Teluguwishesh యాక్షన్ 3D యాక్షన్ 3D Action 3D Telugu Movie Review, Telugu Action 3D Movie Review, Allari Naresh Action 3D Telugu Movie Review, Action 3D Telugu cinema Review, Action 3D Telugu Movie Rating, Action 3D Review, Action 3D Rating, Action 3D, Allari Naresh Action 3D Review, Action 3D Telugu Movie Rating, Allari Naresh, Kamna Jethmalani, Sneha Ullal, videos, Action 3D trailers, Telugu movie Action 3D photos, wallpapers and more on teluguwishesh.com. Product #: 45442 2.5/5 stars, based on 1 reviews
  • చిత్రం  :

    ‘యాక్షన్ ’ 3డీ

  • బ్యానర్  :

    ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఇండియా ప్రై.లి.

  • దర్శకుడు  :

    అనిల్ సుంకర

  • నిర్మాత  :

    సుంకర రామబ్రహ్మం

  • సంగీతం  :

    బప్పీలహరి

  • సినిమా రేటింగ్  :

    2.5/52.5/5  2.5/5

  • ఛాయాగ్రహణం  :

    సర్వేష్ మురారి

  • ఎడిటర్  :

    ఎం.ఆర్.వర్మ

  • నటినటులు  :

    అల్లరి నరేష్‌, వైభవ్‌, కిక్‌ శ్యామ్‌, స్నేహా ఉల్లాల్‌, తదితరులు

Action 3d Telugu Movie Review

విడుదల తేది :

21 జూన్ 2013

Cinema Story

బాలవర్థన్ బావ (అల్లరి న‌రేష్‌)) , శివ (వైభ‌వ్), పురుష్ (రాజు సుంద‌రం), అజ‌య్ (కిక్ శ్యామ్‌ ఈ నలుగురూ చిన్నటి నుండి మంచి స్నేహితులు. ఈ నలుగురు భిన్న మనస్త్వత్వాలు కలిగి ఉంటారు. ఈ నలుగురిలో అజయ్ పెళ్లి కుదురు తుంది. వీరందరు బ్యాచిలర్ పార్టీ చేసుకోవడానికి హైదరాబాద్ నుండి గోవాకు వెళతారు. అక్కడికి వెళ్లిన వీరు రాత్రి మందు పార్టీలో ఫుల్లుగా మధ్యం తాగి పడిపోతారు. తెల్లవారి లేచేసరికి అనకోని సంఘటన. చుట్టూ గంగరగోళం. ఏం జరిగిందో ఎవరికి తెలియదు ? మరి ఆ రాత్రి ఏం జరిగింది ? వీరి గదిలోకి పులి ఎలా వస్తుంది ? వారికి ఏర్పడ్డ అవాంతరాల నుండి వారు ఎలా బయటపడతారు ? మార్గ మధ్యంలో కొన్ని సంఘటనలు ఏంటి ? భిన్న స్వభావాలు కలిగిన వీరు వారు అనుకున్న లక్ష్యాలను చేరారా లేదా అన్నదే కథ. దీన్ని వెండితెర పై వీక్షించాల్సిందే.

cinima-reviews
యాక్షన్ 3D

ఈ మధ్య కాలంలో తెలుగు ఇండస్ట్రీలో రచయితలు, నిర్మాతలు దర్శకుల అవతారం ఎత్తి సినిమాలు చేసేస్తున్నారు. ఇక సినిమాల్లో వచ్చిన ఆధునిక టెక్నాలజీతో ప్రేక్షకులను రంజింపజేయాలని చూస్తున్నారు. మరి కొందరు అయితే దర్శకత్వం పై ఉన్నమోజుతో ఆ సరదా తీర్చుకోవడానికి సినిమాల మీద ప్రయోగాలు చేస్తున్నారు. ప్రముఖ నిర్మాతగా పేరు  తెచ్చుకున్న అనిల్ సుంకర కూడా దర్శకత్వం పై ఉన్న మోజుతో ఇండియాలోనే మొట్టమొదటి కామెడీ 3డీ చిత్రంగా ‘యాక్షన్ ’ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించాడు. కామెడీకి బ్రాండ్ అంబాసిడర్ హీరోగా పేరు తెచ్చుకున్న అల్లరి నరేష్ ఇందులో మొయిన్ రోల్ పోషించాడు. ఇంత వరకు బాగానే ఉన్నా, అత్యాధునిక హంగులతో  ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల్ని సరికొత్త అనుభూతికి లోను చేసిందో లేదో ఈ రివ్యూ ద్వారా చూద్దాం.

 

తన దర్శకత్వ సరదా తీరడం కోసం భారీగా ఖర్చుపెట్టి, ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి తొలి తెలుగు 3డి చిత్రాన్ని రూపొందించాలనే భావన వచ్చినందుకు మొదట దర్శకుడిని మెచ్చుకొని తీరాల్సిందే. అయితే ఎంత ఆదునికతను, టెక్నాలజీని ఉపయోగించి సినిమా తీయాలని అనుకున్నా దానికి తగ్గ కథ, కథనం ఉండాలి. దర్శకుడు ఏ సినిమాను చూసి స్ఫూర్తి పొంది కథను రాసుకున్నా, దాని తాలూకు ఛాయలు కనిపించకుండా ఇక్కడి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు తీయాలి. కానీ ఈ సినిమా హాలీవుడ్ సినిమా ‘హ్యాంగోవర్ ’ ని స్ఫూర్తి పొంది, అందులోని చిన్నపాయింట్ ని తీసుకొని కథ రాసుకున్న దర్శకుడు ఆ చిత్రం ఛాయల్ని మరచిపోకుండా అనుసరిస్తున్నాడని అనిపిస్తుంది. త్రీ డీ సినిమా అంటేనే వాయువేగంలో దూసుకెళ్లాలి. అలాంటప్పుడే ప్రేక్షకుల ఆ సినిమా ఫీలింగ్ కలుగుతుంది. కానీ ఈ సినిమా దర్శకుడు సినిమాలో మేటర్ లేకుండా సినిమాను సాగదీస్తూ, ఎంత నవ్వుదామన్న ప్రేక్షకుడి నవ్వురాని కామెడీ సీన్లు పెట్టి, ఎప్పుడు సినిమా అయిపోతే బాగుండు అన్న ఫీలింగ్ తీసుకొచ్చాడు. కామెడీ సినిమాలు చేయడం అంటే మామూలు విషయం కాదు. స్టోరీలోనే కామెడీ ఉండాలి కానీ, స్టోరీనే కామెడీ పరంగా తీసేసీ జనాల మీదికి వదిలితే ఏదైనా చూసేస్తారనుకోవడం దర్శకుడి మూర్ఖత్వం అవుతుంది. కామెడీ అంటే నవ్వుకోవాలనే కానీ, దానిని భారంగా ఫీలవ్వకూడదు ప్రేక్షకుడు. ఇంత ఖర్చు పెట్టి త్రీడీలో సినిమా తీసేశాం కదా ఎలాగైనా చూస్తరనుకోవడం భ్రమే అవుతుంది. ఇలాంటి 3డీ సినిమాను మల్టీ ప్లెక్స్ ల్లో 150 పెట్టి తలనొప్పి తెచ్చుకుంటామంటే మీ ఇష్టం.

Cinema Review

అల్లరి నరేష్ తనదైన కామెడీతో ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో ముందుంటాడు. ఈ సినిమాలో కూడా అల్లరి నరేష్ పాత్ర కూడా కొత్త గెటప్ లో అల్లరి అల్లరిగానే ఉంది. ఈయన ప్రేక్షకుల్ని బాగానే నవ్వించాడు. పురుష రాజు పాత్ర వేసిన రాజు సుందరం ఆ పాత్రలో చాలా చక్కగా ఒదిగి పోవడమే కాకుండా ఆ పాత్రలో జీవించి తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. వైభవ్ డాక్టర్ మెచ్యూర్డ్ గా నటించాడు. కిక్ శ్యామ్ పాత్రకు పెద్దగా ఇంపార్టెన్స్ లేదు. సినిమాలో ఈయన నివిడి రానురాను బాగా తగ్గింది. ఈ సినిమాలో చాలా మంది నటులే కనిపించినా వారి పాత్రలు పెద్దగా చెప్పుకోవడానికి లేకపోగా, వారు చేసిన పాత్రలు అన్ని కలగూర గంపలాగా చిందర వందరగా అనిపిస్తాయి. సునీల్ కొంత సేపు కనిపించి నవ్విస్తాడు. సుదీప్ రోల్ హైలెట్ ఉంటుందని చెప్పుకొస్తున్నా ఆయన గురించి చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. నీలం ఉపాధ్యాయ్ ఉన్న సీన్స్ తక్కువే అయినప్పటికీ ఉన్న సీన్స్ లో నటన బాగుంది, నటన కన్నా గ్లామరస్ తో బాగా ఆకట్టుకుంది ముఖ్యంగా ‘ఊలాల్లా’, స్వాతి ముత్యపు జల్లులలో’ పాటలలో బాగా గ్లామరస్ గా కనిపించింది. స్నేహ ఉల్లాల్ మరోసారి తన గ్లామర్ తో ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. షీన, రీతు బర్మేచ, కామ్న జఠ్మలానీలు పాత్రలు సోసోగా అనిపిస్తాయి.

సాంకేతిక విభాగం :
ముఖ్యంగా ఈ సినిమా లో చెప్పుకోవాల్సింది ఏంటంటే 3డి టెక్నాలజీ గురించి. ఈ సినిమా ప్రారంభం అయిప్పటి నుండి 3డీ ఎఫెక్ట్స్ లో రాబోతున్న తొలి కామెడీ తెలుగు చిత్రం అని ప్రచారం చేశారు. ఈ సినిమా లో 3డి విజువల్ ఎఫెక్స్ట్ కొన్ని సీన్స్ చాలా బాగా వచ్చాయి. ఈ కొన్ని సీన్సే ఈ చిత్రాన్ని కొంత వరకు నిలబెట్టాయని చెప్పవచ్చు. త్రీడీ సన్నివేశాలను కంటికి ఇంపుగా చూపించడంలో స్టీరియో గ్రాఫర్  కీత్ పనితనం ఏమిటో స్పష్టంగా కనిపిస్తుంది. ఎడిటింగ్ విభాగానికి వస్తే... కొన్ని సీన్లు బాగా లెన్తీగా ఉన్నాయి వాటిని కట్ చేసి ఉంటే ఎడిటింగ్ ఫర్వాదేనిపించేది. ఈ సినిమాకి సంగీతం అందించిన బప్పిలహరీ కొన్ని సాంగ్స్ బాగున్నాయి. ముఖ్యంగా ‘స్వాతి ముత్యపు జల్లుల పాట ’ ఒక్కటి బాగా ఆకట్టుకుంటంది. కానీ నేపధ్య సంగీతం అంతగా కుదరలేదు. స్ర్కీన్ ప్లే విషయంలో ఫస్టాఫ్ అంత పెద్దగా ఆకట్టుకోక పోయినా సెకండాఫ్ ఫర్వాలేదనిపిస్తుంది. ఈయన రాసుకున్న సీన్స్ కొన్ని ఫర్వాలేదనిపించినా, ఇంకాస్త బెటర్ గా రాసుకొని తీయాల్సింది. . దర్శకుడికి ఇదే తొలి సినిమా అయినా నటీనటుల దగ్గరి నుండి సాధ్యమైనంత వరకు నటనను లాక్కున్నాడు. స్టోరీ విషయంలో ఫస్టాఫ్ లోని బాగానే నడిపించినా, సెకండాఫ్ లో మాత్రం తడబడ్డాడు.

chivaraga

 కామెడీని సినిమాను ‘3డి ’ లో తీయాలని అనుకున్న దర్శకుడు దానికి తగ్గట్టు కథను తయారు చేసుకోక పోక పోవడంతో 3డిలో ‘యాక్షన్ ’ కామెడీ మిస్సయింది.