నవ్వే ఆమె అందం.. ఆమె చూపులో ఓ మత్తు వుంటుంది.. ఆమత్తులో ఎవరైనా గమ్మత్తుగా చిత్తవ్వాల్సిందే.. నేపాలీ ముఖ కవళికలతో కొన్నేళ్ల క్రితం ఈ కొంటె కళ్ల కోణంగి బాలీవుడ్ ని షేక్ చేసింది. కుర్రాళ్ల గుండెల్లో చిచ్చు రేపింది. కానీ మనీషా కొయిరాలా ముఖంలో ఇప్పుడు నవ్వు మాయమైపోయింది. ఎంతో ఇష్టపడి, కష్టపడి చేసుకున్న ప్రేమ పెళ్లి కాస్తా పెటాకులయింది. ఓ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లో చాటింగ్ లో కొచ్చిన ఓ నేపాలీ పోరగాడితో మనీషా ప్రేమాయణం నెరపింది. ఆపై ఇద్దరూ ఇష్టపడి సంప్రదాయ నేపాలీ
పద్ధతిలో పెళ్లి కూడా చేసుకున్నారు. కొత్త సంసారం, కొత్త జంట.. హాయిగా వున్నారనుకున్నారంతా. కానీ రెండేళ్లయినా నిండకుండానే మనీషా సంసారంలో కలతలు మొదలయ్యాయి. చీటికీ, మాటికీ గొడవలు పడిపోయే, పరిపక్వత లేని వయసుకాదు ఇద్దరిదీ. మనీషా దాదాపు 40వ పడిలో పడ్డాకే పెళ్లాడింది. అయినా ఈ నేపాలీ భామకి పెళ్లెందుకో అచ్చిరాలేదనే చెప్పాలి.
నేపాలీ వాణిజ్య వేత్త సమ్రాట్ దహల్ మనీషాను ఇష్టపడే పెళ్లి చేసుకున్నా ఆమె ప్రవర్తన నచ్చక గుడ్ బై కొట్టేశాడని కథనం. పెళ్లయిన మూణ్ణెల్లకే ఇద్దరి మధ్యా కలతలు రేగాయి. పెళ్లికి ముందు ఎలా తిరిగినా పెళ్లయ్యాక కూడా మనీషా అంతే స్వేచ్ఛగా పబ్బులు, క్లబ్బులంటూ తిరుగుతూ ఇంటికి దూరమవడంతో సమ్రాట్ దహాల్ కంగు తిన్నాడు. ఆర్నెల్లయినా తిరగకుండానే ముద్దుగుమ్మ కాస్తా బొద్దుగుమ్మగా మారిపోయింది. పార్టీల్లో పూర్తిగా తప్ప తాగి, బాయ్ ఫ్రెండ్స్ తో అదుపు తప్పిపోయిన మనీషా ప్రవర్తన ఆనోటా ఆనోటా బాలీవుడ్ లోనూ సంచలనం రేపాయి.
లేట్ నైట్ పార్టీలలో బాయ్ ఫ్రెండ్ లతో గడిపి ఇంటికి తూలుకుంటూ వచ్చే మనీషా పద్ధతి చూసి విసుగు పుట్టిన దహాల్ విడాకులకు సిద్ధపడ్డాడట. పెటాకులయిపోతున్న తన సంసారాన్ని నిలబెట్టుకోడానికి మనీషా తన పద్ధతి మార్చుకునే ప్రయత్నమూ చేసిందట. గుళ్లూ, గోపురాలు, మఠాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు సందర్శించడమే కాదు కొన్ని చోట్ల కౌన్సిలింగ్ కూడా తీసుకుందిట. చివరి ప్రయత్నంగా చెన్నై లోని వన్ నెస్ యూనివర్సిటీలో ప్రత్యేక సదస్సుకు కూడా హాజరైంది ఈ ముద్దుగుమ్మ. కానీ లాభం లేకపోయింది. సమ్రాట్ దహాల్, మనీషా విడిపోతున్నారన్న వార్తలు నిజమేనని తేలడంతో మనీషా అభిమానులు అయ్యో పాపం అంటున్నారు. తమిళంలో ధనుష్, హన్సిక జంట నటించిన మప్పిలాయ్ చిత్రంలో మనీషా చివరి సారిగా కనిపించింది.
...avnk