Teluguwishesh పవర్ పవర్ power movie review : tollywood mass maharaja raviteja power movie review which is directed by writer bobby Product #: 55887 3.25 stars, based on 1 reviews
  • చిత్రం  :

    పవర్

  • బ్యానర్  :

    రాక్ లైన్ ఎంటర్ టైన్ మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్

  • దర్శకుడు  :

    కె.ఎస్.రవీంద్ర (బాబీ)

  • నిర్మాత  :

    రాక్ లైన్ వెంకటేష్

  • సంగీతం  :

    ఎస్.ఎస్.తమన్

  • సినిమా రేటింగ్  :

    3.253.253.25  3.25

  • ఛాయాగ్రహణం  :

    కె.చక్రవర్తి, మోహనక్రిష్ణ

  • ఎడిటర్  :

    గౌతమ్ రాజు

  • నటినటులు  :

    రవితేజ, హన్సిక, రెజీనా

Power Movie Review

విడుదల తేది :

2014-09-12

Cinema Story

తన రౌడీయిజంతో కోల్ కతా మొత్తాన్ని గుప్పెట్లో పెట్టుకున్న గంగూలీ భాయ్ (సంపత్)ని పోలీసులు అరెస్ట్ కోరి కోర్టులో సబ్ మిట్ చేయడానికి బయలుదేరుతారు. అయితే ఇక్కడే ఒక సరికొత్త ట్విస్ట్..! పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ఎంట్రీ ఇచ్చిన బలదేవ్ సహాయ్ (రవితేజ) తన టీం మెంబర్స్ అయిన రాజీవ్(అజయ్), కుందర్(సుబ్బరాజు)తో కలిసి గంగూలీ భాయ్ ని పోలీసుల నుంచి ఎస్కేప్ చేసి అండర్ గ్రౌండ్ లోకి తీసుకెళతారు. అంతటితో సీన్ ముగస్తుంది. ఇక డైరెక్ట్ గా అక్కడి నుంచి సీనిమా కథ జనాలు, ప్రదేశాలు అన్ని వేరే చోటుకి వెళ్లిపోతుంది.

కట్ చేస్తే.. హైదరాబాద్ ప్రాంతం. అక్కడ మాస్ పాత్రలో తిరుపతి(రవితేజ), ఆణిముత్యం(బ్రహ్మనందం) ఎంట్రీ ఇస్తారు. ఎప్పటికైనా పోలీస్ ఆఫీసర్ అవ్వాలనేది తిరుపతి కలలు కంటూ వుంటాడు. ఇంతలోనే తిరుపతికి లక్కీ స్టోన్స్ ఎక్స్పర్ట్ నిరుపమ (హన్సిక) కనిపిస్తుంది. హన్సికతో పాటు సప్తగిరి కూడా కలిసిపోతాడు... ఇక వీరిని రవితేజ ఏడిపించడం జరుగుతూ వుంటుంది. ఇలా సాగుతున్న నేపథ్యంలో అనుకోకుండా రవితేజతో కోల్ కతా హోంమినిష్టర్ అయిన జయవర్ధన్ (ముఖేష్ రుషీ) కలుసుకుంటాడు. పోలీస్ ఆఫీసర్ గా చేస్తానని చెబుతాడు. ఇక అక్కడి నుంచి తిరుపతి ఏం చేసాడు? రవితేజకు ముఖేష్ రుషికి సంబంధం ఏమిటీ? ఇంతకీ బలదేవ్ సహాయ్ ఏమైపోయాడు? హన్సిక తో తిరుపతి ఏం చేసాడు? రెజీనా ఎవరు? రెజీనాకు బలదేవ్ కు ఎంటి సంబంధం అనే సన్నీవేశాలు వెండితెర మీద చూస్తేనే అద్భుతంగా వుంటుంది.

cinima-reviews
power movie review

వరుసగా ఆరు సినిమాల పరాజయం తర్వాత ‘బలుపు’ చిత్రంతో మళ్లీ మాస్ మార్క్ ను నిరూపించుకున్న రవితేజ.. మరోసారి తన ‘పవర్’ సినిమాతో అందరికీ షాకివ్వడానికి ముందుకు వచ్చాడు. ‘బలుపు’ సినిమాకు రచయితగా పనిచేసిన బాబీ ఈ మూవీ ద్వారా దర్శకుడిగా పరీక్షించుకోబోతున్నాడు. హన్సిక, రెజీనా హీరోయిన్లుగా నటించిన ఈ మూవీకి సంగీతం అందించిన ఎస్.ఎస్. థమన్ పాటలు ఇప్పటికే మారుమ్రోగిపోతున్నాయి. ఈ సినిమా ట్రైలర్లు విడుదలైన క్షణం నుంచి సినిమాపై అంచనాలు మరీ భారీగా పెరిగిపోయాయి. మరి ఆ అంచనాలకు తగ్గట్టు రవితేజ ‘పవర్’ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందిందో లేదో తెలుసుకోవాలంటే.. రివ్యూరీలోకి వెళ్లా చూడాల్సిందే!

Cinema Review

నటీనటులు:
మాస్ మహారాజ రవితేజ చాలా రోజుల తర్వాత మళ్లీ ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో అద్భుతంగా నటించాడు. మొత్తం సినిమా తన భుజంమీద వేసుకుని చివరిదాకా నడుపుకుంటూ వచ్చేశాడు. ఒకవైపు పవర్ ఫుల్ ఆఫీసర్ గా మరోవైపు హన్సికతో ఆకతాయి పనులు చేస్తూ పిచ్చెక్కించాడు. ఇక సినిమాలో మరో హీరో బ్రహ్మనందం. ఆణిముత్యంగా బ్రహ్మీ అదరగొట్టగా.. తనతోపాటు సప్తగిరి కూడా ఇరగదీసాడు. హన్సిక అందాలు, రెజీనా నటన చాలా బాగున్నాయి. ఇక మిగతా నటీనటులు వారి వారి పాత్రలకు న్యాయం చేసారు.

సాంకేతిక వర్గం:
ఇంతకాలం రచయితగా కొనసాగిన బాబీ... దర్శకుడిగా తన మొదటి సినిమాను ఎంత అద్భుతంగా రూపొందించాలని అనుకున్నాడో అలాగే తెరకెక్కించాడు. స్వతహాగా రచయిత అయినటువంటి బాబీ, కోనవెంకట్ తో కలిసి ఈ సినిమాకు పవర్ ఫుల్ డైలాగులను, సన్నీవేశాలను రాసుకున్నారు. అలాగే థమన్ సంగీతం సినిమాకు మరింత జోష్ ను అందించింది. చక్రి పాడిన ‘బద్మాష్ పిల్ల...’ రవితేజ పాడిన ‘నోటంకీ...’ ‘నువ్వునేను...’ పాటలు థియేటర్లలో రచ్చ రచ్చ చేస్తున్నాయి. జయంత్ విన్సెంట్ సినిమాటోగ్రఫి విషయంలో జయంత్ విన్సెంట్ ప్రతి సన్నివేశాన్ని చాలా చక్కగా తెరకెక్కించాడు. నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ నిర్మాణ విషయంలో వెనుకాడకుండా భారీగానే నిర్మించాడు.

ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాలో నటీనటులందరూ బాగానే నటించారు. ఒక్కమాటలో చెప్పుకోవాలంటే.. సినిమా అంతా ప్లస్ పాయింటేనని చెప్పుకోవాలి. యాక్షన్, కామెడీ, ఎంటర్టైన్ మెంట్ వంటి ఎలిమెంట్స్ ను డైరెక్టర్ బాబీ సన్నివేశాలకు తగ్గట్టు అద్భుతంగా మలిచాడు.

మైనస్ పాయింట్స్
సెకండ్ హాఫ్ లో కొంచెం సాగదీసినట్లుగా వుంది.

చివరగా:
టైటిల్ కు తగ్గట్టు అందరికీ తన ‘‘పవర్’’తో షాకిచ్చేశాడు.

Movie TRAILERS

పవర్

play