Teluguwishesh ఊహలు గుసగుసలాడే ఊహలు గుసగుసలాడే Oohalu Gusagusalade Review, Oohalu Gusagusalade Telugu Movie Review, Oohalu Gusagusalade Movie Review and Rating, Telugu Oohalu Gusagusalade Review, Oohalu Gusagusalade Movie Stills, Oohalu Gusagusalade Movie Trailer, Videos, Gallery, Wallpapers and more on Teluguwishesh.com Product #: 53698 3/5 stars, based on 1 reviews
  • చిత్రం  :

    గుసగుసలాడే

  • బ్యానర్  :

    వారాహి చలనచిత్రం

  • దర్శకుడు  :

    శ్రీని అవసరాల

  • నిర్మాత  :

    రజని కొర్రపాటి

  • సంగీతం  :

    కళ్యాణి కోడూరి

  • సినిమా రేటింగ్  :

    3/53/53/5  3/5

  • ఛాయాగ్రహణం  :

    వెంకట్‌ సి. దిలీప్‌

  • నటినటులు  :

    నాగ శౌర్య, రాశి ఖన్నా, శ్రీనివాస్‌ అవసరాల, పోసాని కృష్ణమురళి, రావు రమేష్‌, హరీష్‌ తదితరులు

Oohalu Gusagusalade Review

విడుదల తేది :

జూన్‌ 20, 2014

Cinema Story

కథ : వెంకీ ఆలియాస్ (నాగ శౌర్య ) టీవీ న్యూస్ రీడర్ గా సెటిల్ అవ్వాలని అనుకుంటాడు. కానీ మార్కెటింగ్ కి యాడ్స్ కే పరిమితం అవుతాడు. తాను అనుకున్నది సాధించుకోవడానికి తాను పనిచేస్తున్న ఛానల్ బాస్ ఉదయ్  (శ్రీనివాస్ అవసరాల)  తను పెళ్లి చూపుల్లో చూసిన అమ్మాయిని ఇంప్రెస్ చేయటానికి సలహాలు ఇచ్చి, పెళ్లి దాకా తీసుకువస్తే, న్యూస్ రీడర్ పోస్ట్ ఇస్తానని ఆశపెడతాడు. దాంతో బాస్ కి సాయపడదామని బయిలుదేరిన వెంకికి ఓ నిజం తెలుస్తుంది. అది తను గతంలో ప్రేమించి, బ్రేక్ అప్ అయిన అమ్మాయి శిరీష (రాసి ఖన్నా) నే తన బాస్ ఇష్టపడుతున్నాడని....ఆ సమయంలో వెంకీ ఏం నిర్ణయం తీసుకున్నాడు. బాస్‌కీ, మాజీ ప్రేయసికి మధ్య ఇరుక్కున్న వెంకటేశ్వరరావు ఈ ఇరకాటం నుంచి ఎలా బయటపడతాడు? తన కెరీర్‌లో ఎలా సెటిల్‌ అవుతాడు ?  ప్రేమించుకున్న అమ్మాయిని దక్కించుకున్నాడా అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

cinima-reviews
ఊహలు గుసగుసలాడే

టాలీవుడ్ కమేడియన్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి, తనదైన మార్క్ కామెడీతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేసిన అవసరాల శ్రీనివాస్ తనలోని నైపుణ్యాన్ని చాటి చెప్పే ప్రయత్నంలో రొమాంటిక్ కామెడీ స్టోరీతో అందమైన టైటిల్ తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా కొత్త జోనర్ లో సినిమాను తెరకెక్కించాడు. నటుడు నుంచి దర్శకుడుగా మారిన అవసరాల శ్రీనివాస్ డైలాగు రైటర్ గా, ధర్శకుడిగా, ఓ కీలక పాత్ర పోషించిన ఈ లవ్ స్టోరీ టైటిల్ కి తగ్గట్లు ఉందా లేదా ? మాస్, క్లాస్ ఆడియన్స్ ని అలరించే విధంగా అవసరాల ఈ సినిమాను తెరకెక్కించాడా ? ఈ సినిమా రివ్యూ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

విషయం చాలా ఇంట్రస్టింగ్ గా చెప్పటమే...రొమాంటిక్ కామెడీలో అత్యవసరమైనది. ఇదే ఈ సినిమాలో చేశాడు అవసరాల. ఆకట్టుకునే లీడ్‌ పెయిర్‌, అవసరాల శ్రీనివాస్‌ పర్‌ఫార్మెన్స్‌ ఈ చిత్రానికి ప్రధానాకర్షణగా నిలుస్తాయి. హీరో హీరోయిన్ల నడుమ లవ్‌ ట్రాక్‌ని కూడా శ్రీనివాస్‌ బాగా హ్యాండిల్‌ చేసాడు. తనకి కామెడీపైనే కాకుండా ఇతర ఎమోషన్స్‌ని పండిరచే సత్తా కూడా ఉందని చాటుకున్నాడు. కాకపోతే చిన్న చిన్న గ్యాప్స్‌ని ఫిల్‌ చేయడంలో.. చివర్లో ఫీల్‌ని క్యారీ చేయడంలో దర్శకుడిగా పొరపాట్లు చేసాడు. వాటిని కూడా కవర్‌ చేసుకున్నట్టయితే దర్శకుడిగా అతని తొలి ప్రయత్నం మరిన్ని ప్రశంసలు అందుకుని ఉండేది. అక్కడక్కడా కాస్త ల్యాగ్‌ ఉంది కానీ.. ఓవరాల్‌గా క్లాస్‌ అప్పీల్‌ ఉన్న రొమాంటిక్‌ కామెడీలు ఇష్టపడే ప్రేక్షకులకి ‘ఊహలు గుసగుసలాడే’ నచ్చుతుంది.

Cinema Review

నాగ శౌర్య తొలి సినిమా అయినా ఎక్కడా ఆ ఫీల్ రాకుండా బాగా నటించాడు. తాను పోషించిన పాత్రకు తగిన న్యాయం చేశాడు. హీరోయిన్ గా తొలి సినిమ చేసిన రాశి కన్నా తన నటనతో, అభినయంతో ఆకట్టుకుంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యింది. వెంకీకి బాస్ పాత్రలో అవసరాల శ్రీనివాస్‌ బాగా చేశాడు.  డైరెక్టర్‌గా చేస్తూనే ఈ సినిమాలో పర్‌ఫెక్ట్‌గా క్యారెక్టర్ ని సెలక్ట్‌ చేసుకున్నాడు.  ద్వితీయార్థంలో ఈయనే చాలా సీన్స్‌  హైలైట్‌గా నిలిచాడు. ఈ సినిమాలో  హరీష్‌ కామెడీ పెద్దగా ఆకట్టుకోదు. సీనియర్ నటులు పోసాని కృష్ణమురళి, రావు రమేష్ వారి వారి పాత్రల మేరకు రాణించారు. ఇతర నటీనటులు పాత్రలకి తగినట్టు నటించారు.

సాంకేతిక వర్గం పనితీరు:

సినిమాలో కథ, కథనం బాగున్నా కెమెరా పనితనం అంతగా అనిపించక పోతే సినిమా గుడ్ ఫీల్ అనిపించదు. కానీ ఈ సినిమాకు సినిమాటో గ్రఫీ అందించిన చాలా బాగుంది. ప్రతి సీన్ ని చాలా అందంగా చూపించాడు. ఈ సినిమాకు మరో హైలెట్ సంగీతం. కళ్యాణి కోడూరి అందించిన పాటలు వినసొంపుగా, సినిమా టైటిల్ కి తగ్గట్లుగా ఆహ్లాదంగా ఉన్నాయి సినిమా నేపథ్యం సంగీతం కూడా ఈ సినిమా ఫీల్ గుడ్ రావడానికి దోహద పడింది. దర్శకుడిగా, డైలాగ్ రైటర్ గా అవసరాల తన ప్రతిభను చాటాడు. ప్రాస డైలాగులు, అర్థం పర్ధం లేని పంచ్ లతో విసిగెత్తిన సినిమా ప్రేక్షకులకు చక్కని టైమింగ్ కామెడీ డైలాగులతో ఆకట్టుకున్నాడు. మొదటి సినిమాకి దర్శకుడిగా సక్సెస్ సాధించినట్లే. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. సినిమాకు తగ్గట్లు ఖర్చు చేశారు. చిన్న సినిమా అయినా చాలా రిచ్ గా, క్లాస్ గా తెర కెక్కించారు.

చివరగా: ఊహలు గుసగుసలాడే ... ఫీల్ గుడ్ మూవీ