Teluguwishesh గోవిందుడు అందరివాడేలే గోవిందుడు అందరివాడేలే ramcharan tej latest movie govindudu andarivadele movie review : krishnavamshi kajal and charan creation govindudu andarivadele movie released and review available Product #: 56527 3.5 stars, based on 1 reviews
  • చిత్రం  :

    గోవిందుడు అందరివాడేలే

  • బ్యానర్  :

    పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్

  • దర్శకుడు  :

    కృష్ణవంశీ

  • నిర్మాత  :

    బండ్ల గణేష్

  • సంగీతం  :

    యువన్ శంకర్ రాజా

  • సినిమా రేటింగ్  :

    3.53.53.5  3.5

  • ఛాయాగ్రహణం  :

    సమీర్ రెడ్డి

  • ఎడిటర్  :

    నవీన్ నులి

  • నటినటులు  :

    రామ్ చరణ్ తేజ్(హీరో), కాజల్ ( హీరోయిన్), శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, కమిలినీ ముఖర్జీ, జయసుధ, రహ్మన్ తదితరులు

Govindudu Andarivadele Movie Review

విడుదల తేది :

2014-10-01

Cinema Story

కుటుంబ కధా చిత్రం అని ముందుగానే ప్రకటించిన క్రియేటివ్ కృష్ణవంశీ అందుకు తగ్గట్టుగానే కధను డిజైన్ చేశాడు. సినిమాలో హీరో రామ్ చరణ్ క్యారెక్టర్ పేరు అభిరామ్. ఇక కధలోకి వెళ్దాం.. లండన్ లోనే పుట్టి పెరిగిన భారత సంతతి వ్యక్తి అభిరామ్. విదేశంలో పెరిగినా భారతదేశ ఆచారాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు అంటే అభికి అమితమైన ఇష్టం. ఇక కలుపుకుపోయే గుణం కూడా ఉన్న సుగుణాల వ్యక్తి మన అభిరామ్. ఓ రోజు అభికి భారత దేశంలో తెలుగు రాష్ర్టంలో ఉన్న తన ఫ్యామిలి గురించి తండ్రి ద్వారా తెలుస్తుంది.

అలా తెలుసుకుని సొంత వారున్న ఊరికి వచ్చే అభిరామ్.., మంచివాడైన బాలరాజు (ప్రకాష్ రాజ్) ఇంట్లో చేరతాడు. వారి కష్టాలను తీర్చటంతో పాటు, ఇంటి పెద్ద ఆశయాలను నెరవేరుస్తాడు. కుటుంబంలో ఒకడిని అని తెలయకుండా జాగ్రత్తపడుతూనే ఇదంతా చేస్తాడు. కాని ఒకరోజు విషయం అందరికి తెలిసిపోతుంది. అప్పుడు ఇంట్లోవారు ఎలా స్పందిస్తారు, బాలరాజు ఏమంటాడు. ఇంతకీ ఇండియాలో అభి వచ్చి చేసిన పనులేమిటి వంటి? అసలు వీరు లండన్ లో ఎందుకు ఉన్నారు వంటి విషయాలు తెలుసుకోవాలంటే నేరుగా థియేటర్ కు వెళ్లి సినిమా చూడండి.

 

cinima-reviews
గోవిందుడు అందరివాడేలే

హీరోయిజంకు, మగధీరత్వంకు మార్కులా నిలిచే రామ్ చరణ్ తొలి కుటుంబ కధా చిత్రం ‘గోవిందులు అందరివాడేలే’ సినిమా విడుదల అయింది. ఇప్పటివరకు లవర్ బాయ్ గా, హీరోయిజం ఉన్న సినిమాలతో యూత్ ఐకాన్ గా ఉన్న ఈ సినిమాో పూర్తి ఫ్యామిలి హీరో అయిపోయాడు. కుటుంబమంతా మెచ్చే నటుడుగా పేరు సంపాదించుకున్నాడు. హిట్ పెయిర్ గా భావించే కాజల్ అగర్వాల్ తో క్రియేటిక్ డైరెక్టర్ కృష్ణవంశీ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇళయరాజాకు తగ్గట్టుగా పాటలు రాయగల ఆయన తనయుడు యువన్ శంకర్ రాజా అందించిన పాటలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఇక భారీ బడ్జెట్ సినిమాలు తీసే మెగా ఫ్యామిలి భక్తుడు బండ్ల గణేష్ నిర్మించిన ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా విడుదల అయింది. సినిమా గురించి ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో వారి మదిలో ఉన్న రివ్యూను మీకు అందిస్తున్నాం.

ప్లస్ పాయింట్స్

సినిమాకు కృష్ణవంశీ కధ మొదటి ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. అంటే కుటుంబ కధా చిత్రాలను అందంగా తెరకెక్కించే కృష్ణ.., మరోసారి అద్బుతం చూపించాడు. తన క్రియేటివిటీతో.., తెలుగు ప్రేక్షకులకు మరోసారి కుటుంబ కధా చిత్రం అందించాడు. హైటెక్ యుగంలో మిస్ అవుతున్న కుటుంబ సంబంధాలు, అనుబంధాలు, బాంధవ్యాలను సినిమాలో చూపించాడు. కుటుంబం విలువను చాటేలా చాలా చక్కగా ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇక దీనికి పూర్తి అండగా నిలిచింది హీరో రామ్ చరణ్ తేజ్. సహాయం అందించిన బండ్ల గణేష్. అంతా కలిసి ఉమ్మడి కుటుంబంలా మారిపోయి ఈ ఫ్యామిలి సినిమాను తీసి ప్రేక్షకదేవుళ్ల ముందు ఉంచారు. అంతా ఒక్క చోట చేరే దసరా పండగకు.., కుటుంబమంతా కలిసి చూసేలా చక్కటి సినిమాను ఎంతో కష్టపడి అందించారు.

చరణ్ కు ఇది తొలి ఫ్యామిలి ఎంటర్ టైన్ సినిమా. అయితేనేం ప్రేక్షకులందర్నీ మెప్పించేలా నటించాడు. ఇక్కడ జీవించాడు అనే చెప్పాలి. హీరోయిజంతో అదరగొట్టిన చెర్రీ.., ఫ్యామిలిమెన్ గా ఆకట్టుకున్నాడు. ఈ కధతో అన్ని రకాల క్యారెక్టర్లకు సూటబుల్ హీరో అన్పించుకున్నాడు. మెగా ఫ్యామిలి ఫ్యాన్సే కాదు.., ప్రేక్షకులంతా కూడా సినిమాలో మనోడి క్యారక్టర్ చూసి తెగ కాంప్లిమెంట్లు ఇచ్చేస్తున్నారు. కొడుకు అంటే ఇలా ఉండాలి అని తల్లితండ్రులు అనుకునేలా పాత్రలో లీనమయ్యాడు. సినిమా మొదటి నుంచి చివరి వరకు ప్రతి సీన్ లోనూ వారెవ్వా అన్పించేలా ఉన్నాడు. స్టయిల్ ఫాలో అవుతూనే.., సింపుల్ గా ఉంటూ అన్ని విధాలుగా అదిరిపోయేలా సినిమాలో చెర్రి ఉన్నాడు. ఇక తర్వాత చెప్పాల్సింది చందమామలాంటి హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి. ఇప్పటికే వీరిద్దరికి హిట్ పెయిర్ అని పేరు వచ్చింది. గతంలో ఓ కుటుంబ కధా చిత్రం చేసిన అనుభవ ఉండటంతో.. ఈ సినిమాలో మరింత మంచిగా ప్రేక్షకులను మెప్పించింది. చీరకట్టులో ఉడే అందం ఏమిటనేది కాజల్ ను చూస్తే తెలుస్తుంది.

కధలో సాంప్రదాయంగా, కాస్త మోడ్రన్ గా కన్పించి మెప్పించిన కాజల్, పాటల విషయానికి వచ్చే సరికి మాత్రం గ్లామర్ తగ్గనివ్వలేదు. అల్ర్టా గ్లామర్ డ్రెస్సులతో ఆకట్టుకుంది. కాజల్ కన్పించినంత సేపు అలా చూస్తూ ఉండిపోవాలి అన్పించేలా ఈ సినిమాలో నటించింది. చరణ్ కు మరదలిగా ఇద్దరి కాంబినేషన్ - కెమిస్ర్ర్టి ఆకట్టుకుంది. ఒక్కసారిగా అందరిని ఇంట్లో జరిగే సరదా ఘటనలు గుర్తుకు తెచ్చుకునేలా చేసింది. ఇక మెయిన్ క్యారెక్టర్లలో చెప్పుకోవాల్సింది ప్రకాష్ రాజ్ - జయసుధ గురింది. సహజనటుడుగా పేరు తెచ్చుకున్న ప్రకాష్ రాజ్ మరోసారి ఆ పేరును సార్ధకం చేసుకున్నాడు. చెర్రికి తాతయ్యగా నటించినా.., పాత్రను పోషించటంలో మాత్రం యువకుడిలా మారిపోయి మంచి ఎనర్జిని చూపించాడు. జయసుధకు ఉన్న సుదీర్ఘ అనుభవం.., కుటుంబ మహిళగా ఆమెకున్న స్వీయానుభవం సినిమాలో కొట్టొచ్చినట్లు కన్పించింది. రామ్ చరణ్ కు నానమ్మగా.., ప్రకాష్ రాజ్ భార్యగా చాలా బాగా పాత్రలో ఒదిగిపోయింది. పల్లెటూరిలో రామ్-రాజ్ మద్య ఉన్న సీన్లు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. రామ్ తండ్రిగా చేసిన రెహమాన్ కూడా న్యాయం చేశారనే చెప్పాలి.

చిరంజీవి తమ్ముడుగా భావించే శ్రీకాంత్ కూడా తన పాత్రకు న్యాయం చేశాడు. పనిపాట లేని క్యారెక్టర్ అయినా.., సినిమాకు ప్లస్ అయ్యేందుకు పనికివచ్చాడు. ఫన్నీగా ఉండే శ్రీకాంత్ తో పాటు కమిలినీ ముఖర్జీ కూడా బాగా నటించింది. ట్రెడిషనల్ డ్రస్సులు వేసి ప్రేక్షకుల చూపు తిప్పుకోకుండా చేసింది. కుటుంబ నేపథ్య సన్నవేశాలకు వచ్చేసరిక అంతా పోటిపడి మరి బాగా చేశారు. అందుకే అంత బాగా వచ్చింది అని టాక్ వస్తోంది. ఎక్కడైనా విలనిజం ఉన్నట్లే ఈ సినిమాలో కూడా నెగెటివ్ రోల్స్ ఉన్నాయి. వాటిని పోషించిన ఆదర్శ్ బాలకృష్ణ, రావు రమేష్, కోట శ్రీనివాస్ ఎవరికి వారే సాటి అన్నట్లుగా నటించారు. సినిమా అంటే ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా తీయాలి అనే కృష్ణవంశీ ‘గోవిందుడు అందరివాడేలే’ విషయంలో సరిగ్గా అదే చేశాడు. ముందు నుంచి ప్రేక్షకులకు సినిమాను దగ్గర చేశాడు. ప్రతి క్యారెక్టర్ ను పరిచయం చేసి ప్రతి ఒక్కరి కుటుంబంలో ఎక్కడో సంబంధం వ్యక్తి అన్పించేలా చేశాడు. ఆ తర్వాత క్లైమాక్స్ కు వచ్చే సరికి ప్రేక్షకులు ఎవరికి వారు తమకే ఇదంతా జరుగుతుందనేలా భావిస్తారు. అలా వారిని మెస్మరైజ్ చేసాడు క్రియేటర్. అందుకే ఆయనకు ఆ పేరు వచ్చిందనుకుంటా. ఇక పాటల్లో తన మార్కు చూపే కృష్ణవంశీ.., ఈ సినిమాకు వచ్చే సరికి మరింత కలర్ ఫుల్ గా, మంచి లొకేషన్లు ఎంపిక చేసి షూట్ చేశారు. సరదాగా.., ఎంటర్ టైన్ చేసి ప్రేక్షకులు అందరిని ఈ సినిమా మెప్పిస్తుంది అనే చెప్పాలి.

మైనస్ పాయింట్స్

ఎంత బాగా చేసినా ఏదో ఒక మైనస్ తప్పకుండా ఉంటుంది. ‘గోవిందుడు అందరివాడేలే’ మూవీలో కూడా కొన్ని మైనస్ పాయింట్లు ఉన్నాయి. అందులో ప్రధానమైనది కధ దాదాపుగా పాత్ ఫార్మాట్ లో ఉంది. అంటే హీరో ఒక ఫ్యామిలిలోకి రావటం వారికి మంచి చేసి... మంచి పేరు తెచ్చుకోవటం, బ్లా..బ్లా..బ్లా.. ఇలా అన్ని ఫ్యామిలి సినిమాల్లో ఉన్నట్లే ఇక్కడ కూడా ఉంది అన్పించింది. దీనికి తోడు కామెడి కాస్త తక్కువ అయింది. సినిమా పూర్తిగా కుటుంబ కధా చిత్రం కావటంతో..., ఫ్యామిలిని పరిచయం చేసి, కధను చూపించటానికి ఎక్కువగా సమయం పట్టింది. దీంతో కామెడి సీన్లు కాస్త తక్కువ పడ్డాయి. ఫస్ట్ ఆఫ్ కొంచం నిదానం చేశారు. దీనికి తోడు ఫస్ట్ ఆఫ్ లో ఉన్నంత కామెడి సెకండ్ ఆఫ్ కు వచ్చే సరికి లేదు. దీంతో కధ ఉన్నప్పటికి కామెడి ఉంటే బాగుండు అన్పించింది. మంచి పేరున్న వారిని నెగెటివ్ షేడ్స్ లో పెట్టినా ఫ్యామిలి సినిమా కావటంతో వారిని సరిగా వాడుకోలేకపోయారు. ఇక శ్రీకాంత్ ను సినిమాలో చూపించారు కానీ పాత్రకు జస్టిపికేషన్ ఇవ్వలేకపోయారు. కమలిలిని ముఖర్జీ క్యారెక్టర్ ను కూడా పూర్తిగా వాడుకోలేదు అన్పించింది. ఫ్యామిలి కధ కావటంతో స్టోరీ నేపథ్యంగా వెళ్లటానికి సమయం ఎక్కువగా పట్టింది. ఈ క్రమంలో అన్నింటిని పూర్తిగా కవర్ చేయలేకపోయారు.

కళాకారుల పనితీరు

టెక్నికల్ ఆస్పెక్ట్స్ పై రివ్యూకు ముందుగా ‘గోవిందుడు అందరివాడేలే’ యూనిట్ మొత్తాన్ని అభినందించాలి. ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడి చేయటం వల్లే ఇంత మంచి టాక్ వస్తోంది. ఇక ఒక్కొక్కరి పనితనం గురించి చెప్పాలంటే ముందుగా క్రియేటివ్ కృష్ణవంశీ గురించే మాట్లాడాలి. కొన్నాళ్లుగా కధలు లేవని.., ఎవరూ స్పందించటం లేదని సైలెంట్ గా ఉన్న సృష్టికర్త మరోసారి బయటకు వచ్చాడు. తానేంటో అందరికి చూపించాడు. శిల్పి రాయిని కూడా శిల్పంలా మార్చగల నేర్పరి. అలాంటిది శిల్పమైన రామ్ చరణే కృష్ణవంశీ లాంటి శిల్పి చేతిలో పడితే.., ఎంత అద్బుతంగా చూపగలడో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. ఆ తర్వాత ఆర్ట్ డైరెక్టర్ అశోక్. క్రియేటర్ మైండ్ లో మెదిలే సీన్లకు తగ్గట్లు సెట్ లు చూపించాడు. లొకేషన్లు బ్యూటిఫుల్ అన్పించుకోవటమే కాదు.., సింప్లీసూపర్ అనేలా ఉన్నాయి. ఇక ఆ తర్వాత సినిమాటో గ్రాఫర్ సమీర్ రెడ్డి. ఈయనకు ఉన్న నాలెడ్జ్, టాలెంట్ అంతా ఇందులో బయటపడింది. ప్రతి సీన్ ను నీట్ గా మరియు పూర్తిగా కవర్ చేశాడు. ఎక్కడా లో క్వాలిటీ అనే మాట రాకుండా జాగ్రత్త పడ్డాడు. అందుకే అవుట్ పుట్ అంత ఎక్స్ర్ట ఆర్డినరిగా వచ్చిందన్పిస్తోంది. అన్నట్టు నిర్మాత బండ్ల గణేష్ ను కూడా మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే అంతా లవ్, యాక్షన్ సినిమాలపై బడ్జెట్ పెడుతుంటే గణేష్ మాత్రం కష్టాలకు ఓర్చి కుటుంబ కధా సినిమాకు నిర్మాతగా ఉన్నాడు. ఎంత కష్టం వచ్చినా సినిమాను ఆపకుండా చూసుకున్నాడు. విడుదలకు పలు ఇబ్బందులు ఎదురైనా ఇచ్చిన మాటకు కట్టుబడి అక్టోబర్ 1న విడుదల అని చెప్పి చేసి చూపించాడు.

ఈ సినిమాలో పాటలు బాగున్నాయని టాక్ వస్తోంది. దీని వెనక యువన్ శంకర్ రాజా కష్టం ఉంది. సినిమాకు మ్యూజిక్ అందించిన యువన్.., కధ, విజువల్స్ కు తగ్గట్లు పాటలు అందించాడు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. సినిమాకు మొదటి తీర్పరిగా ఉండే ఎడిటర్ కూడా విజయంలో చెప్పుకోదగ్గ పాత్ర పోషించాడు. ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాకు ఎడిటర్ గా ఉన్న నవీన్ నోలి సినిమా కదకు తగ్గట్లుగా సీన్లు డిజైన్ చేశారు. ఇక చివరగా యాక్షన్ సీన్లు కంపోజ్ చేసిన పీటర్ హెయిన్స్. రామ్ చరణ్ కు తగ్గట్లుగా అదే సమంయలో సినిమా కధను దృష్టిలో పెట్టుకుని ఫైట్లు డిజైన్ చేశారాయన. ఇలా అంతా కలిసి కష్టపడి పనిచేయటంతో ‘గోవిందుడు అందరివాడేలే’ నిజంగా అందరివాడే అన్పించుకుంటున్నాడు.

క్లుప్తంగా

ఈ సినిమా గురించి క్లుప్తంగా చెప్పాలంటే టాలీవుడ్ చరిత్రలో నిలిచిపోయే మూవీ. భవిష్యత్ తరాలకు కుటుంబం బంధాలను చాటి చెప్పేలా సినిమాను తీశారు. ప్రతి ఒక్కరి నటనా బాగుంది. చాలా కాలం తర్వాత వచ్చిన కుటుంబ కధా చిత్రం చాలాకాలం పాటు ఉంటుంది కూడా. క్రియేటివ్ అనే పేరును కృష్ణవంశీ మరోసారి నిజం చేసి చూపారు. పండగకు ప్రతి ఒక్కరూ... కుటుంబ సమేతంగా కలిసి చూసే సినిమాగా చెప్పవచ్చు. తరతరాలు కలిసి చూడాల్సిన కథ ఇందులో ఉంది. ఇక కలెక్షన్ల పరంగా అయితే ఏమి చెప్పనవసరం లేదు. ఇప్పుడున్న సినిమాలు దీనికి పోటి కాదు.., త్వరలో రానున్న సినిమాల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ‘గోవిందుడు అందరివాడేలే’ని నమ్ముకున్న డిస్ర్టిబ్యూటర్లు ఏమాత్రం ఆగమైపోరు.

Movie TRAILERS

గోవిందుడు అందరివాడేలే

play