఫలం అయ్యాడు. అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుగా సినిమాలో నటులు బాగానే ఉన్నారు. వారి నటన కూడా సరిగానే ఉంది అనుకుంటే కధ, డైరెక్షన్ చెడగొట్టాయి. ‘రోమియో’ను సరైన మార్గంలో తీసుకెళ్ళటంలో గోపి విఫలం అయ్యారని చెప్పాలి. ఇక ఎడిటింగ్ కూడా అంతగా ప్రభావం చూపలేదు. నవీన్ నూలి పనితీరు ఆకట్టుకునేంతగా ఏమి లేదు అనే చెప్పాలి. ఇక కెమెరామెన్ పనితీరు అక్కడక్కడా బాగున్నా.. కొన్నిచోట్ల సరిగా లేదు. సీన్లను షూట్ చేయటంతో పాటు.., లొకేషన్లను క్లియర్ గా చూపించలేకపోయారు. అయితే సినిమాలో పాటలు బాగున్నాయి. ఈ విషయంలో సునీల్ కశ్యప్ ను మెచ్చుకోవాలి. అటు నిర్మాణ సంస్థ కూడా సినిమా కోసం బాగానే కష్టపడింది. లొకేషన్లు, సెట్టింగుల విషయంలో టచ్ స్టోన్ నిర్మాణ విలువలు కన్పిస్తాయి కాని ఏం లాభం శ్రమకు తగ్గట్టుగా కధ ఉంటే బాగుండేది.


కార్తిక్

Movie TRAILERS

రోమియో

play