Teluguwishesh రారా క్రిష్ణయ్య రారా క్రిష్ణయ్య Ra Ra Krishnayya Review, Ra Ra Krishnayya Telugu Movie Review, Ra Ra Krishnayya Movie Review and Rating, Telugu Ra Ra Krishnayya Review, Ra Ra Krishnayya Movie Stills, Ra Ra Krishnayya Movie Trailer, Videos, Gallery, Wallpapers and more on Teluguwishesh.com Product #: 54126 2.5/5 stars, based on 1 reviews
  • చిత్రం  :

    రారా క్రిష్ణయ్య

  • బ్యానర్  :

    ఎస్.వి.కె. సినిమా

  • దర్శకుడు  :

    మహేష్ . పి

  • నిర్మాత  :

    వంశీకృష్ణ శ్రీనివాస్

  • సంగీతం  :

    అచ్చు రాజమణి

  • సినిమా రేటింగ్  :

    2.5/52.5/5  2.5/5

  • ఛాయాగ్రహణం  :

    శ్రీరామ్

  • ఎడిటర్  :

    మార్తాండ్ కె. వెంకటేష్

  • నటినటులు  :

    సుదీప్ కిషన్, రెజీనా, జగపతి బాబు, కళ్యాణి

Ra Ra Krishnayya Telugu Movie Review

విడుదల తేది :

04 జులై 2014

Cinema Story

కిట్టు (సందీప్ కిషన్ ) నిజాయితీగా బతకాలనుకొని, క్యాబ్ డ్రైవర్ గా పనికి చేరి, తాను సొంతంగా కారు కొనుక్కోవాలనుకొని పైసా పైసా పోగుచేసి తన యాజమాని మాణిక్యం మొదలియార్(తనికెళ్ళ భరణి) దగ్గర ఆరు లక్షల రూపాయల వరకు దాచుకుంటాడు. కానీ మాణిక్యం కిట్టుకి డబ్బులు ఇవ్వకుండా మోసం చేయడంతో ఎలాగైనా తన డబ్బుల్ని రాబట్టుకోవాలని తన ఇంటికి వెళతాడు. అనుకోని పరిస్థితుల్లో మాణిక్యం కూతుర్ని నందీశ్వరిని (రెజీనా ) కిడ్నాప్ చేస్తాడు. తన డబ్బు తనకి ఇచ్చి తన కూతుర్ని తీసుకెళ్ళమని కిట్టు మాణిక్యం కి వార్నింగ్ ఇస్తాడు.

కానీ ఇష్టం లేని పెళ్లిని ఎలా తప్పించుకోవాలని చూస్తున్న నందు కిట్టులో కలిసి తన తండ్రికి కాస్తంత ఎక్కువ డబ్బు డిమాండ్ చేసి తాను కూడా సెటిల్ అయిపోవాలని చూస్తుంది. అలా మొదలైన కిట్టు – నందుల జర్నీ పలు మలుపులు తిరుగుతున్న సమయంలో జగ్గూ భాయ్ మనుషులు నందుని కిడ్నాప్‌ చేస్తారు. అసలు జగ్గుభాయ్ ఎవరు ? కిట్టుకు, జగ్గూభాయ్ కి ఉన్న సంబంధం ఏమిటి ? ఆమెను ఎందుకు కిడ్నాప్ చేశాడు ? అనే విషయాలు తెలియాలంటే ఈ సినిమాను వెండితెర పై చూడాల్సిందే.

cinima-reviews
రారా క్రిష్ణయ్య

టాలీవుడ్ లో ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ ’ సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో సందీప్ కిషన్ కొత్త దర్శకుడు మహేశ్.పి దర్శకత్వంలో ‘రారా క్రిష్ణయ్య ’ అనే సినిమాలో నటించాడు. కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న ఈ సినిమాలో హిట్ ఫెయిర్ గా పేరు తెచ్చుకున్న సందీప్ - రెజీనాలు మరోసారి కలిసి నటించారు. మరి వీరికి ‘ఎక్స్ ప్రెస్ ’ లాంటి హిట్టు వీరి ఖాతాలో పడిందా ? కొత్త దర్శకుడిగా మహేశ్ కమర్షియల్ హిట్ ఇచ్చాడా ? భారీ అంచనాలు పెట్టుకున్న ఈ సినిమా ఆడియన్స్ అనుకున్న రీతిలో ఉందా ? లేదా అనే అనే విషయాల్ని ఈ సినిమా రివ్యూ ద్వారా తెలుసుకుందాం.

బాలీవుడ్ సినిమాను కాపీ కొట్టినా, కథలో పెద్దగా చేర్పులు మార్పులు చేయడంలో వెనకడుగు వేసిన దర్శకుడు హిందీ సినిమా కథ ప్రకారం హీరో, హీరోయిన్ల మధ్య మంచి కెమిస్ట్రీని పండీయడంలో పూర్తిగా విఫలం అయ్యాడు. సినిమాకు హైప్ తీసుకొని రావడానికి జగపతిబాబును విలన్ గా పెట్టుకున్నా, ఆయన కోసం రాసిన సీన్స్ బాగోలేకపోవడంతో ఆయన ఆ పాత్రలో ఉండాల్సిన డెప్త్, స్ట్రాంగ్ నెస్ పూర్తిగా మిస్సింగ్ కావడంతో సెకండాఫ్ చూస్తున్నంత సేపూ జగపతి బాబు పాత్రలో ఏదో మిస్ అవుతోంది. లెజెండ్ సినిమాతో విలన్ గా మంచి పేరు తెచ్చుకున్న ఈయన మరో రెండు మూడు సినిమాల్లో ఇలాంటి పాత్రలు పొషిస్తే ఆయన ఆయన సెకండ్ ఇన్నింగ్స్ క్లోజ్ అవ్వడానికి ఎంతో టైం పట్టదు. ఓవరాల్ గా సెకండాఫ్ ని సాగదీసినట్టు అనిపిస్తుంది. ఫస్టాఫ్ , సెకండాఫ్ లను స్టోరీలో డెప్త్ లేకుండా నడిపించిన ఘనత మహేశ్ కే దక్కుతుంది. ఓవరాల్ గా చూస్తే కృష్ణయ్య ఓ మోస్తరుగా థియేటర్లకు పిలిచి సన పెట్టే సినిమానే అవుతుంది.

Cinema Review

సందీప్ కిషన్ ప్రతి సినిమాలో తన పాత్రలో ఒదిగిపోయి నటిస్తాడనే విషయం గత సినిమాల ద్వారా తెలిసిపోయింది. ఈ సినిమాలో కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు కానీ, కొన్ని సినిమాలు హీరోనే భుజస్కందాల పై మోయాల్సి వస్తుంది. ఇలాంటి సినిమానే ఇది. కానీ సందీప్ ఈ సినిమాను తన భుజాల పై మోయలేకపోయాడు. ఎమోషనల్‌ సీన్స్‌లో కూడా ఫర్వాలేనిపించాడు. సందీప్ తో కలిసి రెండో సినిమా చేస్తున్న రెజీనా పెర్ఫార్మన్స్. నటనలో ఈజ్, బ్యూటిఫుల్ లుక్ మరియు పాటల్లో గ్లామరస్ టచ్ ఈ మూడు కలబోసిన రెజీన ఈ సినిమా పరంగా ఫుల్ మార్క్స్ కొట్టేసి, సినిమాకి ప్లస్ పాయింట్ అయ్యింది. మరోసారి తన టాలెంట్‌ చూపించింది. వంక పెట్టలేని విధంగా నటించి తానేంటో నిరూపించుకొని మంచి భవిష్యత్తు ఉందని నిరూపించుకుంది. ఇక విలన్ పాత్ర పోషించిన జగపతి బాబు తన పాత్ర మేరకు బాగానే చేసినా, ఆయన క్యారెక్టర్ లో స్టఫ్ లేకపోవడం, ఆయన కోసం రాసిన సీన్స్‌ ఆకట్టుకోక పోవడంతో జగపతి బాబు పాత్ర బోరింగ్ గా ఉంది. తాగబోతు రమేష్ తాగుబోతు లవర్ క్యారెక్టర్ లో అక్కడక్కడ నవ్వులు కురిస్తాడు. తనికెళ్ల భరణి క్యారెక్టర్‌ రొటీన్‌ అనిపించింది.  బీహార్‌ కిడ్నాపర్‌గా వేణు, చనిపోయిన తండ్రితో మాట్లాడే పాత్రలో రవిబాబు కాస్త కామెడీ చేసారు. కళ్యాణి, రాజేష్‌ తదితరులు ఫర్వాలేదనపించారు.

సాంకేతిక వర్గం పనితీరు :

అచ్చు స్వరపరిచిన బాణీల్లో టైటిల్‌ సాంగ్‌ ఒక్కటే వినడానికి ఓకే అనిపిస్తుంది. మిగతా పాటలన్నీ యావరేజ్ గా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ దానికన్నా బెటర్ గా ఉంది. సినిమాటోగ్రఫీలో శ్రీ రామ్ తనకు ఇచ్చిన ప్రతి లొకేషన్ ని చాలా బాగా చూపించాడు. మంచి ఎడిటర్ గా పేరు తెచ్చుకున్న మార్తాండ్ వెంకటేష్ ఈ సినిమా పై ఏ మాత్రం శ్రద్ద పెట్టలేదేమో అనిపిస్తుంది. కాస్తంత శ్రద్ద పెట్టి సెంకండాఫ్ ని కత్తిరిస్తే ధియేటర్లో ప్రేక్షకులను నస తప్పేది. దర్శకుడు మహేష్‌బాబు హిందీ సినిమా తేరే నాల్‌ లవ్‌ హో గయా కథకి చేసిన మార్పు చేర్పులు చాలా తక్కువ. చాలా కొద్ది మార్పులు మాత్రమే చేసేసి ఉన్నది ఉన్నట్లు కాపీ కొట్టి వెండితెర పై తన పేరు మాత్రం వేసుకున్నాడు. కాపీ కొడితే కొట్టాడు కానీ, స్టోరీని తెలుగు ప్రేక్షకులకు అభిరుచికి తగ్గట్లు ఆసక్తికరంగా మలచడంలో పూర్తిగా విఫలం అయ్యాడని చెప్పవచ్చు. సినిమా మొత్తమ్మీద ద్వితీయార్థం ఆరంభంలో కాస్త వినోదం పండించగలిగాడు. మిగతా సినిమా అంత బోర్ కొట్టించాడు.

చివరగా : రారా అని జనాలను థియేటర్లకు పిలిచే కృష్ణయ్య వెళ్ళగానే పోపో అంటుంటాడు.