తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా వున్న బొద్దుగుమ్మ హన్సిక, తాజాగా జాక్ పాట్ లాంటి ఆఫర్ కొట్టిందనే వార్తలొస్తున్నాయి. బాలీవుడ్ టాప్ స్టార్ హృతిక్ రోషన్ పక్కన నటించే చాన్స్ కొట్టేసిందట. హృతిక్ కథానాయకుడుగా రూపొందనున్న ఓ భారీ హిందీ చిత్రంలో కథానాయిక పాత్ర కోసం హన్సికని సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది. హృతిక్ వంటి హీరో నుంచి ఆఫర్ రావడంతో ఆమె ఎగిరిగంతేసి అందుకు ఒప్పుకున్నట్టు బాలీవుడ్ సమాచారం. ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్ కి వెళుతుందట. పూర్తి వివరాలు త్వరలో అధికారికంగా వెలువడే అవకాశం వుంది. విశేషం ఏమిటంటే, గతంలో హృతిక్ నటించిన 'కోయి మిల్ గయా' చిత్రంలో హన్సిక బాలనటిగా నటించిన సంగతి మీకు తెలుసా.....
...avnk