Teluguwishesh గాలిపటం గాలిపటం Galipatam Telugu Movie Review, Galipatam Movie Review, Galipatam Movie Review and Rating, Galipatam Review, Telugu Movie Galipatam Review, Galipatam Movie Stills, Galipatam Movie Trailer, Videos, Photos, Audio, Gallery, Wallpapers and more on Teluguwishesh.com Product #: 55120 2.75 stars, based on 1 reviews
  • చిత్రం  :

    గాలిపటం

  • బ్యానర్  :

    సంపత్ నంది టీమ్ వర్క్స్, లాస్ ఏంజిల్స్ టాకీస్

  • దర్శకుడు  :

    నవీన్ గాంధీ

  • నిర్మాత  :

    సంపత్ నంది, కిరణ్ ముప్పవారపు, విజయకుమార్ వట్టికుటి

  • సంగీతం  :

    భీమ్ సెసిరోలియో

  • సినిమా రేటింగ్  :

    2.752.75  2.75

  • ఛాయాగ్రహణం  :

    బుజ్జి. కె

  • ఎడిటర్  :

    రాంబాబు మేడికొండ

  • నటినటులు  :

    ఆది, ఎరికా ఫెర్నాండెజ్, క్రిస్టినా అఖీవా

Galipatam Movie Review

విడుదల తేది :

08-08-2014

Cinema Story

కట్ చేస్తే.. కార్తి (ఆది), స్వాతి (ఎరికా ఫెర్నాండెజ్) కొత్తగా పెళ్లయిన జంట. కొన్నాళ్లపాటు సంతోషంగా జీవితాన్ని కొనసాగించిన వీరిమధ్య అనుకోకుండా గొడవలు ఏర్పడుతాయి. రానురాను వీరిమధ్య తరుచూ గొడవలు జరుగుతూనే వుంటాయి. ఈ క్రమంలోనే వీరిమధ్య ఒక పెద్ద గొడవ జరుగుతుంది. దాంతో వీరు పెళ్లికి ముందు గడిపిన తమ పాత అనుభవాలను గుర్తు చేసుకుంటూ.. పాస్ట్ లైఫే బెటరని ఒక అభిప్రాయానికి వస్తారు.

కార్తి కాలేజ్ లో చదువుకునే సమయంలో పరిణీతి (క్రిస్టినా అఖీవా)ను ప్రేమించి వుంటాడు. కానీ కొన్ని కారణాల వల్ల అప్పుడు వారు విడిపోతారు. ఇక స్వాతి విషయానికి వస్తే.. తాను కాలేజీ సమయంలో వున్నప్పుడు ఆరవ్ (రాహుల్) తనను ప్రేమిస్తున్నాడని చెబుతాడు. కానీ ప్రేమ మీద మంచి అభిప్రాయం లేకపోవడం వల్ల స్వాతి అతని ప్రేమను తిరస్కరిస్తుంది. ఇలా ప్రేమ జీవితాల్ని కాదనుకుని కార్తి, స్వాతిలు వివాహం చేసుకుంటారు.

అయితే కార్తి, స్వాతిలు పెళ్లి చేసుకున్న తర్వాత తరుచూ గొడవలు రావడంతో.. మ్యారీడ్ లైఫ్ నచ్చక విడాకులు తీసుకుని తమ ఎక్స్ లతో సెటిలైపోవాలని నిర్ణయించుకుంటారు. మరి వీరు తీసుకున్న ఈ నిర్ణయాన్ని పెద్దలు అంగీకరిస్తారా..? కార్తి, స్వాతిలు విడిపోతారా..? వీరి ఎక్స్ లు వీరు తీసుకున్న నిర్ణయానికి సమర్థిస్తారా..? అన్న కోణంలో మూవీ సాగుతుంది.

cinima-reviews
Galipatam Movie Review

‘‘ఏమైంది ఈవేళ’’ వంటి చిన్న సినిమాతో దర్శకుడిగా తెలుగుతెరకు పరిచయమైన సంపత్ నంది.. ఆ తరువాత ఏకంగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో ‘‘రచ్చ’’ వంటి కమర్షియల్ హిట్ ని అందుకున్నాడు. దీంతో ఇతనికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘‘గబ్బర్ సింగ్ 2’’ సినిమాకు దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. అయితే గత రెండు సంవత్సరాల నుంచి ఆ సినిమా సెట్స్ పైకి వెళుతుందనే వార్తలు వస్తున్నాయే తప్ప.. ఇంతవరకు ఏ క్లారిఫికేషన్ రాలేదు. దీంతో చాలా గ్యాప్ రావడంతో ఆ సినిమా గురించి ఆలోచించడం పక్కనపెట్టేసి, ‘‘గాలిపటం’’ చిత్రాన్ని తెరకెక్కించాడు. కథ, మాటలు, స్ర్కీన్ ప్లే వంటి తదితర బాధ్యతలు తాను తీసుకుని... నవీన్ గాంధీని పరిచయం చేస్తూ దర్శకత్వ బాధ్యతలు అతనికి అప్పగించాడు. ఆది కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో ఎరికా ఫెర్నాండెజ్, క్రిస్టినా అఖీవా కథానాయికలుగా నటించారు. ఈ సినిమా ప్రమోషన్ల భాగంగా డిఫరెంట్ ప్రోమోలతోపాటు లిప్ లాక్ సన్నివేశాలతో యువకులను రక్తి కట్టించేలా ఆకర్షించిన ఈ సినిమా ఈ శుక్రవారం విడుదలయ్యింది.

Cinema Review

గత సినిమాలతో పోల్చుకుంటే ఆది ఈసారి మంచి నటనను ప్రదర్శించడంతోపాటు మెరుగైన లుక్స్ తో అదిరిపోయాడు. లవ్ అండ్ ఎంటర్ టైన్ మెంట్ కథాచిత్రం కాబట్టి.. యాక్షన్ హీరోగా పేరున్న ఆదికి ఈ సినిమా అంతగా సూట్ అవ్వలేదు కానీ.. కాస్త ఫర్వాలేదనిపించుకున్నాడు. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే.. క్రిస్టినా కంటే ఎరికా ఫెర్నాండెజ్ తన లుక్స్ తో అందరినీ మెస్మరైజ్ చేసేసిందని చెప్పుకోవచ్చు. కొన్నికొన్ని సందర్భాల్లో అద్భుతంగా తన నటననను కనబరిచింది. కానీ కొన్ని చోట్ల మాత్రం పేలవ పెర్మాన్సెన్స్ తో సరిపెట్టుకుంది. ఇక క్రిస్టినా అందం పరంగా చాలానే బాగుంది కానీ.. సీన్లకు తగ్గట్టు ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వడంలో ఫెయిల్ అయిపోయింది.

‘‘అందాల రాక్షసి’’లో నటించిన రాహుల్ క్యారెక్టర్ కూడా అంతంత మాత్రంగానే వుంది. లీడ్ క్యారెక్టర్ లో నటించినా.. అందుకు తగ్గట్టు సరిగ్గా ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఏదో సినిమాలో అవసరముంది కాబట్టి నాటించాడంతే! ప్రగతి సినిమాలో వున్న ఇతర యాక్టర్లకంటే చాలా బాగా నటించింది. సప్తగిరి మరోసారి కొత్తజంట సినిమాలోలాగే బాగా దెబ్బలు కొట్టించుకుని, అందరినీ నవ్వించే ప్రయత్నం బాగానే చేశాడు. ఇక మిగతావాళ్లు తమతమ పాత్రలకు సరిగ్గానే న్యాయం చేశారు.

సాంకేతిక విభాగం :

చిన్న సినిమానే అయినా.. సంపత్ నంది అండ్ కో వారు బాగానే ఖర్చు చేసి రిచ్ గానే తెరకెక్కించారు. దర్శకుడికి మొదటి సినిమా కాబట్టి.. సినిమాను బాగా తెరకెక్కించడంలో బాగానే ప్రయత్నించాడు. అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో ఎంచుకునే బ్యాగ్రౌండ్స్ అంతగా ఆకర్షించినట్లుగా వుండవు. భీమ్స్ సెసిరోలియో వారు అందించిన సంగీతం ఫర్వాలేదు. ముఖ్యంగా అద్నాన్ సమి పాడిన పాట వింటే.. అందరి ప్రేమలోకంలో మునిగిపోవాల్సిందే. సెకండాఫ్ లో వచ్చే మందేసెయ్ మావా పాట కూడా అద్భుతంగా వుంటుంది. బుజ్జి అందించిన ఛాయాగ్రహణం కొన్ని సన్నివేశాల్లో అద్భుతంగా వుంటే.. మరికొన్ని సన్నివేశాల్లో ఫర్వాలేదని సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ఎడిటింగ్ విభాగంలో ఓకే.

చివరగా...

గాలిలో ఎగరాల్సిన ‘‘గాలిపటం’’.. నేలపైనే చక్కర్లు కొడుతున్నట్టుగా వుంది.