Teluguwishesh రభస రభస Rabhasa movie review : junior ntr latest movie rabhasa has finally released Product #: 55574 2.5 stars, based on 1 reviews
  • చిత్రం  :

    రభస

  • బ్యానర్  :

    శ్రీ లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్

  • దర్శకుడు  :

    సంతోష్ శ్రీనివాస్

  • నిర్మాత  :

    బెల్లంకొండ గణేష్ బాబు

  • సంగీతం  :

    ఎస్ఎస్ తమన్

  • సినిమా రేటింగ్  :

    2.52.5  2.5

  • ఛాయాగ్రహణం  :

    శ్యామ్ కే.నాయుడు

  • ఎడిటర్  :

    కోటగిరి వెంకటేశ్వరరావు

  • నటినటులు  :

    జూనియర్ ఎన్టీఆర్, సమంత, ప్రణీత

Rabhasa Movie Review

విడుదల తేది :

29-08-2014

Cinema Story

కార్తీక్(ఎన్.టి.ఆర్) యుఎస్ లో తన చదువు పూర్తి చేసికొని ఇండియాకి తిరిగి వస్తాడు. ఇంటికి వచ్చిన కార్తీక్ కి తన తల్లి తండ్రులైన నాజర్ – జయసుధలు పెళ్లి చేయాలనుకుంటారు. ఆ సమయంలోనే జయసుధ తన కుటుంబం నుంచి విడిపోయిన తన అన్నయ్య ధనంజయలు(సాయాజీ షిండే) కుమార్తె చిట్టి అలియాస్ ఇందు(సమంత)ని తన ఇంటి కోడలిగా తీసుకురమ్మని కార్తీక్ ని కోరుతుంది.

తల్లి అడిగిన కోరికను తీర్చేందుకు కార్తీక్, ఇందు చవివే కాలేజ్ కి వెళతాడు. అయితే అక్కడ అనుకోకుండా భాగ్యం(ప్రణిత) కార్తీక్ లైఫ్ లోకి ఎంటర్ అవుతుంది. దాంతో ఎన్నో సమస్యల నడుమ అన్ని తప్పించుకొని ఫైనల్ గా కార్తీక్ ఇందుని దక్కించుకునే ప్రయత్నంలో ఉండగా పెద్ది రెడ్డి – గంగిరెడ్డిలు కార్తీక్ లైఫ్ లోకి ఎంటర్ అవుతారు. అసలు ఈ పెద్ది రెడ్డి, గంగి రెడ్డి ఎవరు? అసలు కార్తీక్ కి పెద్ది రెడ్డి – గంగిరెడ్డిలకి ఉన్న సంబంధం ఏమిటి.? కార్తీక్ ఇందుల మధ్య భాగ్యం ఎలా ఎంటర్ అయ్యింది? చివరికి కార్తీక్ తన అమ్మ కోరినట్టుగా ఇందుని పెళ్లి చేసుకున్నాడా.? లేదా? అన్నది మీరు వెండితెరపైనే చూడాలి.

cinima-reviews
rabhasa movie review

ఎన్నో వివాదాల అనంతరం వినాయక చవితి పండుగ సందర్భంగా ‘‘రభస’’ మూవీ ఫైనల్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించారు. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను బెల్లంకొండ గణేష్ బాబు నిర్మించగా.. తమన మ్యూజిక్ అందించారు. గత రెండు సినిమాలు వరుసగా ఫ్లాపు కావడంతో సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న ఎన్టీఆర్.. ఈ మూవీ కామెడీ, సెంటిమెంట్, యాక్షన్ అన్ని సముపాళ్లలో వుండేలా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. మరి ఈ సినిమా ఆయనకు హిట్ అందించిందా.. లేదా.. అనేది తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే!

Cinema Review

ప్లస్ పాయింట్స్ :

గత 2 సినిమాల్లోలాగే ఈసారి కూడా ఎన్టీఆర్ మొదటి ఫ్రేం నుంచి చివరి వరకు మొత్తం సినిమాను తన భుజాల మీదే నడిపించాడు. ముఖ్యంగా కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే సీన్స్ లో, సెకండాఫ్ లో వచ్చే కొన్ని కామెడీ సీన్స్ లో ప్రేక్షకులని బాగా నవ్వించాడు. సమంత ఇందులో కూడా బాగా గ్లామరస్ గానే కనిపిస్తూ.. తన పాత్రకు తగ్గట్టు పెర్ఫార్మన్స్ ఇచ్చింది. ఇక ప్రణిత ఫస్ట్ హాఫ్ లో కనిపించేది కొద్దిసేపే అయినప్పటికీ ఉన్నంతసేపూ లంగావోనిలో అందాలను ఓలకబోస్తూ, అమాయకమైన నటనతో ఆడియన్స్ ని బాగా అట్రాక్ట్ చేస్తుంది. కామెడీ కింగ్ బ్రహ్మానందం ఎంట్రీ సెకండాఫ్ లో లేట్ గా ఇచ్చినా రాజుగారి పాత్రలో ప్రేక్షకులను బాగా నవ్వించాడు. ముఖ్యంగా ఎన్.టి.ఆర్ – బ్రహ్మి మధ్య వచ్చే సీన్స్ బాగుంటాయి.

ఇక ఇతర నటీనటులు జయప్రకాశ్ రెడ్డి, నాగినీడు, సాయాజీ షిండే, అజయ్, నాజర్, జయసుధ తదితరులు తమ పాత్రకు సరైన న్యాయం చేశారు. ఫస్ట్ హాఫ్ లో కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఎన్.టి.ఆర్ – సమంత – ప్రణితల మధ్య వచ్చే కామెడీ సీన్స్ చాలా బాగున్నాయి. అలాగే ఇంటర్వల్ ముందు వచ్చే యాక్షన్ ఎపిసోడ్, క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ సీన్స్ బాగున్నాయి. సెకండాఫ్ కి ఎన్.టి.ఆర్ – బ్రహ్మి కామెడీ సీన్స్ స్పెషల్ అట్రాక్షన్ అయితే, ఫ్యామిలీ ఆడియన్స్ కోరుకునే సెంటిమెంట్ సీన్స్  ఉండడం ఆడియన్స్ కి బోనస్ కిందే చెప్పుకోవాలి.

మైనస్ పాయింట్స్ :

ఫస్ట్ హాఫ్ కుంటే సెకండాఫ్ చాలా స్లోగా అనిపిస్తుంది. ఎన్.టి.ఆర్ – బ్రహ్మి కామెడీ సీన్స్ ని పక్కన పెడితే.. సెకండాఫ్ మొత్తం బాద్షా, రెడీ, దూకుడు మొదలైన సినిమాలను పోలి ఉంటుంది. యాక్షన్ ఎపిసోడ్స్ లో వాడిన గ్రాఫిక్స్ చాలా నాశిరకంగా ఉన్నాయి. చెప్పాలంటే ఆ గ్రాఫిక్స్ లేకుండా యాక్షన్ ఎపిసోడ్స్ తీసి ఉంటే ఇంకా బాగుండేవి.

ఇకపోతే డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ ఎంచుకున్న కథలో కొత్తదనం అనేది జీరో పర్సెంట్. చాలా అంటే చాలా రొటీన్ స్టొరీ. అలాగే సినిమాలో ఉన్న మేజర్ ట్విస్ట్ లని మనం చాలా ఈజీగా ఊహించేయవచ్చు. ఎప్పటిలానే మన రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో అస్సలు కనపడని లాజిక్స్ ఇందులో కూడా మిస్సింగ్.

సాంకేతిక విభాగం :

‘కందిరీగ’ సినిమాతో సక్సెస్ అందుకున్న సంతోష్ శ్రీనివాస్ కి సెకండ్ సినిమా ఎన్.టి.ఆర్ లాంటి బిగ్ హీరోతో చేసే బంపర్ ఆఫర్ వచ్చినా... దానిని పెద్దగా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. అతను ఎంచుకున్న కథ.. ఓ 4 లేదా 5 కమర్షియల్ హిట్ సినిమాల మిక్సింగే! స్క్రీన్ ప్లే – ట్విస్ట్ లు ఎక్కువే కానీ వర్కౌట్ అయ్యే ట్విస్ట్ లేదు.  డైలాగ్స్ – ఎన్.టి.అర్ రేంజ్ కి చెప్పుకోదగ్గ స్థాయికి లేవు.

శ్యాం కె నాయుడు నటీనటుల్ని, సినిమాలో ఉన్న సెట్స్ ని మరియు కొన్ని లోకేషన్స్ ని చాలా బాగా చూపించారు. ఆయన వరకూ సినిమా చాలా గ్రాండ్ గా ఉండేలా చూసుకున్నారు. ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరావు సెకండాఫ్ లో అక్కడక్కడా కూని సాగదీసిన సీన్స్ ని కట్ చేసి ఉంటే బాగుండేది. రామ్ – లక్ష్మణ్, విజయ్ మాస్టర్స్ కలిపి కంపోజ్ చేసిన ఫైట్స్ కొన్ని ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయితే కొన్ని మాత్రం సీన్ కి తగ్గ ఎమోషన్ ని క్రియేట్ చేయలేకపోయాయి. ఎస్ఎస్ తమన్ అందించిన ఆడియోలో జస్ట్ రెండు మూడు పాటలు హిట్ అయ్యాయి, అలాగే తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా కొన్ని సీన్స్ కి హెల్ప్ అయ్యింది, కొన్ని సీన్స్ కి కాలేదు. ఇక చివరిగా బెల్లంకొండ గణేష్ బాబు నిర్మాణ విలువలు బాగా రిచ్ గా ఉన్నాయి.

చివరగా....
చివరికి రసాభాసగానే ముగిసింది.