Teluguwishesh గీతాంజలి గీతాంజలి Geethanjali Telugu Movie Review, Geethanjali Movie Review, Geethanjali Movie Review and Rating, Geethanjali Review, Telugu Movie Geethanjali Review, Geethanjali Movie Stills, Geethanjali Movie Trailer, Videos, Photos, Audio, Gallery, Wallpapers and more on Teluguwishesh.com Product #: 55121 2.5 stars, based on 1 reviews
  • చిత్రం  :

    గీతాంజలి

  • బ్యానర్  :

    ఎమ్.వి.వి. సినిమాస్

  • దర్శకుడు  :

    రాజాకిరణ్

  • నిర్మాత  :

    ఎమ్.వి.వి. సత్యనారాయణ

  • సంగీతం  :

    ప్రవీణ్ లక్కరాజు

  • సినిమా రేటింగ్  :

    2.52.5  2.5

  • ఛాయాగ్రహణం  :

    సాయి శ్రీరామ్

  • ఎడిటర్  :

    ఉపేంద్ర

  • నటినటులు  :

    అంజలి, బ్రహ్మానందం, హర్షవర్ధన్ రానే, శ్రీనివాస్ రెడ్డి

Geethanjali Movie Review

విడుదల తేది :

09-08-2014

Cinema Story

సినిమా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిపోదామని హైదరాబాద్ లోని కృష్ణా నగర్ కి రోజూ చాలా మంది వస్తుంటారు. ఇలా వచ్చిన వారందరిలోనూ శ్రీనివాస్ (శ్రీనివాస్ రెడ్డి) కూడా డైరెక్టర్ అయిపోయి నంది అవార్డు అందుకోవాలనే టార్గెట్ తో వస్తాడు. శ్రీనివాస్ తన ఫ్రెండ్ మధు(మధునందన్) తో కలిసి ఓ ఫ్లాట్ లో దిగుతాడు. అయితే ఇక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. రొటీన్ దెయ్యాల సినిమాల్లోలాగే ఆ ఫ్లాట్ కి ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. దానివల్ల వారు రోజూ పలు ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు.

అనుకోకుండా ఓ జర్నీలో కలిసిన అంజలి(అంజలి) – శ్రీనివాస్ మంచి స్నేహితులవుతారు. ఈ క్రమంలోనే అంజలి రోజూ శ్రీనివాస్ అపార్ట్ మెంట్ కి వస్తూ ఉంటుంది. కట్ చేస్తే అంజలికి ఆ అపార్ట్ మెంట్ కి ఓ సంబంధం ఉంటుంది. అసలు అపార్ట్ మెంట్ కి అంజలికి ఉన్న సంబంధం ఏమిటి? అంజలి కావాలనే శ్రీనివాస్ తో పరిచయం పెంచుకుందా? శ్రీనివాస్ రోజూ ఇబ్బందులు ఎదుర్కోవడానికి వెనక ఉన్న ఫ్లాష్ బ్యాక్ ఏమిటి? ఆ ఫ్లాష్ బ్యాక్ లో ఏం జరుగుతోంది? అలాగే డైరెక్టర్ అవ్వాలని వచ్చిన శ్రీనివాస్ చివరికి డైరెక్టర్ అయ్యాడా? లేదా? అనేది మీరు వెండితెరపైనే చూడాల్సిందే!

cinima-reviews
geethanjali-movie-review

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా ద్వారా తెలుగు చిత్రపరిశ్రమలో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకున్న అంజలి.. ఆ తరువాత దర్శకుడు కళంజియం, పిన్ని భారతితో కుటుంబ గొడవల కారణంగా తెరకు దూరమైంది. ఆ సమస్యల్లోనే రెండు, మూడు సినిమాల్లో నటించినా.. అవి బాక్సాఫీస్ దగ్గర ఫట్ మన్నాయి. దీంతో ఇక సినిమాలకు దూరమయ్యిందనే వార్తలు వచ్చిన నేపథ్యంలో ‘‘గీతాంజలి’’గా తెరముందుకు వచ్చేసింది. ప్రముఖ రచయిత కోనవెంకట్ ఈ సినిమా సమర్పకుడిగానే కాకుండా స్ర్కీన్ ప్లే - మాటలు కూడా అందించాడు. రాజ్ కిరణ్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాకు ఎంవీవీ సత్యనారాయణ నిర్మాతగా వ్యవహరించారు. హారర్, కామెడీతో తెరకెక్కిన్న ఈ సినిమాలో బ్రహ్మానందం, హర్షవర్ధన్ రాణేలు కీలకపాత్రలు పోషించారు. అయితే అంజలి మొదటి సారిగా నటించిన ఈ  హారర్ చిత్రం ప్రేక్షకులను ఎంతగా ఆకర్షించిందో చూద్దాం!

Cinema Review

ప్లస్ పాయింట్స్ :

హీరోయిన్ గా మంచి ఇమేజ్ ఉన్న తెలుగమ్మాయి అంజలి ఈ సినిమాలో నటించడం ఒక పెద్ద ప్లస్. కంటెంట్ విషయం ఎలా వున్నా.. అంజలి ఇమేజ్ ఈ సినిమాకి బాగా హెల్ప్ అవుతుంది. డైరెక్టర్ ఎంచుకున్న పాత్రకి అంజలి న్యాయం చేసింది. ఇక ఈ సినిమాతో హీరోగా పరిచయం అయిన కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి.... ఈ పాత్రకి ఇతనే పర్ఫెక్ట్ అనిపించేంతలా బాగా పెర్ఫార్మన్స్ అందించాడు. కామెడీ సీన్స్ లో అతనికి ఎలాగో అనుభవం ఉంది కాబట్టి వాటి గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు. ఇక హర్రర్ సీన్స్ లో మంచి నటనని కనబరిచాడు. సినిమా మొత్తాన్ని తన భుజాల మీదే నడిపించాడు.

ఇక ఇతర నటీనటుల విషయానికి వస్తే... ‘‘జబర్దస్త్’’ టీవీ షో ద్వారా ఫేమస్ అయిన శకలక శంకర్ చేసిన కామెడీ ఫస్ట్ హాఫ్ లో ప్రేక్షకులను బాగా నవ్విస్తుంది. ముఖ్యంగా అతను శ్రీకాకుళం యాసలో మాట్లాడుతూ రామ్ గోపాల్ వర్మని ఇమిటేట్ చేయడం సూపర్బ్. బ్రహ్మానందం క్లైమాక్స్ సీన్ లో బాగా నవ్వించాడు. రావు రమేష్ పాత్ర ఇందులో కొత్తగా ఉంటుంది. అలాగే అతని పెర్ఫార్మన్స్ కూడా చాలా బాగుంది. అలీ, సత్యం రాజేష్, మధు నందన్ లు తమ పాత్రలకు న్యాయం చేయగా అతిధి పాత్రల్లో కనిపించిన హర్షవర్ధన్ రాణే, దిల్ రాజులు పాత్రల పరిధిమేర నటించారు. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ కామెడీగా సాగిపోవడం వలన ఆడియన్స్ కి ఎక్కడా బోర్ కొట్టదు. అలాగే ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని హర్రర్ సీన్స్ బాగున్నాయి. సెకండాఫ్ లో సప్తగిరి వచ్చేది ఒకే ఒక్క సీన్ అయినా ప్రేక్షకులను బాగా నవ్విస్తుంది. క్లైమాక్స్ ఎపిసోడ్ కాస్త పరవాలేదనిపిస్తుంది.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకి బిగ్గెస్ మైనస్ పాయింట్ అంటే అది సెకండాఫ్ అనే చెప్పాలి. ఇంటర్వెల్ వరకు బాగా సస్పెన్స్ లో పెట్టి అలరించిన ప్రేక్షకులను.. ఆ తరువాత రొటీన్ సన్నివేశాలతో బోర్ కొట్టించారు. అలాగే ఈ సినిమా కథ ప్రేమకథా చిత్రమ్ ఫార్మాట్ లోనే ఉంటుంది. సెకండాఫ్ ఫ్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ నుంచి బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘ఓం శాంతి ఓం’ నుంచి తీసుకొని ఇందులో పెట్టేసారు. దీంతో సెకండాఫ్ లో మీకు ఎక్కడా కొత్తగా అనిపించే చాన్స్ లేదు.

సైతాన్ రాజ్ గా బ్రహ్మానందం పాత్రకి చాలా హైప్ ఇచ్చారు... కానీ సినిమాలో బ్రహ్మానందం పాత్రకి అంత సీన్ లేదు. పైన చెప్పినట్టు క్లైమాక్స్ లో తప్ప మిగిలిన సీన్స్ లో బ్రహ్మి చేత చేయించిన సీన్స్ లో చాలా ఫోర్స్ కామెడీ ఉంటుంది. అలాగే లాజికల్ గా ఈ సినిమాలో చాలా మిస్టేక్స్, లూప్ హోల్స్ ఉన్నాయి.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగంలో మూడు డిపార్ట్ మెంట్స్ డీల్ చేసిన కోనా వెంకట్.. సినిమాకి ఉపయోగపడని కథా విస్తరణ చాలా చేసారు. స్క్రీన్ ప్లే – ఫస్ట్ హాఫ్ కి బాగా రాసారు, సెకండాఫ్ ని ముంచేశారు. డైలాగ్స్ – జస్ట్ ఓకే. ఇక అసలు కథ – దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన రాజ కిరణ్ ఎంచుకున్న కథ పాతదే అయినా.. కొత్తగా చూపించడానికి బాగానే ప్రయత్నించాడు. నటీనటుల నుంచి పెర్ఫార్మన్స్ రాబట్టుకోవడంలో, సీన్స్ ని తీయడంలో బాగా సక్సెస్ అయ్యాడు. కథకి కమర్షియల్ ఎలిమెంట్స్ జత చేసి కాస్త బోర్ కొట్టించాడు. సాయి శ్రీరాం సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. చిన్న బడ్జెట్ సినిమా అయినా ఇచ్చిన లొకేషన్స్ ని చాలా బాగా చూపించాడు. అలాగే ప్రవీణ్ లక్కరాజు పాటలు పెద్దగా ఆకట్టుకోకపోయినా నేపధ్య సంగీతం మాత్రం బాగుంది. ఎడిటర్ ఉపేంద్ర సెకండాఫ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త వహించాల్సింది. అలాగే నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.

చివరగా..

హర్రర్ కామెడీ జోనర్ లో వచ్చిన ‘గీతాంజలి’ సినిమాలో హర్రర్ మిస్ అయ్యింది కానీ కామెడీ హిట్ అయ్యింది. ఈ మూవీకి ఫస్ట్ హాఫ్ ప్రేక్షకులను నవ్విస్తే, సెకండాఫ్ మాత్రం మరీ రొటీన్ గా ముందుకు సాగుతూ ఆడియన్స్ సహనాన్ని పరీక్షిస్తుంది.