క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తాను చేస్తున్న సినిమా క్లైమాక్స్ లో మహేష్ బాబు షర్ట్ లేకుండా కనిపించనున్నాడనీ ...
ఓ సన్నివేశంలో తన కండల శరీరాన్ని చూపించి అభిమానులను అలరించనున్నాడనే వార్తలు ఈ మధ్యకాలంలో షికార్లు చేస్తున్నాయి. ఇందుకు అవసరమైన ఫిట్ నెస్ కోసం ఆయన అమెరికా నుంచి ఫిట్ నెస్ ట్రైనర్ ని రప్పించుకున్నాడనే ప్రచారం జరుగుతూ వస్తోంది. ఈ విషయం గురించి మహేష్ బాబు తాజాగా ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ, తాను ఫిట్ నెస్ ట్రైనింగ్ తీసుకుంటున్న మాట వాస్తవమేనని అంగీకరించారు. హాలీవుడ్ హీరోలకి ఫిట్నెస్ ట్రైనింగ్ ఇచ్చిన జార్జ్ జోజోన్ తనకి ట్రైనింగ్ ఇస్తున్నారని చెప్పారు. అయితే ఈ ట్రైనింగ్ తీసుకుంటున్నది సినిమా కోసం కాదనీ ... కేవలం తన ఫిట్ నెస్ ని మెరుగు పరుచుకోవడం కోసమేనని స్పష్టం చేశారు. సిక్స్ ప్యాక్ మెయిన్ టైన్ చేసే ఉద్దేశం తనకి లేదన్నాడు మహీ..
...avnk