హీరోయిన్ త్రిష. సీనియర్ హీరోలతోనూ...కుర్ర హీరోలతోనూ ఏకకాలంలో ఆడిపాడుతూ అన్ని వర్గాల ప్రేక్షకులను తనదైన శైలిలో అలరించింది. కెరీర్ ప్రారంభించిన దగ్గరనుంచి వరుస సినిమాలు చేస్తూ మిగతా కథానాయికలకు గట్టి పోటీ ఇచ్చింది. ఒకప్పుడు డేట్లు సర్దుబాటు చేయడానికి సతమతమైపోయిన త్రిష, ఇప్పుడు తీరుబడిగా పార్టీలకు-ఫంక్షన్లకు హాజరవుతోంది. తన సొంతింటిని తన అభిరుచికి తగ్గట్టుగా తీర్చిదిద్దుకోగలుగుతోంది. అందుకు కారణం మునుపెన్నడూ లేనివిధంగా ఆమె ఖాళీగా వుండటమే. ఔను...ఇప్పుడామెకి తెలుగులో పూర్తిగా సినిమాలు తగ్గిపోయాయి. తనతోటి వాళ్లు రెండేసి సినిమాలు చేస్తుంటే ఆమె ఒక్కటి కూడా చేయకపోవడమే ఇందుకు నిదర్శనం. ఈనేపథ్యంలో త్రిష తమిళ సినిమాలు మాత్రమే అంగీకరిస్తూ, హిందీ సినిమాలని మాత్రం నిరాకరిస్తోంది. సాధారణంగా హిందీ సినిమాల నిర్మాణానికి చాలాకాలం పడుతుంది. ఈలోగా తాను తెలుగు సినిమాలకి మరింత దూరం అవుతానేమోనన్న ఆందోళనతోనే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
...avnk